అనుమాన‌స్ప‌దం: బ‌ర్త్‌డే పార్టీలో పాల్గొన్న యువ‌కుడు.. స్విమ్మింగ్ పూల్‌లో శ‌వ‌మై...!

death boy
death boy

విశాఖ‌ప‌ట్ట‌ణం: విశాఖ జిల్లాలోని ఓ ప్రైవేటు రిసార్ట్సో లో బ‌ర్త్‌డే పార్టీలో పాల్గొన్న ఓ యువ‌కుడు అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతి చెందాడు. పార్టీలో పాల్గొన్న ఈ యువ‌కుడు మృత‌దేహం స్విమ్మింగ్ లో క‌నిపించ‌డంతో స్నేహితులే చంపేశారంటూ కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. గాజువాక కు చెందిన సుధాక్ అనే యువ‌కుడు పుట్టిన రోజు సంద‌ర్భంగా శుక్ర‌వారం అచ్యుతాపురం మండ‌లం కొండ‌క‌ర్ల వ‌ద్ద ఓ ప్రైవేటు రిసార్ట్సో లో బ‌ర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశారు. సుధాక‌ర్‌కి చెందిన మొత్తం 10 మంది స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో గాజువాక బీసీ కాల‌నీకి చెందిన సాయి అనే యువ‌కుడు స్విమ్మింగ్ పూల్‌లో ప‌డి చ‌నిపోయాడ‌ని కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న సాయి త‌ల్లిదండ్రులు మ‌ర‌ణించ‌డంతో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో స్విమ్మింగ్ పూల్‌లో సాయి మృత‌దేహం క‌నిపించ‌డంతో  కుటుంబ స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. తోటి స్నేహితులు చంపేసి ఉంటార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. 

Post a Comment

0 Comments