Wednesday, July 15, 2020

మ‌రో మూడ్రోజుల పాటు భారీ వ‌ర్షాలు

అమ‌రావ‌తి(Amaravathi):
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే మూడ్రోజుల పాటు ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ కేంద్రం తెలిపింది. ప్ర‌స్తుతం జార్ఘండ్‌, దాని ప‌రిస‌ర ప్రాంతాల‌లో 1.5 నుంచి 7.6 కిలోమీట‌ర్ల మ‌ధ్య ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంద‌ని పేర్కొంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతీ దిశ వైపుకు వంగి తిరిగి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. స‌ముద్ర తీరంలో ఏర్ప‌డిన గాలుల క‌ల‌యిక (షియ‌ర్ జోన్‌) ప్ర‌భావంతో ఉత్త‌ర క‌ర్ణాట‌క ప‌రిస‌ర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం విస్త‌రించి ఉంది. అదేవిధంగా నైరుతి రుతుప‌వ‌నాలు కోస్తా, రాయ‌ల‌సీమ‌పై చురుగ్గా ఉన్న‌ట్టు పేర్కొంది. ఈ ప్ర‌భావంతో మ‌రో రెండు రోజుల‌పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక‌పాటి నుంచి ఓ మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే శ్రీ‌కాకుళం, తూర్పుగోదావ‌రి, కృష్ణా, గుంటూరు, అనంత‌పురం, ప్ర‌కాశం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రో రెండురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల తేలిక‌పాటి నుండి ఒక మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ అధికారుల‌ను వాతావ‌ర‌ణ శాఖ అప్ర‌మ‌త్తం చేసింది. ఇవి చ‌ద‌వండి : స‌క్సెస్ స్టోరీ : !క‌లెక్ట‌ర్ సిగ్గు ప‌డింది..! ఇదిచ‌ద‌వండి..!

క‌ర్ణాట‌క ప్రాంతంలో భారీ వ‌ర్ష సూచ‌న‌..!

సముద్ర‌తీరంలో ఏర్ప‌డిన గాలుల క‌ల‌యిక‌(షీయ‌ర్ జోన్‌) ప్ర‌భావం రాష్ట్రంపై సాధార‌ణంగా కొన‌సాగుతుంది. మ‌రోవైపు  ఉత్త‌ర క‌ర్ణాట‌క ప‌రిస‌ర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.6 కిమీ ఎత్తు వ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం విస్త‌రించి ఉంది. అదే విధంగా నైరుతి రుతుప‌వ‌నాలు కోస్తా, రాయ‌ల‌సీమపై చురుగ్గా ఉన్నాయి. వీటిన్నింటి ప్ర‌భావంతో నేడు, రేపు కోస్తా, రాయ‌ల‌సీమ‌ల్లో అక్క‌డ‌క్క‌డా ఉరుములు, మెరుపుల‌తో తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. 
బుధ‌వారం ఉత్త‌ర కోస్తా, యానాం ప‌రిస‌ర ప్రాంతాల్లో అక్క‌డ‌క్క‌డా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాలున్నాయ‌ని తెలిపింది. 18వ తేదీన రాయ‌ల‌సీమ‌లో ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని పేర్కొంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. తిరువూరులో 17 సెం.మీ, విశాఖ‌ప‌ట్ట‌ణంలో 10 సెం.మీ చోట‌వ‌రంలో 8 సెం.మీ, ధ‌వ‌ళేశ్వ‌రంలో 7 సెం.మీ, పిడుగురాళ్లు, త‌ణుకు, కందుకూరులో 6 సెం.మీ, బ‌ద్వేల్‌, ఆత్మ‌కూర్‌, అవ‌నిగ‌డ్డ‌, కాకినాడ‌, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, సంత‌మాగులూరు, బొబ్బిలిలో 5 సెం.మీ వ‌ర్షపాతం న‌మోదైంది.

No comments:

Post a Comment