Saturday, July 11, 2020

తెలంగాణ‌లో మ‌హమ్మారి ప్ర‌భావం I పాజిటివ్ కేసులు ఎన్నంటే?Iక‌రోనా సోకింద‌ని భ‌ర్త‌ను వ‌దిలి వెళ్లిన భార్య‌..!

హైద‌రాబాద్(Hyderabad):
తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హమ్మారి ప్ర‌భావం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకే రోజు 10 వేల‌కు పైగా శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా, 1,278 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్టు తెలిపింది. ఇందులో 762 కేసులు జీహెచ్ఎంసీ ప‌రిధిలో కాగా..రంగారెడ్డి లో 171, మేడ్చ‌ల్ 85, సంగారెడ్డి 36 ఇత‌ర ప్రాంతాల్లో మిగ‌తా కేసులు న‌మోదైన‌ట్టు పేర్కొంది. దీంతో తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32,224 కి చేరింది. క‌రోనాతో శుక్ర‌వారం ఒక్క‌రోజే 8 మంది మృతిచెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు 339 మంది మృత్యువాత‌ప‌డ్డారు. క‌రోనా  నుంచి 1,013 మంది కోలుకోగా..ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 19,205 మంది డిశ్చార్జి అయ్యారు. వివిధ కొవిడ్ ఆసుప‌త్రుల్లో 12,680 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఒక్క‌రోజే రాష్ట్రంలో 10,354 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 60 శాతం డిశ్చార్జి కాగా..39 శాతం కేసులు మాత్ర‌మే యాక్టివ్‌గా, ఒక శాతం మ‌ర‌ణాలు న‌మోదైన‌ట్టు పేర్కొంది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల్లో 83 శాతం మందిలో ఎలాంటి ల‌క్ష‌ణాలూ లేవ‌ని, నాలుగు శాతం మందిలోనే తీవ్ర ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇవి చ‌ద‌వండి : యూపీ ఎన్‌కౌంట‌ర్: ఎవ‌రీ వికాస్‌దూబే?I ఓ రైతు కొడుకు గ్యాంగ్‌స్టార్ ఎలా అయ్యాడు.I  పోలీసుల హ‌త్య‌కు ఏలా ప్లాన్ చేశాడు?

ఒకే కుటుంబంలో 9 మందికి క‌రోనా

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నారాయ‌ణ పేట ప‌ట్ట‌ణంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి క‌రోనా సోకింది. రెండ్రోజుల కింద‌ట ప‌ట్ట‌ణానికి చెందిన ఆర్ఎంపీకీ క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ప్రైమ‌రీ  కాంటాక్టు కింద 17 మంది న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల‌కు పంపారు. వారిలో 9 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు వైద్యాధికారులు తెలిపారు. వీరితో క‌లిపి ఉమ్మ‌డి జిల్లాలో శుక్ర‌వారం మొత్తం 20 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 8 మంది, నాగ‌ర్ క‌ర్నూల్ లో ఇద్ద‌రు, జోగులాంబ గ‌ద్వాల‌లో ఒక‌రు చొప్పున క‌రోనా బారిన ప‌డ్డారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ డీహెంహెచ్ ఓ కార్యాల‌యంలో ప‌నిచేసే ఇద్ద‌రు ఉద్యోగుల‌కు క‌రోనా సోకింది. టీబీ ఆస్ప‌త్రిలో పనిచేసే సూప‌ర్‌వైజ‌ర్‌కు కోవిడ్ నిర్థార‌ణ అయింది. ర‌వీంద్ర‌న‌గ‌ర్‌లో ఓ యువ‌కుడికి పాజిటివ్ వ‌చ్చింది. టీడీగుట్ట‌కు చెందిన ఓ వ్య‌క్తికి క‌రోనా సోకింది. జిల్లా కేంద్రం శివారులోని ఓ ప్రైవేటు వైద్య క‌ళాశాల‌లో పీజీ విద్యార్థి క‌రోనా బారిన ప‌డ్డాడు. దేవ‌ర‌క‌ద్ర మండ‌లంలోని ల‌క్ష్మీప‌ల్లికి చెందిన యువ‌కుడికి క‌రోనా వ‌చ్చింది. జ‌డ్చ‌ర్ల‌లోని ల‌క్ష్మీన‌గ‌ర్‌కాల‌నీకి చెందిన ఓయువ‌కుడు కోవిడ్ బారిన ప‌డ్డాడు. గ‌ద్వాల‌లోని పాత బ‌స్టాంట్ ప్రాంతంలో ఓ కిరాణా వ్యాపారికి వైర‌స్ సోకింది. నాగ‌ర్ క‌ర్నూల్‌లో ఇటీవ‌ల రోడ్డుప్ర‌మాదానికి గురై హైద‌రాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ యువ‌కుడు మృతి చెందాడు. ఆయ‌న న‌మూనాల ప‌రీక్ష‌ల ఫ‌లితాలు రాగా అందులో పాజిటివ్ అని తేలింది. ఆయ‌న అంత్య‌క్రియ‌ల్లో పెద్ద ఎత్తున పాల్గొన‌డంతో  స్థానికుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కొల్లాపూర్లో ఓ ఆర్ ఎంపీ  వైద్యుడి భార్య‌కు క‌రోనా సోకింది. బిజినేప‌ల్లి మండ‌లంలోని లింగ‌సానిప‌ల్లికి చెందిన ఓ పోలీసు ఉద్యోగికి క‌రోనా వ‌చ్చింది. ఆయ‌న హైద‌రాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు పాల‌మూరు జిల్లాల్లో 367 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, అందులో 25మంది మృతి చెందారు. 

క‌రోనా సోకింద‌ని భ‌ర్త‌ను వ‌దిలి వెళ్లిన భార్య‌..!

తూర్పుగోదావ‌రి : డ‌యాల‌సిస్ చేయించుకొని ఓ వ్య‌క్తి ఆర్‌టీసీ బ‌స్సులో ఇంటికి వెళ్తుండ‌గా అత‌డికి క‌రోనా సోకింద‌నే స‌మాచారంతో మ‌ధ్య‌లోనే దింపేసిన సంఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా క‌ర‌ప‌లో చోటుచేసుకుంది. రామ‌చంద్ర‌పురానికి చెందిన సుమారు 55 ఏళ్ల వ్య‌క్తి కాకినాడ‌లో డ‌యాల‌సిస్ చేయించుకున్నారు. రెండ్రోజుల కింద‌ట కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేశారు. గురువారం సాయంత్రం ఆసుప‌త్రి నుంచి త‌న భార్య‌తో క‌లిసి రామ‌చంద్ర‌పురానికి వెళ్లేందుకు కాకినాడలో ఆర్‌టీసీ బ‌స్సు ఎక్కారు. ఆర్‌టీసీ సిబ్బంది వారి వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్నారు. వారు ఎక్కిన బ‌స్సు క‌ర‌ప స‌మీపంలోకి వ‌చ్చేస‌రికి ఆ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్‌వ‌చ్చింద‌ని, రిపోర్టు వ‌చ్చేవ‌ర‌కు ఆసుప‌త్రిలో ఉండాల‌ని సూచించినా వారు ఉండ‌కుండా వ‌చ్చేశార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు ఆర్‌టీసీఅధికారుల‌కు స‌మాచారం అందించాయి. బ‌స్సులో నుంచి భార్యాభ‌ర్త‌ల‌ను దింపేయాల‌ని ఆదేశాలు రావ‌డంతో క‌ర‌ప మార్కెట్ సెంట‌ర్‌లో వారిని దింపేశారు. అత‌డితో పాటు బ‌స్సు దిగిన భార్య క‌న‌ప‌డ‌కుండా వెళ్లిపోయింది. బాధితుడు ఒక్క‌డే నిస్స‌హాయ స్థితిలో ఉండిపోవ‌డంతో స‌మాచార‌మందుకున్న క‌ర‌ప ఏఎస్సై జి.ప్ర‌స‌న్న కుమార్ కాకినాడ జీజీహెచ్‌కు విష‌యం తెలిపారు. 

No comments:

Post a Comment