Monday, July 13, 2020

ప్రియాంక‌గాంధీ రాజీ ఫార్ములాతో ఎంట్రీ..! మెత్త‌బ‌డిన స‌చిన్ ఫైల‌ట్‌..!

న్యూఢిల్లీ(NewDelhi):
రాజ‌స్థాన్ లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్న‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి అశోక్ గ‌హ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసిన ఉప‌ముఖ్యమంత్రి , పీసీసీ చీఫ్ స‌చిన్ ఫైల‌ట్ ఎట్ట‌కేల‌కు మెత్త‌బ‌డ్డారు. త‌న వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, గ‌హ్లోత్ ప్ర‌భుత్వం  ఇబ్బందిలో ప‌డింద‌న్న ఫైల‌ట్ అధిష్టానం చొర‌వ‌తో మ‌నసు మార్చుకున్నారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. గహ్లోత్‌, స‌చిన్ ఫైల‌ట్ మ‌ధ్య రాజీ ఫార్ములాను ముందుకు తెచ్చారు. దీంతో ఫైల‌ట్ ప‌లు డిమాండ్ల‌ను పార్టీ ముందుంచారు. పార్టీ చీఫ్‌గా త‌న‌ను కొన‌సాగించ‌డంతో పాటు త‌న వ‌ర్గానికి నాలుగు మంత్రి  ప‌ద‌వుల‌తో పాటు కీల‌క ఆర్థిక‌, హోంశాఖ‌ల‌ను క‌ట్ట‌బెట్టాల‌ని కోరారు. దీనిపై పార్టీనేత‌లు ఇరువ‌ర్గాల నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. అంత‌కుముందు ఢిల్లీ, జైపూర్ వేదిక‌గా పార్టీలో రాజ‌కీయ హైడ్రామా చోటుచేసుకుంది. త‌న ప్ర‌భుత్వం మైనార్టీలో ప‌డ‌లేద‌ని, త‌న‌కు 102 మంది ఎమ్మెల్యేలు మ‌ద్దు ఉంద‌ని సీఎం గ‌హ్లోత్ స్ప‌ష్టం చేయ‌డంతో నెంబ‌ర్ గేమ్‌పై ఉత్కంఠ నెల‌కొంది. మ‌రోవైపు రాజ‌స్థాన్ లో ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు బిజేపీ కుట్ర‌లు చేస్తోంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు ర‌ణ‌దీప్ సుర్జేవాలా మండిప‌డ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి కాలం పాల‌న సాగిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.  ఇక 200 మంది స‌భ్యులున్న రాజ‌స్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్ర‌స్తుతం 107 మంది, బీజేపీకీ 72 మంది స‌భ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మ‌ద్ద‌తిస్తున్నారు. 13 మంది స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మ‌ద్దతిస్తున్నారు. అయితే, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్న నేప‌థ్యంలో సీఎల్పీ భేటీపై అంద‌రిక దృష్టి కేంద్రీకృత‌మైంది. 

బిజేపీలో చేర‌డం లేదు: స‌చిన్ ఫైల‌ట్‌

రాజ‌స్థాన్ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత స‌చిన్ ఫైల‌ట్ తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి అశోక్ గ‌హ్లోత్‌తో విబేధాల నేప‌థ్యంలో స‌చిన్ ఫైల‌ట్ బీజేపీలో చేర‌తార‌నే వార్త‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం జ‌రిగిన కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశానికి  కొన్ని గంట‌ల ముందు స‌చిన్ ఫైల‌ట్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను బీజేపీలో చేర‌డం లేద‌ని  వెల్ల‌డించారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డాను క‌ల‌వ‌బోతున్నార‌న్న వార్త‌ల‌ను మాత్రం ఆయ‌న ఖండించ‌లేదు. ముఖ్య‌మంత్రి అశోక్ గ‌హ్లోత్‌తో తీవ్రంగా విభేదించిన స‌చిన్ ఫైల‌ట్‌..బీజేపీ లో చేరిపోతున్నార‌ని వార్త‌లొచ్చాయి. అంతేకాక 30 మంది ఎమ్మెల్యేలు త‌న‌కు తోడుగా ఉన్నార‌న్నారు స‌చిన్‌ఫైల‌ట్‌. కొంద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు కూడా  త‌న‌కు మ‌ద్ద‌తిస్తున్నార‌న్నారు. ప్ర‌స్తుతం అశోక్ గ‌హ్లోత్ ప్ర‌భుత్వం మైనారిటీలో ఉందంటూ ఫైల‌ట్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆదివారం ప్ర‌క‌ట‌న వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ యువ‌నేత జ్యోతిరాదిత్య సింధియాతో కూడా భేటీ అయ్యారు. సోమ‌వారం జైపూర్‌లో జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశంలో స‌చిన్‌ఫైల‌ట్ కాస్త మెత్త‌బ‌డినట్టు తెలుస్తోంది. 

No comments:

Post a Comment