విషాదంగా ముగిసిన అదృశ్య‌మైన బాలిక ఘ‌ట‌న‌..!

sumedha
sumedha death

హైద‌రాబాద్‌: నేరెడ్‌మెట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో దీన‌ద‌యాళ్ న‌గ‌ర్‌లో  గురువారం సాయంత్రం అదృశ్య‌మైన మైన‌ర్ బాలిక చివ‌ర‌కు మృత‌దేహంగా క‌నిపించింది. బాలిక మృత‌దేహాన్ని స్థానిక బండ చెరువులో పోలీసులు గుర్తించారు. నెరేడ్‌మెట్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని దీన‌ద‌యాళ్ న‌గ‌ర్‌లోని గురువారం అదృశ్య‌మైన 12 ఏళ్ల బాలిక సుమేదా క‌పారియా మిస్ట‌రీ విషాదంగా ముగిసింది. బాలిక త‌ల్లి సుక‌న్య క‌పాడియా ఫిర్యాదు మేర‌కు గ‌త రాత్రి నుంచి రంగంలోకి దిగిన పోలీసులు శుక్ర‌వారం ఉద‌యం అత్య‌వ‌స‌ర బృందాల‌తో క‌లిసి జ‌రిపిన గాలింపు చ‌ర్య‌ల్లో భాగంగా బాలిక మృత‌దేహాన్ని స‌మీపంలోని బండ చెరువులో గుర్తించారు. గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక భారీగా కురిసిన వ‌ర్షంతో నాలాలో కొట్ట‌కుపోయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. నాలా వ‌ద్ద సైకిల్ ల‌భ్య‌మైంది. క‌ళ్ల‌ముందే హుషారుగా సైకిల్ తొక్కుతూ క‌న‌బ‌డిన సుమేధా చివ‌ర‌కు విగ‌త‌జీవిగా క‌నిపించ‌డం క‌న్న‌వారిని, స్థానికుల‌ను కంట నీరు తెప్పించింది. 

Post a Comment

0 Comments