ఏపీలో తెరుచుకోనున్న విద్యాల‌యాలు..అంగీకారం మాత్రం త‌ప్ప‌నిస‌రి..!


అమ‌రావ‌తి :
కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఏపీ  ప్ర‌భుత్వం అన్‌లాక్ -4 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంట‌ర్ విద్యార్థులు విద్యాల‌యాల‌కు వెళ్లేందుకు అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనికోసం త‌ల్లిదండ్రుల రాత‌పూర్వ‌క అంగీకారం త‌ప్ప‌నిస‌రి చేసింది. అంతేకాకుండా అదే రోజు నుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా  క‌ళాశాల‌ల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరుచుకునేందుకు అనుమ‌తినిచ్చింది. 100 మందికి మించ‌కుండా సామాజిక‌, విద్య‌, క్రీడ‌లు, మ‌త‌ప‌ర‌మైన‌, రాజ‌కీయ స‌మావేశాలు నిర్వ‌హించుకోవాల‌ని సూచించింది. ఈ నెల 20 నుంచి పెళ్లిళ్ల‌కు 50 మందిని, అంత్య‌క్రియ‌ల‌కు 20 మందికి అనుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియోట‌ర్ల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్కుల‌కు అనుమ‌తి నిరాక‌రించింది. 

9 మంది ప్ర‌యాణికుల‌తో ప్ర‌త్యేక రైలు

చెన్నై: కోయంబ‌‌త్తూరు నుంచి చెన్నైకు 16 బోగీల‌తో బ‌య‌లు దేరిన ప్ర‌త్యేక‌రైలు కేవ‌లం 9 మంది ప్ర‌యాణికుల‌తో న‌డిచింది. లాక్‌డౌన్ స‌డ‌లింపుల అనంత‌రం ఈ నెల 5న రాత్రి 9 గంట‌ల‌కు కోయంబ‌త్తూరు  నుంచి చెన్నైకు 16 బోగీల‌తో ప్ర‌త్యేక రైలు న‌డిపారు. క‌రోనా భ‌యంతో కేవ‌లం 9 మంది మాత్ర‌మే ఇందులో ప్ర‌యాణించారు. వారిలో జేఈఈ మెయిన్స్‌కు హాజ‌రైన విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ప్ర‌యాణించ‌గా వారికి రైల్వే స్టేష‌న్‌లో థ‌ర్మ‌ల్ స్కాన్ ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. ఈ రైలు ఆదివారం ఉద‌యం 6 గంట‌ల‌కు చెన్నైకు చేరుకుంది. Post a Comment

0 Comments