2006 తర్వాత‌నే గోదావ‌రికి భారీ వ‌ర‌ద‌లుI భ‌ద్రాచ‌లం వ‌ద్ద మళ్లీ పెరుగుతున్న వ‌ర‌ద‌..!

రాజ‌మండ్రి : ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌తో పాటు యావ‌త్తు భార‌త‌దేశాన్ని కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో పారుతున్న వ‌ర‌ద‌ల‌తో జ‌నం అత‌లాకుత‌ల‌మ‌వుతున్న ప‌రిస్థితి త‌లెత్తింది. అస‌లే క‌రోనాతో జీవ‌నోపాధి లేక ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన ప్ర‌జ‌ల‌కు వ‌ర్షాల‌తో మ‌రో స‌మ‌స్య ముంచుకొచ్చింది. ఆయా రాష్ట్రాల్లో న‌దుల  ప‌రివాహ‌క ప్రాంతాల్లో ఉన్న ఊళ్లకు ఊళ్లు నీటి మునిగాయి. ఎన్నో కుటుంబాలు నిర‌శ్రాయులైన ప‌రిస్థితి త‌లెత్తింది. తాజాగా ప్ర‌స్తుతం గోదావ‌రి ఉగ్రరూపం దాల్చుతోంది. 2006 సంవ‌త్స‌రం త‌ర్వాత మ‌ళ్లీ ఈ ఏడాది గోదావ‌రికి భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చాయిని అధికారులు చెబుతున్నారు. 2006 లో ధ‌వ‌ళేశ్వ‌రం కాట‌న్ బ్యారేజీ వ‌ద్ద నీటి మ‌ట్టం 22.80 అడుగులు న‌మోదు అయ్యింది. ఈ ఏడాది భారీ  వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్ర‌స్తుతం నీటి మ‌ట్టం 19.80 అడుగుల రికార్డును న‌మోదు చేసింది.

మ‌రోవైపు ధ‌వ‌ళేశ్వ‌రం కాట‌న్ బ్యారేజీ వ‌ద్ద గోదావ‌రి వ‌ర‌ద ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్టింది. బ్యారేజీ వ‌ద్ద రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక కొన‌సాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మ‌ట్టం 15.50 అడుగుల‌కు త‌గ్గింది. అధికారులు 175 గేట్ల‌ను పూర్తి ఎత్తివేసి 15.60 ల‌క్ష‌లు క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. 

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రికి మ‌ళ్లీ పెరుగుతున్న వ‌ర‌ద‌...!

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రికి మ‌ళ్లీ వ‌ర‌ద పోటెత్తుతోంది. బుధ‌వారం అర్థ‌రాత్రి 43 అడుగుల‌కు వ‌ర‌ద త‌గ్గ‌డంతో అధికారులు మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను విర‌మించుకున్నారు. గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు 45.8 అడుగుల‌కు వ‌ర‌ద ఉధృతి చేరుకోవ‌డంతో మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను అధికారులు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావ‌తి, కాళేశ్వ‌రం, తాలిపేరు, పేరూరు వైపు నుంచి భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుండ‌టంతో భ‌ద్రాచ‌లం  వ‌ద్ద ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు 48 అడుగుల నీటి మ‌ట్టం చేరుకుంటుంద‌ని కేంద్ర జ‌ల‌వ‌న‌రుల‌శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎంవీ రెడ్డి సూచించారు. నీటి మ‌ట్టం 48  అడుగుల‌కు చేరడంతో రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేసే అవ‌కాశ‌ముంది. 

Post a Comment

0 Comments