బ్రేకింగ్ న్యూస్ : శ‌బ‌రి న‌దిలో మునిగిన ముంపు బాధితుల లాంచీ

రాజ‌మండ్రి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏజెన్సీలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్టు స‌మాచారం. తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి ప‌రిధిలోని ఏజెన్సీలో చింతూరులోని శ‌బ‌రి న‌ది బ్రిడ్జిని ఢీకొని లాంచీ మునిగిన‌ట్టు తెలుస్తోంది. లాంచీలో వ‌ర‌ద ముంపు బాధితులు ఉన్న‌ట్టు స‌మాచారం.చీక‌టి కావ‌డంతో ఎంత మంది లాంచీలో ఉన్నారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఘ‌ట‌నా స్థ‌లానికి రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకుంటున్నారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 
Post a Comment

0 Comments