భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం

covid-19 vaccine

50 ల‌క్ష‌లు దాటిన కేసులు
24 గంట‌ల్లో 90 వేల కేసులు, 1290 మంది మృతి

న్యూఢిల్లీ : భార‌త్‌లోని క‌రోనా వైర‌స్ రోజురోజుకూ విల‌య‌తాండ‌వం చేస్తూ విజృంభిస్తూనే ఉంది.బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా  11,16,842 కోవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా వీటిలో 90,122 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 82,066కి చేరింది. కోవిడ్‌-19 తో మ‌ర‌ణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికి  పైగా ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారేన‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 78.5 శాతానికి చేర‌డం ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌య‌మైన‌ప్ప‌టికీ ఆందోళ‌న మాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌ర‌ణాల రేటు మాత్రం 1.63 శాతంగా ఉన్న‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొంది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 5కోట్ల 94 ల‌క్ష‌ల శాంపిళ్లుకు కోవిడ్ టెస్టులు పూర్తి చేసిన‌ట్టు భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది.

     ఇదిలా ఉంటే, ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ అధిక తీవ్ర‌త ఉన్న అమెరికాలో ఇప్ప‌టికే 66 ల‌క్ష‌ల కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా వీరిలో ల‌క్షా 95 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భార‌త్‌లో ప్ర‌స్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 50 ల‌క్ష‌లు దాటింది. క‌రోనా మ‌ర‌ణాలు అత్య‌ధికంగా అమెరికాలో చోటుచేసుకోగా బ్రెజిల్‌లో ల‌క్షా 33 వేలు, భార‌త్‌లో 82 వేల మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 


Post a Comment

0 Comments