Thursday, July 16, 2020

సీఎం జ‌గ‌న్ మ‌రో నూత‌న శ‌కానికి శ్రీ‌కారం..నేటి నుంచే అమ‌లు

అమ‌రావ‌తి(Amaravathi):
వైద్యం ఖ‌ర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వ‌ర్తింపు ప‌థ‌కం నేటి(గురువారం) నుంచి 6 జిల్లాల‌కు విస్త‌రించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి. గురువారం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో సీఎం ఈ ప‌థ‌కాన్ని లాంఛ‌నంగా  ప్రారంభించారు. విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్ట‌ణం, గుంటూరు, ప్ర‌కాశం, వైయ‌స్సార్ క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాలో ఈ ప‌థ‌కాని్న అమ‌లు చేయ‌నున్నారు. గ‌తంలో 1059 వైద్య ప్ర‌క్రియ‌లు ఉండ‌గా 2200 వైద్య ప్ర‌క్రియ‌ల‌కు పెంచారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద గ‌త ప్ర‌భుత్వం ఉన్న బ‌కాయిల‌ను అన్నింటినీ ఆయా ఆసుప‌త్రుల‌కు చెల్లించారు. ఇది చ‌ద‌వండి : వానొచ్చింది..! 'వ‌జ్ర' క‌రూరులో వేట‌మొద‌లైంది..!

పైల‌ట్ ప్రాజెక్టు...

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో స‌మూల మార్పులు చేస్తూ, తొలుత ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పైల‌ట్ ప్రాజెక్టును ఈ ఏడాది జ‌న‌వ‌రి 3 నుంచి అమ‌లు చేస్తున్నారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న 1,059 వైద్య ప్రక్రియ‌ల‌కు, మ‌రో వెయ్యి వైద్య ప్ర‌క్రియ‌ల‌ను పెంచి 2,059 రోగాల‌కు ఆరోగ్య‌శ్రీ‌ని వ‌ర్తింప చేశారు. పైల‌ట్ ప్రాజెక్టులో గ‌మ‌నించిన అనేక అంశాల‌కు అనుగుణంగా ప‌థ‌కంలో మార్పులు చేస్తూ, ఇప్పుడు మ‌రింత ప‌టిష్టంగా ఆరోగ్య‌శ్రీ అమ‌లు చేసేలా విధానాలు రూపొందించారు. 
ప‌థ‌కంలో వైద్య ప్ర‌క్రియ‌ల‌ను 2,059 నుంచి 2,146 కి పెంచారు. సంపూర్ణ క్యాన్స‌ర్ చికిత్స‌లో భాగంగా మ‌రో 54 వైద్య ప్ర‌క్రియ‌ల‌ను కూడా ప‌థ‌కంలో చేర్చారు. దీంతో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో ప్ర‌భుత్వం అందించే వైద్య ప్ర‌క్రియ‌ల సంఖ్య మొత్తం 2,200 కు చేరింది. కాగా గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కేవ‌లం 1,059 వైద్య ప్ర‌క్రియ‌ల‌కు మాత్ర‌మే ఆరోగ్య‌శ్రీ వ‌ర్తింప చేసేవారు.  మ‌రో వైపు నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల‌కు బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డంతో అవి ప‌థ‌కంలో చికిత్స‌కు నిరాక‌రించాయి. ఇవి చ‌ద‌వండి : చివ‌రి ప్ర‌య‌త్నంగా బుజ్జ‌గిస్తున్న కాంగ్రెస్‌..! 
ప్ర‌స్తుతం ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం దుస్థితిని చూసిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, దీనిపై దృష్టి పెట్టి ప‌రిస్థితి పూర్తిగా మార్చారు. నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రుల‌కు ప‌థ‌కంలో బ‌కాయిలు చెల్లించ‌డంతో పాటు, ఆయా ఆస్ప‌త్రుల‌లో నాణ్య‌మైన వైద్య సేవ‌ల‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌త ఏడాది జూన్ నుంచి రూ.1,815 కోట్ల‌తో పాటు, ఉద్యోగుల ఆరోగ్య ప‌థ‌కం లో మ‌రో రూ.315 కోట్ల‌ను ప్ర‌భుత్వం చెల్లించింది. 

కొత్త‌గా చేర్చిన కొన్ని వైద్య ప్ర‌క్రియ‌లు..

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో కొత్త‌గా చేర్చిన 1000 వైద్య ప్ర‌క్రియ‌లు నిజంగా ప్ర‌జ‌ల‌కు ఒక వ‌రంగా మారుతున్నాయి. వాటిలో కొన్ని డే కేర్ చికిత్స‌లు(ఒక్క రోజు ఆస్ప‌త్రిలో ఉండి చికిత్స పొంద‌డం) కూడా ఉన్నాయి.  ఉదాహ‌ర‌ణ‌కు ర‌క్త‌హీన‌త‌, తేలుకాటు, వాంతులు మ‌రియు డీహైడ్రేష‌న్‌, ర‌క్త విరేచ‌నాలు, స్వ‌ల్ప‌కాలిక చికిత్స‌లు వీటితో పాటు మూర్ఛ‌వ్యాధి, డెంగీజ్వ‌రం, చికున్ గున్యా, వ‌డ‌దెబ్బ‌, ఆస్త‌మా వంటి ఐ.పీ చికిత్సలు కూడా కొత్త‌గా ప‌థ‌కంలో చేర్చారు. ప‌లువురు వైద్య నిపుణులు సూచించిన 87 కొత్త వైద్య ప్ర‌క్రియ‌ల‌ను కూడా ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ప‌రిధిలోకి తీసుకువ‌చ్చారు. ఇది చ‌ద‌వండి : నిజంగా ..ఈ "పోలీసుల" మ‌న‌స్సు వెన్న‌..! 

మిగిలిన జిల్లాల్లో..

ఇప్ప‌టికే ఫైల‌ట్ ప్రాజెక్టు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో అమ‌లు చేస్తుండ‌గా గురువారం నుంచి మ‌రో ఆరు జిల్లాల్లో కొత్త ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం అమ‌లు కానుంది. ఈ నేప‌థ్యంలో మిగిలిన 6 జిల్లాల్లో కూడా ఈ ఏడాది న‌వంబ‌ర్ 14వ తేదీ నుంచి ప‌థ‌కం అమ‌లు చేయ‌నున్నారు.  

No comments:

Post a Comment