క‌రోనా బాబా అంట‌....వీపు వాయించిన‌ పోలీసులు..! I

హైద‌రాబాద్‌: ఒక ప్ర‌క్క ప్ర‌పంచ మంతా క‌రోనా భారి నుండి త‌ప్పించ‌కునేందుకు ముఖానికి మాస్కులు, శానిటైజ‌ర్లు, భౌతిక‌దూరం పాటించాల‌ని రోజూ ప్ర‌భుత్వాలు గ‌గ్గోలు పెడుతుంటే మ‌రో ప్ర‌క్క నిమ్మ‌కాయ‌ల‌కు, మంత్రాల‌కు క‌రోనాను త‌గ్గిస్తాన‌ని పుట్టొచ్చాడో క‌రోనా బాబా..! ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ఆ బాబా దుమ్ము దులిపేశారు. 
corona baba
హైద‌రాబాద్‌లోని హ‌ఫీజ్ పేట్ హ‌నీఫ్ కాల‌నీలో క‌రోనా బాబా ఒక‌రు ద‌ర్శ‌న‌మెత్తారు. మాయ‌లు, మంత్రాల‌తో క‌రోనాను న‌యం చేస్తానంటూ మోసాల‌కు పాల్ప‌డుతున్న క‌రోనాబాబా అలియాస్ ఇస్మాయిల్ బాబా స్థావ‌రంపై పోలీసులు  దాడులు నిర్వ‌హించారు. ఒక్కో క‌రోనా రోగి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కూ వ‌సూళ్లు చేస్తున్నాడు. మంత్రాలు, నిమ్మ‌కాయ‌లు, విభూతితో పూజ‌లు చేసి అమాయ‌కుల‌ను న‌మ్మించి మోసం చేస్తున్నాడు. గ‌త మార్చి నుంచి క‌రోన బాబా దందాలు ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా బాబాకు అతీత‌మైన శ‌క్తులు ఉన్నాయంటూ శిష్యుల‌చే ప్రచారం చేసుకున్నాడు. మాస్క్ పెట్టుకోన‌క్క‌ర్లేదు. అపూర్వ శ‌క్తుల‌తో క‌రోనా బారి నుండి కాప‌డ‌తానంటూ న‌మ్మ‌బ‌లికిన క‌రోనాబాబా జ‌లుబు, ద‌గ్గు ఉన్నా.. అది క‌రోనా నే అంటూ అమాయ‌కులైన జ‌నాల్ని భ‌య‌పెట్టి వేలాది రూపాయ‌లు వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డాడు. ఈ బాబా చేతిలో సుమారు 70 మంది బాధితులు మోస‌పోయిన‌ట్టు పోలీసులు గుర్తించారు. క‌రోనా సోకిన‌ట్టైతే ఆసుప‌త్రి కి వెళ్లాల‌ని అక్క‌డున్న జ‌నాన్ని పోలీసులు పంపించారు. మోసాల‌కు పాల్ప‌డే ఇలాంటి బురిడీ క‌రోనా బాబాల‌ను న‌మ్మొద్దంటున్నారు పోలీసులు. 

క్వారంటైన్‌లో దారుణం..రేప్ చేసి..వీడియోతీసి..!

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధానిలో దారుణం చోటుచేసుకుంది. క్వారంటైన్‌లో ఉన్న 14 ఏళ్ల అమ్మాయిపై ఇద్ద‌రు కామాంధులు రేప్ చేసి వీడియో తీసి బ్లాక్ మెయిలకు పాల్ప‌డిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఢిల్లీలో ఛ‌తూర్‌పూర్‌లో ని స‌ర్థార్‌ప‌టేల్  కోవిడ్ 19 కేర్ సెంట‌ర్‌ణు  టిబెటియ‌న్ బార్డ‌ర్ పోలీసులు నిర్వ‌హిస్తున్నారు. జులై మొద‌టి వారంలో 14 ఏళ్ల బాలిక‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్య‌లు క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఛ‌తూర్ పూర్‌లోని క్వారంటైన్ కేంద్రంలో చేరి చికిత్స పొందుతున్నారు.  అదే క్వారంటైన్‌లో 19 ఏళ్ల బాలుడు, మ‌రో 19 ఏళ్ల అత‌ని స్నేహితుడు అక్క‌డ చికిత్స పొందుతున్నారు. బాలిక మీద ఇద్ద‌రు స్నేహితులు గ‌త వారం రోజుల నుంచి క‌న్నేశారు.  ఈ నెల 15వ తేదీ అర్ధ‌రాత్రి బాలిక మూత్ర విస‌ర్జ‌న చెయ్య‌డానికి క్వారంటైన్ కేంద్రంలోని బాత్‌రూంలోకి వెళ్లింది. అదే స‌మ‌యం కోసం వేచిచూస్తున్న ఇద్ద‌రు కామాంధులు బాలిక వెళ్లిన బాత్‌రూం్‌లోకి చొర‌బ‌డ్డారు. 19 ఏళ్ల కామాంధుడు బాలిక‌పై అత్యాచారం చేశాడు.
girl in quarantine
అదే స‌మ‌యంలో మ‌రో 19 ఏళ్ల యువ‌కుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా దృశ్యాల‌ను మొబైల్‌లో వీడియో తీశాడు. త‌ర్వాత అత్యాచారం వీడియో అడ్డం పెట్టుకున్న ఇద్ద‌రు కామాంధులు త‌మ కోరిక తీర్చాల‌ని బాలిక‌ను బ్లాక్ మెయిల్ చెయ్య‌డం మొద‌లుపెట్టారు. బాలిక జ‌రిగిన విష‌యం ఆమె కుటుంబ స‌భ్య‌ల‌కు చెప్పింది. బాలిక ఫిర్యాదు మేర‌కు ఇండో టిబెటియ‌న్ బార్డ‌ర్ పోలీసులు ఇద్ద‌రు కామాంధుల‌ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ అడిష‌న‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ప‌ర్వీంద‌ర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజ‌రుప‌రిచామ‌ని అన్నారు. అత్యాచారం చేసే స‌మ‌యంలో వీడియో తీసిన మొబైల్ ఫోన్‌ను తాము స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. బాలిక‌ను సంర‌క్ష‌ణా కేంద్రానికి త‌ర‌లించామ‌ని, ఆమె క‌రోనా వైర‌స్ వ్యాధి నయం అయ్యే వ‌ర‌కు అక్క‌డే ఉంటుంద‌ని పేర్కొన్నారు. బాలిక‌పై అత్యాచారం జ‌రిగిన కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో 10,000 వేల ప‌డ‌క‌లు ఉన్నాయి. ఇక్క‌డ ఢిల్లీతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లోని క‌రోనా పాజిటివ్ రోగుల‌కు చికిత్స అందిస్తున్నారు. 

Post a Comment

0 Comments