రోడ్డెక్క‌నున్న సిటీ బ‌స్సులు..!

bus running
APSRTC Bus

విజ‌య‌వాడ‌: క‌రోనా నేప‌థ్యంలో డిపోల‌కే ప‌రిమిత‌మైన సిటీ బ‌స్సులు శ‌నివారం నుంచి రోడ్డెక్క‌నున్నాయి. తొలిద‌శ‌లో 200 నుంచి 300 వ‌ర‌కు బ‌స్సులు ఆర్‌టీసీ తిప్ప‌నుంది. 60 శాతం ప్ర‌యాణికుల‌కు అనుమ తి ఇవ్వ‌నున్నారు. 20 నుంచి 26 వ‌ర‌కు గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ప‌రీక్ష‌లకు వెళ్లే విద్యార్థుల కోసం అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్నారు. 26న త‌ర్వాత ప్ర‌యాణికుల డిమాండ్ మేర‌కు అనుగుణంగా బ‌స్సు స‌ర్వీసులు న‌డిపే ఆలోచ‌న చేయ‌నున్నారు. మార్చి 22 నుంచి లాక్‌డౌన్ కార‌ణంగా బ‌స్సులు డిపోల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. సుమారు ఆరు నెల‌ల త‌ర్వాత బెజ‌వాడ సిటీ బ‌స్సులు రోడ్డెక్క‌నున్నాయి. 

మ‌రికొన్ని సంక్ష్లిప్త వార్త‌లు..!

1.వైసీపీ గూటికి టిడిపి ఎమ్మెల్యే

విశాఖ‌ప‌ట్ట‌ణం:  టిడిపికి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ గుడ్‌బై చెప్ప‌నున్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను క‌లువునున్నారు ఎమ్మెల్యే గ‌ణేష్ కుమార్‌.

2.కొత్త జిల్లాల ఏర్పాటుపై మ‌రో స‌బ్ క‌మిటీ

అమ‌రావ‌తి:  రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రోస‌బ్ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన జీవో 1461ను ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్ కుమార్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు.సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌(స‌ర్వీస్‌) కార్య‌ద‌ర్శి ఛైర్మ‌న్‌, కార్య‌ద‌ర్శి, పంచాయ‌తీ రాజ్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్మెంటు క‌మిష‌న‌రు, సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ డిప్యూటీ సెక్ర‌ట‌రీలో ఆర్థిక శాఖ నుంచి మ రొక‌రు క‌మిటీలో స‌భ్యులుగా ఉంటార‌ని తెలిపారు.

3.ఎంసెట్ రెండో రోజు 83.10 శాతం మంది హాజ‌రు

విజ‌య‌వాడ : ఎంసెట్ -2020 రెండో రోజు కూడా ప్ర‌శాంతంగా జ‌రిగింది. శుక్ర‌వారం జ‌రిగిన ప‌రీక్ష‌కు 83.10 శాతం మంది అభ్య‌ర్థులు హాజ‌రైన‌ట్టు ఎపి ఉన్న‌త విద్యా మండ‌లి ప్ర‌త్యేకాధికారి ఎం.సుధీర్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఉద‌యం జ‌రిగిన ప‌రీక్ష‌కు 19,987   మందిని కేటాయించ‌గా 16,474(82.42) మంది  హాజ‌ర‌య్యారు. మ‌ధ్యాహ్నం జ‌రిగిన ప‌రీక్ష‌కు 21,032 మందిని కేటాయించ‌గా 17,613 (83.74) మంది హాజ‌ర‌య్యారు. మొత్తం 41,019 మందిలో 34,087 (83.10 శాతం) మంది అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యారు. 

4. హార్టి విద్యార్థుల స్ట‌యిఫండ్ పెంపు

విజ‌య‌వాడ : హార్టిక‌ల్చ‌ర్ పీజీ, పీహెచ్‌డి విద్యార్థుల స్ట‌యిఫండ్ ను పెంచుతూ ప్ర‌భుత్వం జీవో ఇచ్చింది. ఎంఎస్ సి విద్యార్థుల‌కు ప్ర‌స్తుతం స్ట‌యిఫండ్ రూ.5 వేలు ఉండ‌గా 7 వేల‌కు, పీహెచ్ డి విద్యార్థుల‌కు రూ.7 వేల  నుంచి 10 వేల‌కు పెంచింది. వ‌ర్శిటీ జాబితాలో ఉన్న విద్యార్థులంద‌రికీ స్ట‌యిఫండ్ పెంపు వ‌ర్తిస్తుంది. 


Post a Comment

0 Comments