Wednesday, July 15, 2020

పొంగుతున్న క‌ట్ట‌లేరు..నందిగామ ప్రాంతంలో అప్ర‌మ‌త్తం..!

నందిగామ‌(Nandigama):
కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షానికి ఎగువ నుండి వ‌స్తున్న వ‌ర‌ద నీరు అంత‌కంత‌కూ పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతంలో ఉన్న ప‌లు గ్రామాల‌ను అధికార‌, పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. జిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌నాథ్ , నందిగామ డిఎస్పీ జివీ ర‌మ‌ణ‌మూర్తి ఆదేశాల మేర‌కు స‌మీప  గ్రామాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు నందిగామ రూర‌ల్ సీఐ స‌తీష్‌. ఖ‌మ్మం జిల్లా నుండి పొంగి ప్ర‌వ‌హిస్తున్న వాగులు,వంక‌ల‌తో నందిగామ మండ‌లం కూడ‌లి దాములూరు వ‌ద్ద క‌ట్ట‌లేరు పొంగి ప్ర‌వ‌హించ‌డంతో వీరుల‌పాడు నందిగామ రాక‌పోక‌ల‌కు నిలిపివేశారు.
 ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగకుండా వెళ్లే ర‌హ‌దారిలో క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్ర‌ధాన ర‌హ‌దారి అయిన కీస‌ర కంచ‌ల వెళ్లే దారిలో  కూడా ఎవ‌రూ వెళ్ల‌కుండా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. మున్నేరు నుండి సుమారు 15,500 క్యూసెక్కుల నీరు కింద‌కు విడుద‌ల‌వ‌డంతో స‌మీపగ్రామ‌స్థుల‌ను మున్న‌లూరు, కునిక‌న‌పాడు, చెవిటిక‌ల్లు న‌దిలోకి వెళ్ల‌కూడ‌ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. కంచిక‌చ‌ర్ల మండ‌లం గ‌ని, ఆత్కూరు శుద్ధ వాగు , చెవిటిక‌ల్లు వ‌ద్ద కంచ ఐల‌య్య వాగు ప్ర‌వ‌హించ‌డంతో అక్క‌డ కూడా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. ఎక్క‌డైనా ఎవ‌రైనా  ఆప‌ద‌లో ఉన్న‌ట్టు తెలిస్తే త‌క్ష‌ణ‌మే వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు , బోట్లు సిద్ధంగా ఉన్నాయ‌ని సీఐ స‌తీష్ తెలిపారు. 

No comments:

Post a Comment