Thursday, July 16, 2020

అభ‌యార‌ణ్యంలో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..!మ‌ళ్లీ తుపాకుల మోత‌..!

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం (Bhadradri kothagudem):
మ‌ణుగూరు స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలోని గ‌త బుధ‌వారం  క‌ర‌క‌గూడెం, ఆళ్ల‌ప‌ల్లి మండ‌లాల స‌రిహ‌ద్దులో ఉన్న అభ‌యార‌ణ్యంలో పోలీసులు, మావోయి స్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఒక్క‌సారిగా ఏజెన్సీ ప్రాంతంలోని అభ‌యార‌ణ్యంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మొద‌లైంది. మావోయిస్ట్ యాక్ష‌న్ టీములు సంచ‌రి స్తున్నాయ‌నే స‌మాచారంతో మూడు రోజులుగా పోలీసు బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వ‌హిస్తున్నాయి. అట‌వీ ప్రాంతాన్ని జ‌ల్లెడ ప‌డుతున్న క్ర‌మంలో క‌ర‌క‌గూడెం, ఆళ్ల‌ప‌ల్లి స‌రిహ‌ద్దు మ‌ల్లేప‌ల్లి తోగు వ‌ద్ద మావోయిస్టులు తార‌స‌ప‌డ‌టంతో ప‌ర‌స్ప‌రం కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాల‌య్యాయి. 10 మంది వ‌ర‌కు మావోయిస్టులు కాల్పులు జ‌రుపుతూనే త‌ప్పించుకున్న‌ట్టు పోలీసు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాల్పులు జ‌రిగిన ప్ర‌దేశంలో వారి సామాగ్రి ల‌భించింది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రించి కూంబింగ్ ముమ్మ‌రం చేశారు. గాయ‌ప‌డ్డ కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు హైద‌రాబాద్ త‌ర‌లించారు. కాగా ఆ ప్రాంతంలోనే ఎక్కువ మంది మావోయిస్టులు ఉన్న‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
ఎదురుకాల్పుల సంఘ‌ట‌న‌తో ఏజెన్సీ ఉలిక్కి ప‌డింది. మూడ్రోజులుగా ఇల్లెందు, పాల్వంచ‌, మ‌ణుగూరు స‌బ్ డివిజ‌న్ల‌లో స్పెష‌ల్ పార్టీ బ‌ల‌గాల‌తో ముమ్మ‌రంగా కూంబింగ్ చేస్తున్నారు. మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలోకి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం అందుకున్న వ‌రంగ‌ల్‌, భ‌ద్రాద్రి పోలీసులు సంయుక్త ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే మ‌ణుగూరు ఏరియాలోని మ‌ల్లేప‌ల్లితోగు అట‌వీ ప్రాంతంలో ఉద‌యం 9 గంట‌ల ప్రాంతంలో ఎదురుకాల్పులు జ‌రిగిన‌ట్టు భ‌ద్రాద్రి జిల్లా ఎస్పీ ప్ర‌క‌టించారు. దామోద‌ర్‌, భ‌ద్రూ, శాంత‌, భాస్క‌ర్‌ల‌తో కూడిన సుమారు 10 మంది మావోయి స్టులు కోసం అన్వేషిస్తుండ‌గా, మ‌ణుగూరు ఏరియా మ‌ల్లేప‌ల్లితోగు, రంగాపురం అటవీప్రాంతంలో న‌క్స‌ల్స్ తార‌స‌ప‌డ‌టంతో ఎదురుకాల్పులు జ‌రిపిన‌ట్టు పోలీసులు పేర్కొంటున్నారు. కాల్పులు నేప‌థ్యంలో గుండాల మండ‌లంలోని దామ‌ర‌తోగు, చెట్టుప‌ల్లి అట‌వీప్రాంతం, తాడ్వాయి మండ‌లంలోని దుబ్బగూడెం,గంగారం మండ‌లంలోని పాకాల ఏరియా, ఇల్లెందు, గుండాల మండ‌లాల స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో కూంబింగ్ ఉధృతం చేశారు. 
ఈ సంద‌ర్భంగా గురువారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..గ‌త బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు న‌మ్మ‌ద‌గిన స‌మాచారంపై స్పెష‌ల్ పార్టీ పోలీసులు మ‌ణుగూరు మండ‌లం మ‌ల్లెతోగు అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నార‌ని తెలిసింద‌న్నారు. కూంబింగ్ ఆప‌రేన్ చేస్తుండ‌గా పోలీసుల‌కు తార‌స‌ప‌డిన మావోయిస్టుల‌ను లొంగిపొమ్మ‌ని కేక‌లు వేయగా, వారు విన‌కుండా పోలీసుల‌పై కాల్పులు జ‌ర‌ప‌గా, ప్ర‌తిగా పోలీసులు ఎదురు కాల్పులు జ‌రిపిన‌ట్టు పేర్కొన్నారు. ఈ కాల్పులు సుమారు 10 నిమిషాల పాటు జ‌రిగాయ‌ని అన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ కు గాయాల‌య్యాయ‌న్నారు. మావోయిస్టులు సంఘట‌నా స్థ‌లంలో వారి సామాగ్రిని వ‌దిలిపెట్టి పారిపోయార‌న్నారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో ఒక 8 ఎంఎం రైఫిల్‌, 08 రౌండ్లు, 07 డిటోనేట‌ర్స్‌, 01ఐఇడి, 10 కిట్ బ్యాగులు, 01 మెడిసిన్స్ బ్యాగు, 01 వంట సామాగ్రి బ్యాగు, 01 సోలార్ ప్యానెల్స్ బ్యాగు, ఎల‌క్ట్రానిక్ సామాగ్రి, విప్ల‌వ సాహిత్యం మ‌రియు 02 సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. 

No comments:

Post a Comment