బానిస బ్ర‌తుకు ఇంకెన్నాళ్లు..?ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డికియ‌త్నం ..ఎమ్మెల్యే సీత‌క్క అరెస్ట్‌

Mla Seethakka

హైద‌రాబాద్‌ : సీఎం క్యాంపు ఆఫీసు ద‌గ్గ‌ర శుక్ర‌వారం ఉద్రిక‌త్త నెల‌కొంది. కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వ‌ర్యంలోక్యాంపు ఆఫీస్‌ముట్ట‌డికి ప్ర‌య‌త్నించిన ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ను, ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌కు, సీత‌క్క‌కు మ‌ధ్య స్వ‌ల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. బానిస బ‌తుకులు ఇంకెన్నాళ్లు అంటూ.. ప్ర‌భుత్వానికివ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.  అదే విధంగా వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన పంట‌కు ప‌రిహారం చెల్లించాల‌ని సీత‌క్క డిమాండ్ చేశారు. ఏకకాలంలో రుణ‌మాఫీ చేయాల‌న్నారు. రైతుల డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు. రాష్ట్రంలో నిర‌స‌న తెలిపే హ‌క్కు కూడా లేదా అని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అస‌లు చ‌ర్చే జ‌ర‌గం లేద‌ని ఆగ్ర‌హించారు. అనంత‌రం పోలీసులు ఎమ్మెల్యే సీత‌క్క‌ను అరెస్టు చేసి జీపులోకి ఎక్కించారు. 

Post a Comment

0 Comments