Thursday, July 16, 2020

చివ‌రి ప్ర‌య‌త్నంగా బుజ్జ‌గిస్తున్న కాంగ్రెస్‌..!

జైపూర్ (Jaipur) :రాజ‌స్థాన్ రాజ‌కీయాలు మ‌రో  కీల‌క‌మ‌లుపు తీరిగే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే స‌చిన్‌ఫైల‌ట్‌ను త‌న ప‌ద‌వుల నుంచి తొల‌గించిన కాంగ్రెస్‌..కాస్త ఆలోచించి మ‌రో సారి పార్టీలోకి చేర్చుకునేందుకు చివ‌రి ప్ర‌య‌త్నంగా ప్రియాంక గాంధీని రంగంలోకి దించుతుంది అదిష్టానం.  ఇప్ప‌టికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప‌లువురు పార్టీ సీనియ‌ర్లు స‌చిన్ ఫైల‌ట్‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో చివ‌రి ప్ర‌యత్నంగా ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక రంగ‌లోకి దిగుతున్నారు. అస‌మ్మ‌తి కార‌ణంగా పార్టీకి దూర‌మైన సిచిన్‌ను వెన‌క్కి తీసుకువ‌చ్చే బాధ్య‌త‌ను సోనియా ప్రియాంక‌కు అప్ప‌గించారు. దీంతో రంగంలోకి దిగిన ఆమె కాంగ్రెస్ సీనియ‌ర్లు, వ్యూహ ర‌చ‌న‌లో దిట్టంగా పేరొందిన అహ్మ‌ద్ ప‌టేల్‌, కేసీ వేణుగోపాలతో మంత‌నాలు ప్రారంభించారు.
 వెంట‌నే ఫైల‌ట్‌తో మాట్లాడి ఆయ‌న వెంట ఉన్న ఎమ్మెల్యేల‌ను సైతం వెన‌క్కి తీసుకొచ్చే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు గురువారం వారిద్ద‌రికీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.  కాగా స‌చిన్ కు కాంగ్రెస్ పార్టీ ఎన్న‌టికీ ద్రోహం చేయ‌ద‌ని, ఇప్ప‌టికీ ఆయ‌న కోసం పార్టీ త‌లుపులు తెరిచే ఉంటాయ‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. దీంతో ఫైల‌ట్‌ను వ‌దులుకునేందుకు హాస్తం నేత‌లు సిద్ధంగా లేన‌ట్టు తెలుస్తోంది. మ‌రో వైపు ఫైల‌ట్ తిరుగుబాటుతో రాజ‌స్థాన్‌లో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా స‌చిన్ వ‌ర్గంతో చేతులు క‌లిపిన 19 మంది ఎమ్మెల్యేల‌కు కాంగ్రెస్ పార్టీ ఇదివ‌ర‌కే నోటీసులు జారీ చేసింది. ఇది చ‌ద‌వండి : నిజంగా ..ఈ "పోలీసుల" మ‌న‌స్సు వెన్న‌..! 
 పార్టీ శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశానికి హాజ‌రుకావ‌డం తీవ్రంగా భావించిన సీఎం దానికి గ‌ల కార‌ణాల‌ను వెంట‌నే త‌మ ముందుంచాల‌ని ఆదేశించారు. మ‌రోవైపు పార్టీలో నెల‌కొన్న తాజా ప‌రిస్థితుల‌పై ప‌లువురు సీనియ‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. స‌చిన్‌పై పార్టీ అనుస‌రిస్తున్న విధానం స‌రైన‌ది కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో న‌ష్ట నివార‌ణా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఫైల‌ట్‌తో స‌హా ఎమ్మెల్యేల‌ను వెన‌క్కి తీసుకువ‌చ్చేందుకు పావులు క‌దుపుతోంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర రాజ‌కీయాల్లో నెల‌కొన్న సంక్షోభం న్యాయ‌స్థానానికి చేరింది. అన‌ర్హ‌త నోటీసుల‌పై స‌చిన్ ఫైల‌ట్ వ‌ర్గం రాజ‌స్థాన్ హైకోర్టును ఆశ్ర‌యించింది. ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్ల‌త్ జారీ చేసిన నోటీసుల‌ను స‌వాలు చేస్తూ 19 మంది ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై గురువారం సాయంత్రం న్యాయ‌స్థానం విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశం ఉంది. 

No comments:

Post a Comment