Thursday, July 16, 2020

త‌మిళ‌నాడులో దారుణం..టీవీ రిమోట్ అడిగింద‌ని..!

చెన్నై (Chennai):
త‌మిళ‌నాడులో దారుణం వెలుగుచూసింది. టీవీ రిమోట్ అడిగినందుకు ఏడేళ్ల చిన్నారి హ‌త్య‌కు గురైంది. త‌మిళ‌నాడు తుత్తుకుడి జిల్లాకు చెందిన సాతంకుళం ప‌ట్ట‌ణానికి చెందిన ఏడేళ్ల చిన్నారి త‌న ఇంట్లో క‌రెంట్ లేక‌పోవ‌డంతో ప్ర‌తిరోజూ ప‌క్కింటికి వెళ్లి టీవీ చూసేది. ఎప్ప‌టిలాగే టీవీ చూసేందుకు ప‌క్కింటికి వెళ్ల‌గా.. ఆ ఇంటి య‌జ‌మాని త‌న కొడుకుతో గొడ‌వ‌ప‌డు తున్నాడు. అదే స‌మ‌యంలో చిన్నారి ఛానెల్ మార్చుకుంటాను టీవీ రిమోట్ ఇవ్వ‌మ‌ని కోరింది. దీంతో నిందితుడు ఆ బాలిక గొంతుకోసి హ‌త్య చేశాడు. అనంత‌రం త‌న స్నేహితుడి సాయంతో 2 కిలోమీట‌ర్ల దూరంలో డంపింగ్ యార్డ్ లో మృత‌దేహాన్ని వ‌దిలేసి వ‌చ్చాడు. అయితే త‌న కుమార్తె క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గురైన త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ద‌ర్యాప్తులో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా, గాలింపు చ‌ర్య‌ల్లో డంపింగ్ యార్డులో బాలిక‌మృత‌దేహం ల‌భ్య‌మైంది.ఇవి చ‌ద‌వండి : సీఎం జ‌గ‌న్ మ‌రో నూత‌న శ‌కానికి శ్రీ‌కారం..నేటి నుంచే అమ‌లు
మృత ‌దేహాన్ని ప‌రిశీలించిన పోలీసులు.. బాధితురాలు హ‌త్య‌కు గురైన‌ట్టు గుర్తించారు. నిందితుల కోసం త‌న‌దైన ప‌ద్ధ‌తిలో విచారించ‌గా ప‌క్కింటికి చెందిన వ్య‌క్తి హ‌త్య చేసిన‌ట్టు తేలింది. నిందితుడు అత‌డి స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. గ‌తంలో నిందితుల‌పై ప‌లు కేసులు ఉన్నాయ‌ని, గంజాయి అమ్మ‌కాలు  జ‌రిపిన‌ట్టు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాలిక హత్య కేసును పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌ట్టేందుకు మృత‌దేహాన్ని పోస్టు మార్టం కు పంపించారు. 

No comments:

Post a Comment