Monday, July 6, 2020

ఇలా అయితే బతికేది ఎలా?

క‌రోనా భ‌యం ఇప్పుడు మ‌హాన‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేస్తుంది. రోజురోజుకూ పెరుగుతున్న క‌రోనా కేసులు వ‌ల్ల అటు ప్ర‌జ‌లు, ఇటు అధికార యంత్రాంగం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత కేసులు మ‌రింత పెర‌గడంతో న‌గ‌ర వాసుల్లో భ‌యం ప‌ట్టుకుంది. క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఒక్క ప్ర‌క్క ఆర్థిక  ఇబ్బందులు ప‌డుతూ మ‌రో ప్ర‌క్క ఏ వ‌స్తూవు కొనాల‌న్నా అధిక రేట్లు ఎక్కువ అవ‌డంతో ప్ర‌స్తుతం న‌గ‌రంలోని బ‌త‌క‌డం క‌ష్టంగా మారింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోని ఆదివారం ఒక్క‌రోజే 1,277  పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఐదుగురు మృతి చెందారు. 

హైద‌రాబాద్‌(Hyderabad): రామంతాపూర్ ప‌రిధిలోని వెంక‌ట్‌రెడ్డి న‌గ‌ర్‌, శ్రీ‌నివాస‌పురం, ఇందిరాన‌గ‌ర్  కు చెందిన ఏడుగురితో పాటు కాప్రా స‌ర్కిల్ నాచారానికి చెందిన వ్య‌క్తి (34), బాబాన‌గ‌ర్‌లో మ‌హిళ (25), అన్న‌పూర్ణ కాల‌నీలో నివ‌సిస్తున్న మ‌హిళ (28), మ‌ల్లాపూర్‌లో బాలిక‌(7), గోకుల్‌న‌గ‌ర్‌లో మ‌హిళ (31), కుషాయిగూడ గ‌ణేష్‌న‌గ‌ర్‌లో ఓ వ్య‌క్తి (35), మ‌ల్కాజిగిరి మారుతీన‌గ‌ర్‌కు చెందిన వ్య‌క్తి (30) కి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్‌లో 10 మందికి పాజిటివ్  వ‌చ్చింది. స‌రోజినీదేవి ఆస్ప‌త్రిలో ఆదివారం క‌రోనా ప‌రీక్ష‌ల‌ను నిలిపివేశారు. 
మూసాపేట స‌ర్కిల్ ప‌రిధిలో భ‌ర‌త్‌న‌గ‌ర్‌, మూసాపేట ప్రాంతాల్లో 10 మందికి పాజిటివ్ నిర్థార‌ణ అయింది. చెస్ట్ ఆస్ప‌త్ర‌తిలో 86 మందికి చికిత్స అందిస్తున్నారు. యూస‌ఫ్‌గూడ డివిజ‌న్‌లో 8, బోర‌బండ‌లో 3, ఎర్ర‌గ‌డ్డ‌లో 5, ర‌హ్మ‌త్‌న‌గ‌ర్‌లో 11, వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌లో 7 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. బ‌ర్క‌త్‌పూర్‌లో ఒకే ఇంట్లో వృద్ధుడు(73), వృద్ధురాలు(71), మ‌రో వ్య‌క్తి(33), బాలిక‌(4), తిల‌క్‌న‌గ‌ర్‌లో  వ్య‌క్తి(43), ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 12 మందికి, అశోక్‌న‌గ‌ర్ ఎస్‌బిహెచ్‌కాల‌నీకి చెందిన న‌లుగురి కి క‌రోనా బారిన‌ప‌డ్డారు. న‌ల్ల‌కుంట ఫీవ‌ర్ ఆస్ప‌త్రిలో 56 అనుమానిత కేసులు న‌మోదయ్యాయి.
విజ‌య‌పురికి కాల‌నీకి చెందిన వ్య‌క్తి(33), ఏడాది బాలుడు, మ‌న్సూరాబాద్ సౌత్ ఎండ్ పార్క్ లో ఒక‌రికి (38), అల్కాపురిలో ఒక‌రు(32), హ‌య‌త్‌న‌గ‌ర్‌ విష్ణున‌ గ‌ర్‌కు చెందిన మ‌హిళ‌(36), హ‌రిపురికాల‌నీలో ఓ మ‌హిళ‌(50), బీఎన్ రెడ్డిన‌గ‌ర్‌లో ఇద్ద‌రికి, న్యూమారుతీన‌గ‌ర్‌లో ఓ వ్య‌క్తి(37), సూర్యాన‌గ‌ర్‌కాల‌నీకి చెందిన ఉద్యోగి(33), హ‌నుమాన్‌ న‌గ‌ర్‌ కాల‌నీలోకి ఒకే ఇంట్లో ఇద్ద‌రికి, రెడ్డిబ‌స్తీలో ఓ వ్య‌క్తి(49)కి పాజిటివ్‌గా తేలింది. తుర్కం యంజాల్ మున్సిపాలిటిలీ ప‌రిధిలోని ఇంజాపూర్ గ్రామానికి చెందిన ఓప్ర‌జాప్ర‌తినిధి ఇంట్లో ముగ్గురికి, మున‌గ‌నూర్ గ్రామంలో గృహిణి(58), పెద్ద అంబ‌ర్‌పేట మునిసిపాలిటీ ప‌రిధిలోని 5వ వార్డు కోహెడ్ రోడ్డులో ఉంటున్న మ‌హిళ‌(24)కు పాజిటివ్ వ‌చ్చింది. ఆజంపుర యూపీహెచ్‌సీ ప‌రిధిలోని ఏడుగురికి , జాంబాగ్ పార్క్ యూపీహెచ్‌సీ ప‌రిధిలో ఒక‌రికి, డ‌బీర్‌పుర్ యూపీహెచ్‌సీ ప‌రిధిలో ఇద్ద‌రికి, మ‌ల‌క్‌పేట యూపీహెచ్‌సీ ప‌రిధిలో న‌లుగురికి, గ‌డ్డి అన్నారం యూపీహెచ్‌సీ ప‌రిధిలో ఐదుగురికి, శాలివాహ‌న‌న‌గ‌ర్ యూపీహెచ్‌సీ ప‌రిధిలో ఆరుగురికి, మాద‌న్న‌పేట‌ యూపీహెచ్‌సీ ప‌రిధిలో 9 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. 
అదే విధంగా క‌రోనా వైర‌స్‌తో రామాంత‌పూర్‌లో ఓ విద్యాసంస్థ నిర్వ‌హ‌కుడితో పాటు వృద్ధుడు, బ‌ర్క‌త్‌పుర ప‌రిధిలో సుంద‌ర్‌న‌గ‌ర్ కు చెందిన 48 ఏళ్ల వ్య‌క్తి , మ‌ల్క‌జిగిరి మారుతీన‌గ‌ర్‌లో వృద్ధురాలు(63), అబ్దుల్లాపూర్‌మెంట్ మండ‌ల ప‌రిధి పిగ్లీపూర్ గ్రామానికి చెందిన వ్య‌క్తి (65) మృతి చెందారు. 

తెలంగాణ‌లో 23,902 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ఉధృతి రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1590 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో కేసుల సంఖ్య 23,902కు చేరుకుంది. నేడు 1,166 మంది కోలుకొని ఇళ్ల‌కు వెళ్లారు. మొత్తం 10,904 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఆదివారం ఏడుగురు మృతి చెంద‌గా మొత్తం మృతుల సంఖ్య 295 కు చేరుకుంది. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1277 పాజిటివ్ కేసులు న‌మోద‌య్య‌యి. మేడ్చ‌ల్ లో 125 కేసులు న‌మోద‌వ్వ‌డం క‌ల‌వ‌రం రేపుతోంది. ఆ త‌ర్వాత రంగారెడ్డి 82, సూర్యాపేట 23, సంగారెడ్డి 19, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 19, న‌ల్గొండ 14 చొప్పున వైర‌స్ కేసులు న‌మోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 5,290 న‌మూనాలు ప‌రీక్షించ‌గా 3,700 మందికి నెగిటివ్ వ‌చ్చిన‌ట్టు అధికారులు తెలిపారు. 

No comments:

Post a Comment