Thursday, July 16, 2020

నిజంగా ..ఈ "పోలీసుల" మ‌న‌స్సు వెన్న‌..!

అస‌లే క‌రోనా విజృంభిస్తున్న కాలం..బ్ర‌త‌క‌ట‌మే క‌ష్టంగా మారిన ప‌రిస్థితి.. చేతిలో చిలిగ‌వ్వ‌లేదు..చేసేందుకు ప‌ని కూడా లేని ప‌రిస్థితి..బ‌య‌ట‌కు వెళితే క‌రోనా..ఇంటి లోప‌ల ఉంటే ఆక‌లి మంట‌..! దెబ్బ‌మీద దెబ్బ త‌గిలిన‌ట్టు ఆ  పేద కుటుంబానికి పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కు అల్లారు ముద్దుగా తిరిగిన కుమారులు ఇద్ద‌రూ క‌రెంట్ షాక్‌కు గుర‌య్యారు. త‌ల్లి గుండె త‌ల్ల‌డిల్లింది. హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇద్ద‌రూ కోలుకోవాలంటే ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు అవుతుంద‌ని తెలిపారు. కారుతున్న క‌న్నీటి ఆ త‌ల్లికి ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో త‌న గ్రామానికి చేరుకుంది. 
కృష్ణాజిల్లా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం గంప‌లగూడెం మండ‌లం తునికిపాడు గ్రామానికి చ‌వ‌ట‌ప‌ల్లి నాగ‌మ‌ణి కుమారులిద్ద‌రూ ప్ర‌మాద‌వ‌శాత్తు ఇటీవ‌ల విద్యుత్ షాక్‌కు గుర‌య్యారు. వారిలో పెద్ద అబ్బాయి

తిరువూరు(Tiruvuru):  కృష్ణాజిల్లా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం గంప‌లగూడెం మండ‌లం తునికిపాడు గ్రామానికి చ‌వ‌ట‌ప‌ల్లి నాగ‌మ‌ణి కుమారులిద్ద‌రూ ప్ర‌మాద‌వ‌శాత్తు ఇటీవ‌ల విద్యుత్ షాక్‌కు గుర‌య్యారు. వారిలో పెద్ద అబ్బాయి అర‌వింద్ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో విజ‌య‌వాడ ఆంధ్ర హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. వైద్యానికి దాదాపు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని వైద్యులు తెలిపారు. కూలి ప‌నిచేసుకునే త‌ల్లిదండ్రుల‌కు ఊరి పెద్ద‌లు, యువ‌త ముంద‌కు వ‌చ్చి  దాదాపు రూ.80 వేలు అంద‌జేశారు.
ఇంకా కొంత మొత్తం డ‌బ్బు కావాలి. బాబు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ వార్త లోక‌ల్ న్యూస్ రిపోర్టర్ గోపాల్ అనే వ్య‌క్తి  సోష‌ల్ ‌మీడియాలో అన్ని గ్రూపుల్లో ఫార్వ‌డ్ చేశారు. ఇది చూసిన తిరువూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వివిధ పోలీస్టుస్టేష‌న్ల‌లో  ప‌లు విభాగాల్లో ప‌నిచేస్తున్న పోలీసులు  ముందుకు వ‌చ్చారు. ఆ కుటుంబాన్ని  అయిన‌వారిలా భావించారు. వెంట‌నే ఎవ‌రికి వారూ స్పందించారు. ఆ త‌ల్లికి కాస్త ఊపిరి పోసి మేమున్నాం.. అమ్మా నీ కుమారుల‌కు ఏమీ కాద‌ని భ‌రోసా క‌ల్పించారు. 
విష‌యం తెలుసుకున్న గంప‌ల‌గూడెం మండ‌లం ఉమ్మ‌డిదేవ‌ర‌ప‌ల్లి గ్రామానికి చెందిన కొండ‌ప‌ల్లి న‌రేష్ (పైర్ ఎస్ఐ) త‌మ వంతుగా రూ.5000 వేలు స‌హాయం అందించారు. విస్స‌న్న‌పేట త‌హ‌శీల్దార్ ముర‌ళీ కృష్ణ రూ.2,500 పంపారు. తిరువూరు పోలీస్టేష‌న్‌లో ప‌నిచేస్తున్న కానిస్టేబుల్ కాంతారావు రూ.1000 అందజేశారు.
విస్స‌న్న‌పేట ఎక్సైజ్ సీఐ శ్రీ‌నివాస్ బాలాజీ రూ.1000 అంద‌జేశారు. అమ‌రావ‌తి మ‌ల్టీస్పెషాలిటీ హాస్ప‌ట‌ల్ వారు రూ.5000 అంద‌జేశారు.  తిరువూరు ఏఎస్ ఐ రంగ‌య్య నాయుడు రూ.3000 వేలు  అంద‌జేశారు. కొమ్మిరెడ్డిప‌ల్లికి చెందిన కంచ‌పోగు సాల్మ‌న్ రూ.500 అంద‌జేశారు.  తిరువూరు కు చెందిన ప్ర‌ముఖ లాయ‌ర్  సంకురాత్రి జ‌నార్థ‌న్‌రావు రూ.1000 అంద‌జేశారు.  మైల‌వరం మండ‌లం కుంట‌ముక్క‌ల గ్రామానికి చెందిన వెంక‌ట సుబ్బారావు సీఐ డ్రైవ‌ర్ రూ.1000 అంద‌జేశారు. మ‌మ్మిడాడీ రెడీమేడ్ బ‌ట్ట‌ల షాపు య‌జ‌మాని రంగ‌బాబు రూ.2000 అంద‌జేశారు.

ఏ.కొండూరు పోలీస్ స్టేష‌న్‌లో ఏ ఎస్ఐ గా ప‌నిచేస్తున్న దీరావ‌త్ మంగ్య నాయ‌క్  రూ.2000 వేలు అంద‌జేశారు. 

No comments:

Post a Comment