Tuesday, July 14, 2020

కుమార్తె పెళ్లికి దాచిపెట్టిన డ‌బ్బులు చివ‌రికి..! I క‌రోనా: యువ‌కుడునేగా ఏం చేస్తుంది.. అనుకున్నాడు..కానీ..!

చెన్నై(Chennai):మ‌ట్టితో పాతిపెట్టిన రూ.35 వేల నోట్లు చెల్ల‌వ‌ని తెలుసుకొని ఓ దివ్యాంగురాలు ఆవేద‌న‌కు లోనైన ఘ‌ట‌న స్థానికంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నాగై జిల్లా సిర్కాలి స‌మీపంలో ఉన్న ప‌ట్టియ‌యేడు గ్రామానికి చెందిన రాజ (58) కూలీ కార్మికుడు. ఇత‌ని భార్య ఉష‌(52). వీరి కుమార్తెలు విమ‌ల (17).  త‌ల్లీ, కుమార్తెకు మాట‌లురావు. మ‌హ‌త్మాగాంధీ  జాతీయ ప‌థ‌కం కింద ప‌నికి వెళుతూ వ‌చ్చారు. ప‌ది సంవ‌త్స‌రాలుగా త‌న కుమార్తె వివాహం కోసం రూ.1000, రూ.500 నోట్ల‌ని రూ.35,500 వ‌ర‌కు కొంచెం కొంచెంగా ఉషా చేర్చిపెట్టింది. ఆ నోట్ల‌ను ఒక ప్లాస్టిక్ సంచిలో భ‌ద్రంగా చుట్టి  దాంతో ఒక గ్రాము బంగారు బిస్కెట్‌ను పెట్టి త‌న భ‌ర్త‌కు తెలియ‌కుండా ఇంటి వెనుక భాగంలో గుంత త‌వ్వి పాతి పెట్టింది. ఇవి చ‌ద‌వండి : వాట్సాప్ వేదిక‌గా త‌‌న బ‌లాన్ని చూపిన స‌చిన్‌..!నిబ్బ‌రంగా ఉన్న సీఎం..!
2016 లో కేంద్ర ప్ర‌భుత్వం పాత 1000  రూపాయ‌ల నోట్లు, రూ.500 నోట్లు చెల్ల‌వ‌ని ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ ఈ విష‌యం పాపం ఆ త‌ల్లీ, కుమార్తె తెలుసుకోలేక‌పోయారు. రాజ‌దురై త‌న గుడిసె ఇంటిని రాష్ట్ర ప్ర‌భుత్వ నిధి స‌హాయంతో ఇటుక‌ల ఇంటిని క‌ట్టే ప‌థ‌కంలో అనుమ‌తి పొంది ఇల్లు క‌ట్టే ప‌నిని ప్రారంభించారు. ఈ ప‌నికోసం శుక్ర‌వారం కార్మికులు ఇంటి వెనుక భాగంలో త‌వ్విన‌ప్పుడు, న‌గ‌దు క‌నిపించింది. ఆ న‌గ‌దు త‌న కుమార్తె వివాహం కోస‌మే చేర్చి పెట్టిన‌ట్టుగా సైగ ద్వారా ఉషా తెలిపింది. అప్పుడు కార్మికులు ఈ న‌గ‌దు నోట్లు చెల్ల‌వు అని, కేంద్ర ప్ర‌భుత్వం నాలుగేళ్ల‌కు ముందే ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. ఈ విష‌యం తెలుసుకొని దిగ్భ్రాంతితో త‌ల్లి, కుమార్తె అలాగే నిల‌బ‌డి పోయారు. త‌న కుమార్తె వివాహానికి ఏం చేయాలో తెలియ‌లేద‌ని త‌మిళ రాష్ట్ర ప్ర‌భుత్వం రూపాయి నోట్ల‌ను మార్చ‌డానికి స‌హాయం  చేయాల‌ని క‌న్నీరు పెట్టారు. 

క‌రోనా: యువ‌కుడునేగా  ఏం చేస్తుంది.. అనుకున్నాడు..కానీ..!

అమెరికా(America): క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారితో ప్ర‌పంచ‌దేశాలు వ‌ణికిపోతూనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం దీన్ని తేలిక‌గా తీసుకుంటున్నారు. తాజాగా క‌రోనావైర‌స్‌ను త‌మాసాగా భావించిన ఓ అమెరిక‌న్ య‌వ‌కుడు "కోవిడ్ పార్టీ"లో పాల్గొన్నాడు. అనంత‌రం వైర‌స్ సోకి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ చివ‌ర‌కు  శ్వాస‌విడిచాడు. ఈ  విష‌యాన్ని వెల్ల‌డించిన అమెరికా వైద్యాధికారులు, యువ‌త‌కు పొంచిఉన్న ప్ర‌మాదంపై హెచ్చ‌రిస్తున్నారు.  కోవిడ్ పార్టీ పేరుతో అమెరికాలో కొన్నిచోట్ల యువ‌కులు విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. క‌రోనా సోకిన వ్య‌క్తి త‌న‌కు వైర‌స్ సోకింద‌ని పార్టీ ఏర్పాటు చేసి త‌న మిత్రులను ఆహ్వానిస్తున్నారు. త‌ద్వారా వైర‌స్‌ను జ‌యించ‌గ‌ల‌మో లేద‌నోన‌ని పార్టీలో పాల్గొని ప‌రీక్షించుకుంటున్న సంఘ‌ట‌న‌లు అమెరికాలో రోజురోజుకూ ఎక్కువ‌య్యాయి. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే టెక్సాస్‌లో చోటుచేసుకుంది. 
టెక్సాస్‌కు చెందిన ఓ యువ‌కుడు(30) క‌రోనా వైర‌స్‌ను తేలిక‌గా తీసుకున్నాడు. యువ‌కుల‌పై అంత‌గా ప్ర‌భావం చూపించ‌ద‌ని భావించి క‌రోనా సోకిన వ్య‌క్తి ఏర్పాటు చేసిన "కొవిడ్ పార్టీ"కి హాజ‌ర‌య్యాడు. అంతేకాదు వైర‌స్‌ను జ‌యిస్తానంటూ ఊద‌ర‌గొడుతూ పార్ట‌లో ఎంజాయ్ చేశాడు. అనంత‌రం అత‌నికీ వైర‌స్ సోకింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో స్థానిక సాన్ ఆంటోనియాలోని మెథ‌డిస్ట్ ఆసుప‌త్రిలో చేరాడు.ఇవిచ‌ద‌వండి : వేగంగా దూసుకొస్తున్నముప్పు..!రికార్డు స్థాయిలో కేసులు న‌మోదు
ప‌రిస్థితి విష‌మించ‌డంతో చికిత్స పొందుతూ చివ‌ర‌కు ప్రాణాలు విడిచిన‌ట్టు ఆసుప‌త్రి వైద్యాధికారి జేన్ అప్పిల్‌బై వెల్ల‌డించారు. చికిత్స స‌మ‌యంలో ఆ యువ‌కుడు త‌న అనుభ‌వాల‌ను వైద్యుల‌తో పంచుకున్నాడు. "నేను త‌ప్పుచేశాను. యువ‌కున్నే క‌దా వైర‌స్‌ను జ‌యిస్తాన‌నే ధీమాతో కోవిడ్ పార్టీకి హాజ‌ర‌య్యాను." అని త‌న చివ‌రి క్ష‌ణాల్లో త‌న బాధ‌ను చెప్పుకున్న‌ట్టు వైద్యులు తెలిపారు. వైర‌స్ సోకిన‌ప్పిక‌టీ వారిలో ఆక్సిజ‌న్ స్థాయి, కోవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తేనే వారు ఎంత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారోన‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని వైద్యులు స్ప‌ష్టం చేస్తున్నారు. యువ‌కులమ‌నే ధోర‌ణితో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని విష‌యం ఈ ఘ‌ట‌న స్ప‌ష్టం చేస్తోంద‌ని  అభిప్రాయ‌ ప‌డుతున్నారు. కేవ‌లం వృద్ధులనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని వ‌య‌సుల వారిపై ఈ కోవిడ్ మ‌హ‌మ్మారి త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఇవి చ‌ద‌వండి : సంపూర్ణ లాక్‌డౌన్ దిశ‌గా ప్ర‌భుత్వం..!

No comments:

Post a Comment