Wednesday, July 8, 2020

భ‌వ‌నాల కూల్చివేత‌ను ఆపాలంటూ పిల్‌..Iస‌చివాల‌యం చ‌రిత్ర ఏమిటంటే..I16 మంది ముఖ్య‌మంత్రులు ఇక్క‌డ‌నుంచే ప‌రిపాల‌న‌...


హైద‌రాబాద్(Hyderabad): 
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స‌చివాల‌యంలోని భ‌వ‌నాల కూల్చివేత ప‌నులు నిలిపివేయాలంటూ హైకోర్టులో లంచ్ మోష‌న్ పిల్ దాఖ‌లు అయ్యింది. ప్రొఫెస‌ర్ పి.ఎల్ విశ్వేశ్వ‌ర‌రావు ఈ పిల్ దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ భవ‌నాల‌ను కూల్చివేస్తున్నార‌ని పేర్కొన్నారు పిటిష‌న‌ర్‌. భ‌వ‌నాల కూల్చివేయ‌డం వ‌ల్ల వాతావ‌ర‌ణం కాలుష్య‌మ‌వుతుంద‌న్నారు. సాలీడ్ వేస్ట్ మ్యానేజిమెంట్ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా కూల్చివేత చేప‌డుతున్న‌ట్టు కోర్టుకు తెలుపుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు ప్రొఫెస‌ర్ పి.ఎల్ విశ్వేశ్వ‌ర్ రావు. 5 ల‌క్ష‌ల మంది పీల్చే స్వ‌చ్ఛ‌మైన గాలికి కూల్చివేత‌లు వ‌ల్ల ఆటంకాలు క‌లుగుతుంద‌న్న హైకోర్టు..ప్ర‌స్తుతం అత్య‌వ‌స‌రంగా విచారించ‌లేమ‌ని తెలిపింది. ఇందుకు సంబంధించిన విచార‌ణ తేదీని త్వ‌ర‌లోనే చెబుతామ‌ని హైకోర్టు పేర్కొంది. 

కొన‌సాగుతున్న కూల్చివేత ప‌నులు..!

గ‌త మంగ‌ళ‌వారం భ‌వ‌నాల కూల్చివేత ప్రారంభించిన తెలంగాణ ప్ర‌భుత్వం భారీ పోలీసు బందోబ‌స్తు మధ్య కూల్చివేత ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తుంది. గ‌తంలో స‌చివాల‌యం భ‌వ‌నాల‌ను కూల్చివేసి  అదే ప్రాంతంలో ఆధునిక హంగుల‌తో కొత్త స‌చివాల‌య భ‌వ‌న సముదాయం నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా దాఖ‌లైన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాల‌ను కొట్టివేస్తూ జూన్ 29న రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. తీర్పు వ‌చ్చిన వారం రోజుల‌కే ఆక‌స్మాత్తుగా స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేతకు స‌ర్కారు శ్రీ‌కారం చుట్టింది. స‌చివాల‌యంలో ఏ,బీ,సీ,డీ, జీ.జె, కే, ఎల్‌, నార్త్ హెచ్‌, సౌత్ హెచ్ బ్లాకుల భ‌వ‌నాలు ఉండ‌గా, మంగ‌ళ‌వారం సీ,హెచ్‌, జీబ్లాకుల‌తో పాటు స‌చివాల‌యం ప్ర‌క్క‌న ఉన్న రాతిభ‌వ‌నం కూల్చివేత ప‌నులు దాదాపు పూర్త‌య్యాయి. 
మిగిలిన బ్లాకుల కూల్చివేత ప‌నులూ స‌మాంత‌రంగా జ‌రుగుతున్నాయి. తాత్కాలిక స‌చివాల‌యం న‌డుస్తున్న బీఆర్కే భ‌వ‌న్‌లో ఉద్యోగుల‌కు మంగ‌ళ‌వారం సెల‌వు ఇచ్చారు. బిల్డింగ్ ఇంప్లోజియం ప‌రిజ్ఞానంతో పేలుడు ప‌దార్థాలు ఉప‌యోగించి నియంత్రిత ప‌ద్ధ‌తిలో పేలుళ్లు జ‌ర‌ప‌డం ద్వారా స‌చివాల‌యం భ‌వ‌నాల‌ను సులువుగా, స‌త్వ‌రంగా కూల్చివేయాల‌ని తొలుత రాష్ట్ర ప్ర‌భుత్వం భావించింది. పేలుళ్ల ప్ర‌కంప‌న‌ల దాటికి ప‌క్క‌నే నిండు కుండ‌లాగా ఉండే హుస్సేన్‌సాగ‌ర్ క‌ట్ట‌కు ఏమైనా ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశ‌ముంద‌ని భావించి దాన్ని ప్ర‌భుత్వం విర‌మించుకుంది. పెద్ద మొత్తంలో ద‌ట్ట‌మైన దుమ్ము ఎగిసిప‌డి చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌జ‌లు సైతం ఇబ్బందిప‌డ‌తార‌ని ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. భారీ ప్రొక్లైన‌ర్లు, క్రేన్లు, ఇత‌ర యంత్రాల‌ను వినియోగించి సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో కూల్చివేత ప‌నులు నిర్వ‌హిస్తున్నారు. మ‌రో నాలుగు రోజుల్లో భ‌వ‌నాల‌న్నీ పూర్తిగా నేల‌మ‌ట్టం కానున్నాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. కూల్చివేత అనంత‌రం బ‌య‌ట‌ప‌డనున్న ట‌న్నుల కొద్ది శిథిలాల‌ను త‌ర‌లించ‌డానికి మాత్రం కొన్ని వారాల స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ని  అధికారులు అంటున్నారు. ప్ర‌భుత్వం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌కుండా అక‌స్మాత్తుగా కూల్చివేత‌ను ప్రారంభించ‌డాన్ని విప‌క్ష పార్టీలు తీవ్రంగా విమ‌ర్శించాయి. కూల్చివేత‌, శిథిలాల త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి కొత్త స‌చివాల‌య భ‌వ‌న సముదాయం నిర్మాణ ప‌నుల‌ను తక్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. 

స‌చివాల‌యం చ‌రిత్ర ఏమిటంటే..!

132 ఏళ్ల ఘ‌న చ‌రిత్ర క‌లిగిన ఈ స‌చివాల‌య భ‌వ‌నాలు ప్రస్తుతం క‌నుమ‌రుగ‌వుతున్నాయి. ప‌రిపాన‌ల అవ‌స‌రాల కోసం 6వ నిజాం న‌వాబు 1888 లో సైఫాబాద్ ప్యాలెస్‌ను నిర్మించ‌గా, కాల‌క్ర‌మంలో అది రాష్ట్ర స‌చివాల‌యం జీ-బ్లాక్ గా అవ‌త‌రించింది. యూరోపియ‌న్ ఆర్కిటెక్ట్ శైలిలో నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్‌తో ఎన్నో చారిత్రాత్మ‌క సంఘ‌ట‌న‌లు ముడిప‌డిఉన్నాయి. 6వ నిజాం 1888 లో ఈ భ‌వ‌నాన్ని ప్రారంభించ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు బ‌ల్లి అడ్డురావ‌డంతో అప‌శ‌కునంగా భావించి దీనికి తాళం వేసి ఉంచారు. అనంత‌రం 1940 లో దీనిని తెరిచారు. ఏ -బ్లాకును 1981 లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి టి.అంజయ్య ప్రారంభించారు. సీ-బ్లాక్ ను 1978 లో ఆనాటి సీఎం చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంత‌స్తులున్నాయి. 
దీంట్లోనే ముఖ్య‌మంత్రులు కొలువుదీరేవారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ నిర్మాణానికి ముందు సీఎం కేసీఆర్ సైతం కొంత‌కాలం పాటు సీ-బ్లాక్ నుంచే కార్య‌క‌లాపాలు నిర్వ‌హించారు. ఏ -బ్లాక్ రెండో విడ‌త‌ను 1998 ఆగ‌ష్టు 10న చంద్ర‌బాబునాయుడు సీఎంగా ఉన్న‌ప్పుడు ప్రారంభించారు. డీ-బ్లాక్‌ను 2003లో చంద్ర‌బాబునాయుడే శంకుస్థాప‌న చేయ‌గా, 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని ప్రారంభించారు. మొన్న‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న జే,ఎల్ బ్లాకుల‌ను 1990 న‌వంబ‌ర్ 12న అప్ప‌టి ముఖ్య‌మంత్రి మ‌ర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. స‌చివాల‌యంలో అతిపెద్దిది జే బ్లాక్ .25 ఎక‌రాల విస్తీర్ణ‌లో ఉన్న స‌చివాల‌యంలో మొత్తం 10 బ్లాకులు ఉండ‌గా, 132 ఏళ్ల‌లో ద‌శ‌ల వారీగా వీటి నిర్మాణం జ‌రిగింది. కొత్త‌గా నిర్మించిన డీ-బ్లాక్‌ను 2003లో నార్త‌, సౌత్ హెచ్ బ్లాకుల‌ను 2013లో ప్రారంభించారు. 

16 మంది ముఖ్య‌మంత్రులు ఇక్క‌డ‌నుంచే ప‌రిపాల‌న‌...

ఉమ్మ‌డి ఏపీ, విభ‌జ‌న అనంత‌రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌ను ఏలిన 16 మంది ముఖ్య‌మంత్రులు ఇక్క‌డి నుంచే ప‌రిపాల‌న కొన‌సాగించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌రిపాల‌న కేంద్రంగా 6 ద‌శాబ్ధాలుగా పైనే సేవ‌లందించింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మ‌డి స‌చివాల‌యంగా ఉప‌యోగ‌ప‌డింది. ఎంద‌రో సీఎంలు, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు, స‌చివాల‌యం కేడ‌ర్ అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు, రిటైర్డు అధికారుల‌కు ద‌శాబ్ధాల అనుబంధం ఈ భ‌వ‌నాల‌తో ఉంది. భ‌వ‌నాల‌ను కూల్చివేస్తున్నార‌ని తెలుసుకుని అంద‌రూ స‌చివాల‌య భ‌వ‌నాల‌తో త‌మ అనుబంధాన్ని స‌న్నిహితుల వ‌ద్ద నెమ‌ర‌వేసుకున్నారు. 

ఎందుకు కూల్చివేస్తున్నారు? 

ప్ర‌స్తుత స‌చివాల‌యానికి చాలా వాస్తు దోషాలున్నాయ‌ని వాస్తుపండితులు సీఎం కేసీఆర్‌కు స‌ల‌హా ఇచ్చారు. ఆర్‌బిఐ నుంచి వ‌చ్చే ర‌హ‌దారితో స‌చివాలయానికి వీధిపోటు ఉంద‌ని, అదే విధంగా 25 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న స‌చివాల‌యం  స్థ‌ల ఆకారం సైతం గ‌జిబిజీగా ఉంద‌ని వాస్తు పండితులు పేర్కొనేవారు. చ‌తుర‌స్త్ర‌జ/     దీర్ఘ‌చ‌తుర‌స్త్ర ఆకారంలో స్థ‌లం ఉంటేనే వాస్తు ఉంటుంద‌ని, ఆ దిశ‌గా కొత్త స‌చివాల‌యం కోసం ప‌క్క‌నే ఉన్న ఇత‌ర కార్యాల‌యాల భ‌వ‌నాల స్థ‌లాల‌ను సైతం సేక‌రించాల‌ని వాస్తు పండితులు సీఎంకు సూచించారు. వాస్తు స‌ల‌హాల కోసం సుద్ధాల సుధాక‌ర్ తేజ‌ను క‌న్స‌లెంట్‌గా సీఎం నియ‌మించుకున్నారు. ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ కార్యాల‌యంలో ఈయ‌న‌కు ప్ర‌త్యేకంగా ఒక చాంబ‌ర్‌ను సైతం కేటాయించారు. కొత్త భ‌వ‌నాల నిర్మాణం, డిజైన్ల త‌యారీ, ముహుర్తాల ఖ‌రారు, శంకుస్థాప‌న  స్థ‌ల నిర్ణ‌యం వంటి అంశాల్లో సుధాక‌ర్ తేజ ప్రభుత్వానికి స‌ల‌హాలు ఇస్తున్నారు. 

No comments:

Post a Comment