Tuesday, July 14, 2020

వేగంగా దూసుకొస్తున్నముప్పు..!రికార్డు స్థాయిలో కేసులు న‌మోదు

న్యూఢిల్లీ(NewDeldhi): 
భార‌త్‌లో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఉధృతి రోజురోజుకూ కొన‌సాగుతోంది. గ‌త‌కొన్ని రోజులుగా రికార్డుస్థాయిలో నిత్యం దాదాపు 28 వేల పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ ప‌డుతు న్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా కొత్త‌గా 28,498 పాజిటివ్ కేసులు న‌మోద ‌య్యాయి. దీంతో దేశంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య 9,06,752 కు చేరిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. నిన్న ఒక్క‌రోజే 553 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డం ఆందోళ‌న క‌లిగి స్తుంది. దీంతో భార‌త్‌లో క‌రోనా మృతుల సంఖ్య 23,727 గా న‌మోదైన‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. ఇక క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 5,71,460 మంది కోలుకోగా ప్ర‌స్తుతం 3,11,565 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 63.02 శాతంగా ఉండ‌గా మృతుల రేటు 2.64 శాతంగా ఉంది. ఇవి చ‌ద‌వండి : వాట్సాప్ వేదిక‌గా త‌‌న బ‌లాన్ని చూపిన స‌చిన్‌..!నిబ్బ‌రంగా ఉన్న సీఎం..!

3 ల‌క్ష‌ల కేసులు, 6 వేల మ‌ర‌ణాలు..

దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. గ‌డిచిన మూడు రోజుల్లోనే దాదాపు ల‌క్ష కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయంటేనే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. దేశంలో జూలై 1 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 3,21,259 కేసులు న‌మోదయ్యాయి. ఇక మ‌ర‌ణాల సంఖ్య కూడా క‌ల‌వ‌ర‌పెడుతోంది. గ‌డిచిన రెండువారాల్లో దేశ‌వ్యాప్తంగా దాదాపు 6,327 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మ‌హారాష్ట్ర‌లో ఈ సంఖ్య అధికంగా ఉంది. దేశంలో క‌రోనా విజృంభ‌ణ పెరుగుతుండ‌టంతో నిర్థార‌ణ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం భారీగా నిర్వ‌హిస్తోంది. జూలై 13 నాటికి దేశంలో కోటి 20 ల‌క్ష‌ల శాంపిళ్ల‌కు కోవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు పూర్తి చేసిన‌ట్టు భార‌త్ వైద్య ప‌రివోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 1200 కేంద్రాల‌కు కోవిడ్ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు ఐసీఎంఆర్ అనుమ‌తిచ్చింది. నిత్యం దాదాపు 2 ల‌క్ష‌ల శాంపిళ్ల‌ను నిర్థార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుపుతోంది. ఇవి చ‌ద‌వండి : సంపూర్ణ లాక్‌డౌన్ దిశ‌గా ప్ర‌భుత్వం..!

No comments:

Post a Comment