కృష్ణాన‌దిలో ఘోర ప్ర‌మాదం..పుట్టిబోల్తా ..ప‌లువురు గ‌ల్లంతు

boating accident
boat tragedy
నారాయ‌ణ‌పేట‌ : తెలంగాణ - క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులోని కృష్ణాన‌దిలో  సోమ‌వారం ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది.  నిత్య‌వ‌స‌ర స‌రుకులు తెచ్చ‌కునేంద‌కు కృష్ణాన‌దిలో 13 మంది  పుట్టి పైన వెళ్లి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 9 మంది ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా 4 గురు గ‌ల్లంత‌య్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

క‌ర్ణాట‌క రాష్ట్రం పెద్ద‌కురం గ్రామానికి చెందిన  13 మంది సాయంత్రం 4 గంట‌ల ప్రాంతంలో కృష్ణా న‌దిలో పుట్టిపైన తెలంగాణ రాష్ట్రం  నారాయ‌ణ‌పేట మ‌క్త‌ల్ మండ‌లం వ‌చ్చి వారు నిత్యావ‌స‌ర స‌రుకులు కొని తిరిగి వారి స్వ‌గ్రామానికి బ‌య‌లు దేరారు. ఈ స‌మ‌యంలో కృష్ణాన‌దిలో నీటి ఉధృతికి  ఉన్న‌ట్టుండి వారి పుట్టి బోల్తా కొట్టింది. అంద‌రూ ఒక్క‌సారిగా న‌దిలో ప‌డిపోయారు. కొట్టుకుపోతున్న 8 మంది మగ‌వారు , ఒక మ‌హిళ‌ మాత్రం మ‌ధ్య‌లో ఉన్న చెట్టును ప‌ట్టుకొని ఉండిపోయారు. మిగిలిన న‌లుగురు గ‌ల్లంత‌య్యారు.

 boating accident
 boating accident

 boating accident

వీరిని గ‌మ‌నించిన ప‌సుపుల గ్రామం స‌ర్పంచ్  ద‌త్తాత్రేయ కు సంబంధించిన న‌లుగురు చేప‌లు(శ్రీ‌పాద‌, ఆదిలింగ‌ప్ప‌, న‌ర్సింహులు, ఈదాప్ప‌) ప‌ట్టేవారు ఈ 9 మందిని ఒడ్డుకు తీసుకొచ్చారు. ర‌క్షింబ‌డిన వారిలో పుట్టి అంజిల‌ప్ప‌, ద‌ళ‌ప‌తి, నాగ‌ప్ప‌, బుడ్డ‌న్న‌, హ‌రిజ‌న తిమ్మ‌న్న‌, చిన్న న‌గేష్‌, మోహ‌న్‌, విష్ణు మ‌రియు అంజిల‌మ్మ ఉన్నారు. గ‌ల్లంతైన వారిలో సుమ‌ల‌త‌(24), రోజా (9), చిన్న‌క్క‌(35), న‌ర్స‌మ్మ‌(28) ఉన్నారు. 

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న ఎస్పీ

పుట్టి బోల్తా ప్ర‌మాద స‌మాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డాక్ట‌ర్ చేత‌న  ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మండ‌లంలోని ప‌సుపుల గాట్‌, పంచ దేవుళ్ల పాడు గాట్ వ‌ద్ద‌కు వెళ్లి గ‌ల్లంతైన వారి వివ‌రాల‌ను ఆరా తీశారు. అలాగే గ‌ల్లంతైన వారిని గుర్తించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై రాయ‌చూరు క‌లెక్ట‌ర్ ఆర్‌.వెంక‌టేష్ కుమార్‌, ఎస్పీ నికం ప్ర‌కాష్ త‌దిత‌ర అధికారులు వారి ఆచూకీ కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. జోరుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు, న‌దులు, కాలువ‌ల వ‌ద్ద‌కు ప్ర‌జ‌లెవ‌రూ వెళ్ల‌కూడ‌ద‌ని ఎస్పీ సూచించారు. 

 boating accident

Post a Comment

0 Comments