Wednesday, July 8, 2020

విషాదం: మొన్న సుశాంత్ సింగ్..నేడు సుశీల్ గౌడ ఆత్మ‌హ‌త్య ‌I సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో ఆందోళ‌న‌..!

గ‌త నెల‌లో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకోగా తాజాగా మ‌రో టివీ సిరీయ‌ల్ న‌టుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కార‌ణాలు ఏమీ తెలియ‌క‌ పోవ‌డం..ఆత్మ‌హ‌త్య‌లు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కాక అటు అభిమానుల్లోనూ..ఇటు సినీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  ఎన్నో క‌ష్టాల‌ను చ‌విచూసి సినీ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కు కొని గుర్తింపు వ‌చ్చిన త‌ర్వాత‌ 30 ఏళ్ల‌లోపు వ‌య‌సులోనే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం  ఎందుకు? అనే ప్ర‌శ్న ప్ర‌స్తుతం అంద‌ర్నీ ఆలోచింప‌జేస్తోంది. 

క‌ర్ణాట‌క: ప్ర‌ముఖ క‌న్న‌డ‌ టివీ న‌టుడు సుశీల్ గౌడ ఆయ‌న స్వ‌స్థ‌లమైన మండ్య‌లో మంగ‌ళ‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అయితే ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. 30 ఏళ్ల వ‌య‌స్సున్న సుశీల్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం అత‌ని స్నేహితుల్లో , శాండ‌ల్‌వుడ్‌లో, టివీ ప‌రిశ్ర‌మ‌లో విషాదాన్ని నింపింది. అంత‌పుర అనే రొమాంటిక్ సీరియ‌ల్‌లో న‌టించిన సుశీల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. న‌టుడిగానే కాకుండా ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌గా కూడా ఉన్నారు. అలాగే క‌న్న‌డ చిత్రాల్లో న‌టించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌న్నిహితులు చెబుతున్నారు. హీరో దునియా విజ‌య్ న‌టిస్తున్న తాజా  చిత్రంలో సుశీల్ పోలీసు పాత్ర‌లో న‌టించారు. అయితే ఆ చిత్రం ప్ర‌స్తుతం విడుద‌ల కాలేదు. అత‌ను న‌టించిన చిత్రం విడుద‌ల కాక‌ముందే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి అంద‌రినీ షాక్‌కు గురిచేశారు. సుశీల్ ఆత్మ‌హ‌త్య‌పై దునియ విజ‌య్ ఫేసుబుక్ వేదిక‌గా స్పందించారు. "నేను సుశీల్‌ను మొద‌టిసారి చూసిన‌ప్పుడు అత‌ను హీరో కావాల్సిన వ్య‌క్తి అనుకున్నాను.  కానీ మూవీ విడుద‌ల‌కు ముందే అత‌ను మ‌నల్ని విడిచి వెళ్లిపోయాడు. స‌మ‌స్య ఏదైనా ఆత్మ‌హ‌త్య దానికి ప‌రిష్కారం కాదు. ఈ  ఏడాది వ‌రుస మ‌ర‌ణాలు క‌నుమ‌రగ‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌ని అనిపిస్తోంది.ఇవి చ‌ద‌వండి:  భ‌వ‌నాల కూల్చివేత‌ను ఆపాలంటూ పిల్‌..Iస‌చివాల‌యం చ‌రిత్ర ఏమిటంటే..I16 మంది ముఖ్య‌మంత్రులు ఇక్క‌డ‌నుంచే ప‌రిపాల‌న‌...
ఇది కేవ‌లం క‌రోనా వైర‌స్ భ‌యం వ‌ల్ల‌నే కాదు..జీవ‌నం సాగించ‌డానికి డ‌బ్బు దొర‌క‌ద‌నే న‌మ్మ‌కం కోల్పోవ‌డం వ‌ల్ల కూడా. ఈ క‌ష్ట‌సమయంలో మ‌నం అత్యంత ధైర్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. "అని తెలిపారు. ఇవి చ‌ద‌వండి:  తేట‌తెల్ల‌మైన చైనా బాగోతం..అమ్మాయిల‌ను ఎర‌వేసి బ్లాక్‌మెయిల్‌..!
సుశీల్ ఆత్మ‌హ‌త్య‌పై అత‌ని స‌హాన‌టి అమితా రంగ‌నాథ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. "ఈ వార్త నేను నా స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. అత‌ను చ‌నిపోయాడంటే న‌మ్మ‌లేక‌పోతున్నాను. అత‌ను చాలా మంచి వ్య‌క్తి. ఎప్పుడూ చాలా కూల్‌గా ఉంటాడు. ఇంత చిన్న వ‌య‌సులో ఆయ‌న మ‌ర‌ణించ‌డం చాలా బాధ క‌లిగిస్తోంది." అని అమిత పేర్కొన్నారు. 

సుశాంత్ బాధ‌ను అర్థం చేసుకోలేక‌పోయాం: మ‌నోజ్‌బాజ్‌పాయ్‌

ముంబాయి(Mumbai): సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాద‌క‌ర ముగింపు ఇటు బాలీవుడ్ ప్ర‌ముఖ‌ల‌ను..అటు అభిమానుల‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బాలీవుడ్ లో బంధు ప్రీతి, స‌రైన అవ‌కాశాలు ద‌క్క‌పోవ‌డం వ‌ల్లే సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని అభిమానులు వాదిస్తున్నారు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసుకు సంబంధించి పోలీసుల విచార‌ణ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే సుశాంత్ కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు,ప‌లువురు న‌టుల‌ను, ద‌ర్శ‌కుల‌ను విచారించారు. సుశాంత్ మ‌ర‌ణించి వారాలు గ‌డిచినా ప్ర‌జ‌ల్లోని ఆవేశం, బాధ ఇంకా చ‌ల్లార‌లేదు. ఇలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయ్ ఓ వార్తా  ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్పందించారు. "నా సినిమాను విజ‌య‌వంతం చేసిన ప్ర‌జ‌ల‌కు అడిగే హ‌క్కు ఉంటుంది. వారు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త నాపై ఉంది. అలాగే సుశాంత్ మ‌ర‌ణంపై అభిమానుల్లో ఉబికివ‌స్తున్న ఆగ్ర‌హానికి అర్థం ఉంది. వారు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్పాల్సిందే. నిర్మాత శేఖ‌ర్ క‌పూర్‌కు సుశాంత్ ఎంతో సన్నిహితుడు. "సొంచ్రియా" చిత్రంలో త‌న‌తో క‌లిసి నేను ప‌నిచేశాను. సుశాంత్ మ‌ర‌ణ వార్త విన‌గానే శేఖ‌ర్ క‌పూర్‌తో స‌హా ప్ర‌తి ఒక్క‌రూ షాక్ కు గుర‌య్యారు. అయితే సుశాంత్ బాధ‌ను అర్థం చేసుకోలేక‌పోయాం. "అని చెప్పుకొచ్చారు. ఇవి చ‌ద‌వండి:  మూగ‌బోయిన గొంతు..క‌రోనాతో సుద్దాల నిస్సార్ మృతి

No comments:

Post a Comment