స‌త్తుప‌ల్లి మినీ పార్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర‌

స‌త్తుప‌ల్లి : స‌త్తుప‌ల్లి  మున్సిపాలిటీ ప‌రిధిలోని ఖ‌మ్మం నుండి స‌త్తుప‌ల్లి ప‌ట్ట‌ణానికి వ‌చ్చే దారి లో స‌త్తుప‌ల్లి ప‌ట్ట‌ణ శివారు వెంగ‌ళ‌రావు న‌గ‌ర్ నందు ఏర్పాటు చేసిన స‌త్తుప‌ల్లి స్వాగ‌త దారంను (మినీ పార్కు)ను స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య , అద‌న‌పు క‌లెక్ట‌రు స్నేహ‌ల‌త గురువారం ప్రారంభించారు. అనంత‌రం సత్తుప‌ల్లి ప‌ట్ట‌ణంలోని ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగ‌ణంలో మ‌రియు స‌త్తుపల్లి జేవిఆర్ పార్కు ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన 12 ప‌బ్లిక్ టాయిలెట్స్ ప్రారంభించారు. సత్తుప‌ల్లి మండ‌లానికి చెందిన క‌ళ్యాణ‌లక్ష్మి, షాదీముబార‌క్ రూ.1,60,18,560 చెక్కుల‌ను 160 మంది ల‌బ్ధిదారుల‌కు ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య చేతుల‌మీదుగా పంపిణీ చేశారు. 

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌర‌వ పుర‌పాల‌క , ఐటీ శాఖ మంత్రి సుదూర ప్రాంతాల నుండి వ‌స్తున్న ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యార్థం ప్ర‌తి ప‌ట్ట‌ణంలో ప‌బ్లిక్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ఇచ్చిన పిలుపు మేర‌కు స‌త్తుప‌ల్లి పుర‌పాల‌క సంఘం ఆధ్వ‌ర్యంలో 12 టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశామ‌ని అన్నారు. పేదింటి ఆడ‌పిల్ల‌ల కుటుంబానికి ప్ర‌భుత్వ చేయూత క‌ల్యాణ లక్ష్మి అని, ప్ర‌భుత్వం త‌ర‌పున పెళ్లి కానుక‌ని అన్నారు. క‌రోనా వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో కూడా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వ‌హిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. 


Post a Comment

0 Comments