ఎంత విప‌త్తైనా ఎదుర్కొందాం? ఒక్క ప్రాణన‌ష్టం జ‌ర‌గ‌డానికి వీల్లేదు

వ‌ర‌ద‌లు, వ‌ర్షాల నేప‌థ్యంలో అధికారుల‌తో ‌  సీఎం కేసీఆర్ స‌మావేశం

హైద‌రాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు సంభ‌విస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్ర‌మ‌త్తంగా ఉండి ప్రాణ‌న‌ష్టం, ఆస్తిన‌ష్టం జ‌ర‌గ‌కుండా  అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ‌త నాలుగైదు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో పాటు, మ‌రో మూడు, నాలుగు రోజుల పాటు భారీ, అతి భారీ వ‌ర్ష సూచ‌న ఉన్న నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైన  అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, అవ‌స‌ర‌మైన చోట యుద్ధ ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. ఏ ఒక్క‌రి ప్రాణం పోకుండా  కాపాడ‌ట‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా అధికార యంత్రంగాం ప‌నిచేయాల‌ని, ఎక్క‌డికక్క‌డే కంట్రోల్ రూములు ఏర్పా టు చేసి 24 గంట‌ల పాటు నిరంత‌రాయంగా ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. స‌హా య‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి ఎంత ఖ‌ర్చు పెట్ట‌డానికైనా వెనుకాడ‌వ‌ద్ద‌ని, అవ‌స‌ర‌మైన నిధులు సిద్ధంగా ఉన్నాయ‌ని సిఎం వెల్ల‌డించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప‌ట్ట‌ణాల నుంచి ప్ర‌తి రోజూ నివేదిక తెప్పించేందుకు, ప‌రిస్థితిని బ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. 

రాష్ట్రంలో వాన‌లు, వ‌ర‌ద‌లు, వాటి వ‌ల్ల త‌లెత్తిన ప‌రిస్థితిపై సీఎం ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ ‌హించారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల నిర్వ‌హ‌ణ‌, రెవెన్యూ, జ‌ల వ‌న‌రులు, విద్యుత్‌, మున్సిప‌ల్‌, పంచాయ‌తీ రాజ్‌, వ్య‌వ‌సాయం, ర‌హ‌దారులు- భ‌వ‌నాలు త‌దిత‌ర శాఖ‌ల‌కు చెందిన సీనియ‌ర్ అధికారుల‌తో సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాల వారీగా ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు చేశారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్‌, వ‌రంగ‌ల్ రూర‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఆసీఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాత్రి కొత్త‌గూడెం త‌దిత‌ర జిల్లాల్లో భారీ వ‌ర్షాల‌తో పాటు వ‌ర‌ద‌ల ఉధృతి ఎక్క‌వున్న నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితిని సీఎం ప్ర‌త్యేకంగా స‌మీక్షించారు. ఇవి చ‌ద‌వండి  : కృష్ణాన‌దిలో ఘోర ప్ర‌మాదం..పుట్టిబోల్తా ..ప‌లువురు గ‌ల్లంతు

సీఎం తెలిపిన ముఖ్య‌మైన అంశాలు..

- ఎంత విప‌త్తు వ‌చ్చినా స‌రే ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌వ‌ద్దనేదే ప్ర‌భుత్వ ల‌క్ష్యం . ఇత‌ర‌త్రా న‌ష్టాలు సంభ‌విస్తే ఏదోలా పూడ్చుకునే అవ‌కాశం ఉంది. కానీ ప్రాణాలు తిరిగి తేలేము. కాబ‌ట్టి విప‌త్తు నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కాపాడ‌ట‌మే అత్యంత ప్ర‌ధాన‌మ‌నే విష‌యాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. దానికి అనుగుణంగా ప‌నిచేయాలి.

- ప్ర‌జ‌లు కూడా వాతావ‌ర‌ణం బాగా లేదు. కాబ‌ట్టి జాగ‌త్ర‌గా ఉండాలి. ఎప్పుడు ఎవ‌రికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా ఇబ్బంది కలిగినా, ముంపు ప్ర‌మాదం ఉన్నా వెంట‌నే అధికార యంత్రాంగానికి స‌మాచారం అందించాలి. కూలిపోయే ప‌రిస్థితిలో ఉన్న ఇండ్ల‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో ఉండొద్దు. కాజ్ వేల వ‌ద్ద వ‌ర‌ద నీరు రోడ్ల‌పైకి వ‌స్తున్న‌ది. అక్క‌డ ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ప్ర‌జ‌లు నీటి ప్ర‌వాహానికి ఎదురెళ్లి ప్ర‌మాదాన్ని కొని తెచ్చుకోవ‌ద్దు.

-గోదావ‌రి న‌దికి భారీ వ‌ద‌ర వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఏటూరు నాగారం, మంగ‌పేట మండ‌లాల‌తో పాటు గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలో ఉండే ముంపు గ్రామాల‌ను, ప్రాంతాల‌ను గుర్తించాలి. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌రలించాలి.

- గోదావ‌రి కి భారీ వ‌ర‌ద వ‌స్తే భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణానికి  ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణంలో నీరు నిల్వ ఉండ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోవాలి. అక్క‌డ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ప‌నిచేస్తూ జాగ్ర‌త్త‌గా ఉండాలి.

- నీటి ముంపు పొంచి ఉన్న ప్రాంతాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్యేక స‌హాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఈ శిబిరాల్లో అందరికీ కావాల్సిన వ‌స‌తి, భోజ‌నం ఏర్పాటు చేయాలి. కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ కోసం మాస్కులు , శానిటైజ‌ర్లు అందించాలి. 

-  మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఎక్క‌డికక్క‌డే ఉండి త‌మ ప్రాంతాల్లో స‌హాయ‌చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించాలి. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల జ‌రిగిన పంట న‌ష్టంపై వ్య‌వ‌సాయ శాఖ అధికారులు అంచ‌నాలు త‌యారు చేయాలి. 

- అన్ని న‌ధుల వ‌ద్ద ఫ్ల‌డ్ ట్రాక్ షీట్ త‌యారు చేయాలి. న‌దుల్లో నీటి ప్ర‌వాహం ఎక్కువైతే జ‌రిగే ప‌రిణామాల‌ను అంచ‌నా వేయాలి. గ‌తంలో న‌దులు పొంగి ప్ర‌వ‌హించిన‌ప్పుడు ఎలాంటి ప‌రిస్థితి త‌లెత్తిందో ట్రాక్ రికార్డు ఉండాలి. దాని ఆధారంగా భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక సిద్ధం చేయాలి. 

- వ‌ర్షాకాలంలో సంభవించే అంటువ్యాధులు, ఇత‌ర‌త్రా వ్యాధుల విష‌యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించాలి. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బందిని అప్ర‌మ‌త్తంగా  ఉంచాలి. అన్ని ప్ర‌భుత్వ వైద్య శాల‌ల్లో అవ‌స‌ర‌మైన మందులు సిద్ధంగా ఉంచాలి. ఇది కేవ‌లం ఈ ఒక్క సంవ‌త్స‌రానికే కాకుండా ప్ర‌తీ వానాకాలంలో వైద్య ప‌రంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌యంలో స‌రైన వ్యూహం రూపొందించి, అమ‌లు చేయాలి. 

- రాష్ట్ర రాజ‌ధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములు 24 గంట‌ల పాటు నిరంత‌రాయంగా న‌డ‌వాలి. ఎక్క‌డి నుంచి ఏ ఫోన్ కాల్ వ‌చ్చినా స్వీక‌రించి, త‌క్ష‌ణం స‌హాయం అందించాలి. కంట్రోల్ రూముల్లో రెవెన్యూ, పోలీస్‌, జ‌ల‌వ‌న‌రుల శాఖ‌, విద్యుత్ శాఖ  త‌దిత‌ర ముఖ్య‌మైన శాఖ‌ల ప్ర‌తినిధులుండాలి. 

Post a Comment

0 Comments