Wednesday, July 15, 2020

భ‌ద్రాద్రిలో విషాదం: ఫోన్ సిగ్న‌ల్ కోసం వెళితే..ప్రాణం పోయింది.

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం(Bhadradri Kothagudem) :
జిల్లాలో విషాదం బుధ‌వారం విషాదం చోటుచేసుకుంది. ఓ యువ‌కుడు  త‌న ఫోన్‌లో సిగ్న‌ల్ స‌రిగా రావ‌డం లేద‌ని మ‌రో ఊరికి వెళ్లాడు. సిగ్న‌ల్ వ‌చ్చే ప్రాంతంలో ఓ చింత చెట్టు కింద నిల్చొని ఫోన్ చూస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే  ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం రావ‌డం ప్రారంభ‌మైంది. అంత‌లోనే పెద్ద శ‌బ్ధంతో పిడుగుప‌డింది. దీంతో ఆ యువ‌కుడు చెట్టుకింద‌నే కుప్ప‌కూలి ప్రాణాలు వ‌దిలాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. భ‌ద్రాద్రికొత్త‌గూడెం జిల్లా గుండాల మండ‌లం శంభునిగూడెం గ్రామానికి చెందిన ఈసం కృష్ణ‌(22) స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. అయితే త‌న మొబైల్లో  త్రీజీ సిగ్న‌ల్ స‌రిగా రావ‌డం లేదు. దీంతో ప‌క్క‌నే ఉన్న గొర‌క‌ల‌మడుగు గ్రామ స‌మీపంలోకి చింత‌చెట్టు కిందకు వెళ్లాడు. అప్ప‌టికే భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా పిడుగుప‌డ‌టంతో కృష్ణ అక్క‌డికక్క‌డే మృతిచెందాడు.  వాస్త‌వానికి త‌న స్వ‌గ్రామ‌మైన శంభునిగూడెం గ్రామంలో త్రీజీ సిగ్న‌ల్  స‌రిగా రాద‌ని స్థానికులు చెబుతున్నారు. కొంద‌రు యువ‌కులు సాయంత్రం స‌మ‌యంలో ఫోన్ సిగ్న‌ల్‌, చాటింగ్ కోసం ఆ చెట్టు కింద‌కే వెళుతుంటారు. కృష్ణ సైతం సిగ్న‌ల్స్ కోసం వ‌చ్చి పిడుగుపాటుకు గురై మ‌ర‌ణించ‌డం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇవి చ‌ద‌వండి : పొంగుతున్న క‌ట్ట‌లేరు..నందిగామ ప్రాంతంలో అప్ర‌మ‌త్తం..!

 రెడ్ అలెర్ట్‌..! ముంబైలో భారీ వ‌ర్షాలు..!

ముంబై(Mumbai): భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై ఇప్ప‌టికే అత‌లాకుత‌లం అవుతోంది. రోడ్డ‌న్నీ నీటితో నిండిపోవ‌డంతో ఇళ్ల‌ల్లోంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. దీనికి తోడు భార‌త వాతావ‌ర‌ణ శాఖ మ‌రో హెచ్చ‌రిక జారీ చేసింది. ముంబైతో పాటు థానే, రాయ్‌గ‌డ్‌, ర‌త్నగిరి జిల్లాల్లో రానున్న 18 గంట‌ల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 
మంగ‌ళ‌వారం నాటి ఆరెంజ్ అలెర్ట్ ను రెడ్ అలెర్ట్‌గా మారుస్తూ బుధ‌వారం ప్ర‌త్యేక బులెటిన్ విడుద‌ల చేసింది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. గురువారం కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవకాశం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. గ‌త మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ముంబైలో కుండ‌పోత‌గా వ‌ర్షం కురుస్తోంది. దీంతో విద్యుత్‌, మంచినీటి స‌ర‌ఫ‌రా, ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు అంత‌రాయం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని, లోత‌ట్టు, తీర ప్రాంతాల‌కు వెళ్లొద్ద‌ని బ్రిహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. 

No comments:

Post a Comment