Wednesday, July 15, 2020

ప్రైవేటీక‌ర‌ణ‌పై డివైఎఫ్ఐ ఆందోళ‌న‌..!

ఖ‌మ్మం(Khammam):
రైల్వే ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లంద‌రూ క‌లిసిరావాల‌ని డివైఎఫ్ ఐ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ బ‌షీరుద్ధీన్ పిలుపునిచ్చారు. బుధ‌వారం ఆ సంఘం రాష్ట్ర క‌మిటీ పిలుపులో భాగంగా ఖ‌మ్మం జిల్లా క‌మిటీ ఆధ్వ‌ర్యంలో స్థానిక రైల్వేస్టేష‌న్ దెటు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ బ‌షీరుద్దీన్ మాట్లాడుతూ అధికారంలోకి రాక‌ముందు మోడీ రైల్వేను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌ను అని వాగ్ధానం చేశార‌ని ఇప్పుడు మాట త‌ప్పార‌ని తెలిపారు. రైల్వేస్టేష‌న్ లో టీ అమ్ముకున్న మోడీ ఇప్పుడు రైల్వే శాఖ‌నే అమ్మేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.  ప్ర‌పంచ బ్యాంకు ష‌రతుల‌లో భాగంగా దేశంలోని అన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్నార‌ని ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా యావ‌త్తు దేశ‌మంతా క‌లిసి  పోరాడేందుకు క‌ద‌లి రావాల‌ని పిలుపునిచ్చారు.  రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను కూడా భ‌ర్తీ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్రైవేటీక‌ర‌ణ‌ను యువ‌త అంతా వ్య‌తిరేకించాల‌ని ఎందుకంటే త‌క్కువ వేత‌నాలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా శ్ర‌మ‌దోపిడీ చేస్తార‌ని ఆరోపించారు.  రైల్వే ప్రైవేటీక‌ర‌ణ‌పై కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌క‌పోతే అంద‌రినీ క‌లుపుకొని పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా దీనికి వ్య‌తిరేకంగా క‌లిసి రావాల‌ని ఆయ‌న కోరాడు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఉపాధ్య‌క్షులు భూక్యా ఉపేంద‌ర్ నాయ‌క్‌, శీలం వీర‌బాబు, స‌హాయ‌కార్య‌ద‌ర్శి చింత‌ల ర‌మేష్ , నాయ‌కులు సాగ‌ర్‌, జ‌ల‌గం న‌గేష్‌, రాజేష్‌, అశోక్‌, శోభ‌న్‌, రాంబాబు, వెంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇవి చ‌ద‌వండి : క‌రోనా వ‌చ్చింద‌ని బైక్ కాల్చేసిన య‌జ‌మాని

No comments:

Post a Comment