Saturday, July 11, 2020

రైత‌న్న‌ల‌కు సీఎం కేసీఆర్ తీపి క‌బురుI చిట్ట చివ‌రి రైతు వ‌ర‌కూ రైతు బంధు అందేలా సూచ‌న‌

రాష్ట్రంలో రైతు బంధు సాయం అంద‌ని రైతులు ఏ మూల‌న ఎవ‌రున్నా వెంట‌నే గుర్తించి, చిట్ట‌చివ‌రి రైతు వ‌ర‌కూ అంద‌రికీ ఆర్థిక సాయం అందించాల‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వం సూచించిన మేర‌కే రైతులు 100 శాతం నియంత్ర‌ణ ప‌ద్ధ‌తిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండ‌టం శుభ‌సూచ‌క‌మ‌ని, ఇది భ‌విష్య‌త్తులో సాధించే గొప్ప విజ‌యానికి నాంది అని సీఎం అన్నారు. సీడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఉత్ప‌త్తి చేసే విత్త‌నాల‌ను నిల్వ చేసేందుకు రూ.25 కోట్లు వ్య‌యంతో అతిపెద్ద అల్ట్రా మోడ‌ర్న్ కోల్డు స్టోరేజీ నిర్మించ‌నున్న‌ట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్ల‌స్ట‌ర్ల‌లో రైతు వేదిక‌ల నిర్మాణం ద‌స‌రా నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. 

హైద‌రాబాద్(Hyderabad): రైతు బంధు సాయం, ఇత‌ర వ్య‌వ‌సాయ అంశాల‌పై ముఖ్య‌మంత్రి  శ‌నివారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. క‌రోనా క‌ష్ట స‌మ‌యంలో ఆర్థిక ప‌రిస్థితి అంత ఆశాజ‌న‌కంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం రైతుల‌కు అండ‌గా నిల‌వాల‌నే స‌దుద్ధేశ్యంతో రైతుబంధు సాయం విడుద‌ల చేసిన‌ట్టు తెలిపారు. అధికారులు ఎంతో స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి రైతులంద‌రికీ స‌కాలంలో రైతు బంధు సాయం అందించార‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందింద‌ని, ఇంకా ఎవ‌రైనా రైతులు మిగిలిపోయారా? ఉంటే వెంట‌నే వారిని గుర్తించి సాయం అందించాల‌ని తెలిపారు. ఏ ఒక్క‌రూ మిగ‌ల‌కుండా చిట్ట‌చివ‌రి రైతు వ‌ర‌కూ రైతు బంధు సాయం అందించాల‌న్నారు. మంత్రులు త‌మ జిల్లాల్లో, ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో రైతులంద‌రికీ సాయం అందిందా? ఇంకా ఎవ‌రైనా మిగిలిపోయారా? అనే విష‌యాల‌ను వెంట‌నే తెలుసుకోవాల‌ని సూచించారు. అంద‌రికీ డ‌బ్బులు అందించే ఏర్పాట్లు చేయాల‌ని తెలిపారు.  కొంత మంది రైతుల‌కు యాజ‌మాన్య హ‌క్కుల విష‌యంలో చిన్న‌చిన్న స‌మ‌స్య‌లు ఉండ‌టం వ‌ల్ల రైతుబంధు సాయం అంద‌డంలో ఇబ్బంది క‌లిగే అవ‌కాశం ఉంద‌న్నారు. అలాంటి వారిని జిల్లా క‌లెక్ట‌ర్లు గుర్తించి, స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కోరారు. యాజ‌మాన్య హ‌క్కు గుర్తించ‌డానికి మోకా మైనా(స్పాట్ ఎంక్వేరీ) నిర్వ‌హించాల‌న్నారు. చుట్టు ప్ర‌క్క‌ల రైతుల‌ను విచారించి యాజ‌మాన్య హ‌క్కులు క‌ల్పించాల‌న్నారు. అంద‌రి స‌మస్య‌లు ప‌రిష్క‌రించి, అంద‌రికీ సాయం అందేలా చూడాల‌న్నారు. ఈ విష‌యంలో రైతుబంధు స‌మితులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారం తీసుకోవాల‌న్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ కూడా త‌న‌కు రైతుబంధు సాయం అంద‌లేద‌ని అన‌వ‌ద్ద‌ని అధికారుల‌ను ఆదేశించారు. రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవ‌రైనా మిగిలిపోయారా? అనే విష‌యాల‌పై వెంట‌నే నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు. క్ల‌స్ట‌ర్ల వారీగా ఎంఈఓల నుంచి నివేదిక‌లు తెప్పించాల‌రి, రైతుబంధు స‌మితుల ద్వారా కూడా వివ‌రాలు తెప్పించాల‌ని తెలిపారు. ఇంకా ఎవ‌రైనా మిగిలిపోతే వారికి వెంట‌నే సాయం అందించాల‌న్నారు. భూముల క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిగితే ఆ వివ‌రాలూ వెంట‌నే న‌మోదు చేయాల‌న్నారు. రైతులు పండించిన పంట‌కు మంచి ధ‌ర రావ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం నియంత్రిత సాగు ప‌ద్ధ‌తిని సూచించింద‌న్నారు. ఇవి చ‌ద‌వండి : "టకాట‌క్" యాప్ వ‌చ్చింది..!చూశారా..!
రైతులు ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకోవ‌డానికి, వ్య‌వ‌సాయాధికారుల‌తో స‌మావేశం  కావ‌డానికి దేశంలో మ‌రెక్క‌డా లేని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదిక‌లు నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. వేదిక‌ల నిర్మాణాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయ‌న్నారు. ద‌స‌రాలోగా ఈ వేదిక‌ల నిర్మానం పూర్త‌య్యేలా క‌లెక్ట‌ర్ల చొర‌వ చూపించాల‌న్నారు. ఒక‌సారి రైతు వేదిక‌ల నిర్మాణం పూర్త‌యితే, అవే రైతుల‌కు ర‌క్ష‌ణ వేదిక‌లు అవుతాయ‌ని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్య‌వసాయ‌క రాష్ట్రంగా రూపాంత‌రం చెందుతున్న‌ద‌ని, అందులో భాగంగా పెద్ద ఎత్తున విత్త‌న ఉత్ప‌త్తి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. రైతుల‌కు అవ‌స‌ర‌మైన మేలు ర‌క‌మైన‌, నాణ్య‌మైన విత్త‌నాల త‌యారీని తెలంగాణ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం, సీడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చేప‌ట్టాయ‌ని, అలా త‌యారు చేసిన విత్త‌నాల‌ను నిల్వ ఉంచ‌డానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడ‌ర్న్ కోల్డ్ స్టోరేజీనిన నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. దీనికి కావాల్సిన నిధుల‌ను కూడా వెంట‌నే విడుద‌ల అవుతాయ‌న్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాల‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇవి చ‌ద‌వండి: స‌చివాల‌యం కూల్చివేత:100 కోట్లు వృథా చేస్తున్నారు: ఎంపీ రేవంత్‌రెడ్డి
 మంత్రులు ఎస్‌.నిరంజ‌న్ రెడ్డి, వేముల ప్ర‌తాప్ రెడ్డి, రైతు బంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షులు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ ముఖ్య  స‌ల‌హాదారు రాజీవ్ శ‌ర్మ‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ముఖ్య కార్య‌ద‌ర్శులు బి.జ‌నార్థ‌న్ రెడ్డి, రామ‌కృష్ణ‌రావు, న‌ర్సింగ్‌రావు, సీడ్ కార్పొరేష‌న్ ఎండి కేశ‌వులు, వ్య‌వ‌సాయ శాఖ ఉప సంచాల‌కులు విజ‌య్ కుమార్ , డిడిఎ శైల‌జ‌, సిఎంఓ కార్య‌ద‌ర్శి స్మితా స‌భ‌ర్వాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment