ముంబై : గోడ కూలి ఏడుగురి మృతి..!

ముంబై(Mumbai): ముంబై న‌గ‌రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. అస‌లే క‌రోనా కేసులు పెరుగుతున్న వేళ‌, వ‌ర్షాలు తీవ్రంగా ప‌డ‌టంతో న‌గ‌ర వాసులు భ‌యాందోళ‌న చెందుతున్నారు.  రోడ్ల‌పైకి వ‌ర‌ద నీరు భారీగా ప్ర‌వ‌హిస్తోంది. తాజాగా గురువారం కురిస‌న భారీ వ‌ర్షాల‌కు ఇళ్లు కూలిన ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల ప్రాంతంలో ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలోని భానుషాలీ భ‌వ‌నం కొంత భాగం కూలిపోవ‌డంతో ఐదుగురు మృతిచెందారు. మ‌రో 23 మందిని  ప్ర‌భుత్వ సిబ్బంది ర‌క్షించారు.
         విష‌యం తెలుసుకున్న ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే సంఘ‌టనా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించారు. 14 అగ్నిమాప‌క శ‌క‌టాల‌ను సంఘ‌ట‌నా స్థ‌లానికి చేర్చి పోలీసులు మ‌రియు ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాలు స‌హాయ చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయి. ఈ సంద‌ర్భంగా ముంబై స‌బ‌ర్భ‌న్ జిల్లా సంర‌క్ష‌క మంత్రి ఆదిత్య థాక‌రే మ‌లాద్ ప్రాంతంలో ఇల్లు కూలిపోయి మ‌ర‌ణించిన కుటుంబ‌స‌భ్యుల‌కు ఒక్కొక్క‌రికి రూ.4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. అంతుకు ముందు రోజు బుధ‌వారం న‌గ‌రంలోని ప‌వ్వాలా వీధిలో ఓ ఇంట్లో కొంత భాగం కూలిపోవ‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. అనంత‌రం వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

వ‌సుంధ‌రా రాజే కాంగ్రెస్‌కు స‌హాయం చేస్తోంది: ఎంపీ

రాజ‌స్థాన్ : బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రా రాజే కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌కు సాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని  రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి చెందిన ఎంపీ హ‌నుమాన్ బెనివాల్ ట్విట‌ర్ ద్వారా ఆరోపించారు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాజ‌కీయాల్లో గంద‌ర‌గోళం ప‌రిస్థితి నెల‌కొని ఉంది. మాజీ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రా రాజేను కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఆశ్ర‌యించార‌ని, ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరార‌ని అదే విధంగా స‌చిన్ ఫైల‌ట్‌కు దూరంగా ఉండా ల‌ని కోరిన‌ట్టు త‌న ద‌గ్గ‌ర రుజువు ఉంద‌ని ఆ ఎంపీ తెలిపారు. వ‌సుంధ‌రా రాజే కుటుంబ‌స‌భ్యులు మ‌రియు స‌న్నిహిత స‌హాయ‌ కులు గెహ్లాట్‌కు స‌హాయం చేస్తున్నార‌ని అన్నారు. అందువ‌ల్ల అశోక్ యొక్క స‌ర్కారు కూలిపోయే ప‌రిస్థితి లేద‌ని తెలిపారు. రాజ‌‌స్థాన్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రెబ‌ల్  స‌చిన్ ఫైల‌ట్ నుంచి భారీ ముప్పును ఎదుర్కొంటుంద‌ని ఆరోపించారు.  ఎంపీ హ‌నుమాన్ బెనివాల్ 2018 ఎన్నిక‌ల‌కు ముందు బిజేపీని విడిచిపెట్టారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ చీఫ్  స‌తీష్ పునియా మాట్లాడుతూ బెనివాల్ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌వ‌ద్ద‌ని తెలిపారు. 

క‌రోనాతో అర్జున అవార్డు గ్ర‌హిత మృతి..!

బెంగుళూరు(Bengaluru): అర్జున అవార్డు గ్ర‌హీత‌, ఏస్ పారా బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు ర‌మేష్ తికారం గురువారం ఓ ఆస్ప‌త్రిలో క‌రోనా వైర‌స్‌తో మృతిచెందారు. పారా బ్యాడ్మింట‌న్ ఇండియా అధ్య‌క్షుడు ఎన్‌సీ సుధీర్  మాట్లాడుతూ..'ఈ రోజు మ‌ధ్యాహ్నం ర‌మేష్ తికారం మ‌ర‌ణించార‌ని మీకు తెలియ‌జేసేందుకు విచారిస్తున్నాం. 'అని సుధీర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.  పీటిఐ  మాట్లాడుతూ.. జ్వ‌రం, ద‌గ్గుతో ఉన్న 51 ఏళ్ల  ర‌మేష్ తికారంను గ‌త నెల 29న ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్టు తెలిపారు. ఈ క్రీడాకారుడికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 2001లో అంత‌ర్జాతీయ పారా బ్యాడ్మింట‌న్ టోర్న‌మెంట్‌ను దేశానికి తీసుకురావ‌డంలో తికారం కీల‌క పాత్ర పోషించార‌ని త‌న స్నేహితుల్లో ఒక‌రైన కే.వై వెంక‌టేష్ తెలిపారు. 

Post a Comment

0 Comments