అంద‌రూ సిక్స్ ప్యాక్ బాడీలు అనుకున్నారు..తీరా చూసి అయ్య‌బాబోయ్ అన్నారు..!?


విస్స‌న‌పేట‌(కృష్ణాజిల్లా):
క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల మ‌నుషుల మ‌నుగడ‌కు కొత్త ఆలోచ‌న‌లు పుట్టుకొస్తున్నాయి. కానీ అవి చ‌ట్ట వ్య‌తిరేకం కాన‌ప్పుడు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు కొంద‌రు అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా చేసేవారికి. శ‌త‌కోటి ద‌రిద్రాల‌కు అనంత కోటి ఉపాయాలు అన్న చందంగా మారింది మ‌ద్యం అక్ర‌మ ర‌వాణా.  వార్త విష‌యానికి వ‌స్తే తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట గ్రామానికి చెందిన ఇద్ద‌రు యువ‌కులు శ‌రీరానికి మ‌ద్యం సీసాలు త‌గిలించుకొని  బాధ‌ను ఎలా భ‌రించారో కానీ ప్లాస్ట‌ర్ అతికించుకొని య‌ధామాములుగా చొక్కాలు ధ‌రించి ద‌ర్జాగా ద్విచ‌క్ర వాహ‌నంపై  వెళుతున్నారు. ఈ క్ర‌మంలో విస‌న్న‌పేట ఎక్సైజ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని పోల‌వ‌రం మంకొల్లు వెళుతుండ‌గా అసిస్టెంట్ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ మ‌ధు బాబ‌కు అనుమానం వ‌చ్చింది. వెంట‌నే వారిని త‌నిఖీలు చేయ‌గా వారి అస‌లు సిక్స్ ప్యాక్‌ల బాగోతం బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌తి రోజూ ఇదే తంతు మాదిరి ఒక ఉద్యోగంలా చేస్తున్న ఇద్ద‌రు యువ‌కుల ఆట క‌ట్టించారు అధికారులు. వారి వ‌ద్ద నుండి 101 మ‌ద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిని అరెస్ట్ చేసి బైక్ సీజ్ చేసిన‌ట్టు సీఐ శ్రీ‌నివాస బాలాజీ తెలిపారు. ఇప్పుడు ఆ సిక్స్ ప్యాక్ వీడియో వైర‌ల్ అవుతుంది. 

Post a Comment

0 Comments