Thursday, July 16, 2020

వానొచ్చింది..! 'వ‌జ్ర' క‌రూరులో వేట‌మొద‌లైంది..!

అనంతపురం(Anathapuram):
వాన‌రాక‌తో ఒక ప్రక్క క‌రోనా వైర‌స్ విజృంభిస్తుదేమోన‌ని అటు అధికారులు, ఇటు ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే.. ఆ వూరిలో మాత్రం వాన‌రావ‌డం వారికి అదృష్టంగా మారిందంటున్నారు. వాన రావ‌డం మొద‌లు ఊరిలో జ‌నాలంతా స‌ద్దిమూట‌లు క‌ట్టుకొని మ‌రీ శోధ‌న చేయ‌డానికి వేట ప్రారంభించారు. వివ‌రాల్లోకి వెళితే.. అనంత‌పురం జిల్లా లో  వ‌జ్ర‌క‌రూరు గ్రామం ఉంది. ఆ ఊరిలో ఒక వ్య‌క్తికి పే...ద్ద వ‌జ్రం దొరికిన‌ట్టు ఆ నోటా ..ఈ నోటా ప‌డి పెద్ద ప్ర‌చార‌మే జ‌రుగుతుంది. ఆ దొరికిన వ‌జ్రాన్ని ఓ వ్యాపారికి రూ.8 ల‌క్ష‌ల న‌గ‌దుకు,  6 తులాల  బంగారానికి అమ్మిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం ఆ నోటా..ఈ నోటా ప‌డి పోలీసులు, రెవెన్యూ అధికారుల వ‌ద్దకు చేరింది.  ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంది.ఇవి చ‌ద‌వండి : చివ‌రి ప్ర‌య‌త్నంగా బుజ్జ‌గిస్తున్న కాంగ్రెస్‌..! 
సాధార‌ణంగా వ‌ర్షం ప‌డితే చాలా ఈ వ‌జ్ర‌క‌రూరు గ్రామంలో వ‌జ్రాల వేట కొన‌సాగుతుంది. ఇప్పుడు అక్క‌డ జ‌నాలు కూడా వ‌జ్రాల వేట‌లో య‌మ బిజీగా ఉన్నారు. ఈ గ్రామం పొలాల్లో ఎన్నోఏళ్లుగా వ‌జ్రాలు దొరుకుతున్నాయ‌ని స్థానికులు చెబుతున్నారు. ఇదే క్ర‌మంలో ఓ వ్య‌క్తికి వ‌జ్రం దొర‌క‌డం దానిని అధిక ధ‌ర‌కు అమ్మ‌డంతో మిగిలిన జ‌నాల్లో ఆస‌క్తి మొద‌లైంది. అంద‌రూ బాక్సుల్లో భోజ‌నాలు పెట్టుకొని వ‌ర్షం వ‌స్తున్నా లెక్క‌చేయ‌కుండా పొలాల బాట ప‌ట్టారు. వాస్తవంగా శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌ల కాలం నాటి నుండి ఈ ప్రాంతంలో వ‌జ్రాలు రాసులుగా పోసి అమ్మిన‌ట్టు చ‌రిత్ర చెబుతోంది. అనంత‌రంపురం జిల్లా నుంచి క‌ర్నూలు జిల్లా వ‌ర‌కు సుమారు 25 కిలోమీట‌ర్ల వ‌ర‌కు భూగ‌ర్భంలో వ‌జ్ర నిక్షేపాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో వ‌ర్షం వ‌చ్చిన‌ప్పుడు ఆ వ‌జ్రాలు భూమిపైకి తేలి సూర్య‌రశ్మికి మెరుస్తుంటాయినేది ఆ ప్రాంతంలో బ‌హిరంగ ర‌హ‌స్యంగా చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఎంతో మందికి వ‌జ్రాలు దొరికాయ‌ని ఒక్కొక్క‌రికి రూ.2 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు వచ్చాయ‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ క‌రోనా కాలంలో ఒక వ‌జ్రం ప‌లుకు దొరికినా అదృష్టంగా బావిస్తూ స్థానికులు వ‌జ్రాల వేట కొన‌సాగిస్తున్నారు. ఇది చ‌ద‌వండి : నిజంగా ..ఈ "పోలీసుల" మ‌న‌స్సు వెన్న‌..! 

No comments:

Post a Comment