Wednesday, July 8, 2020

తేట‌తెల్ల‌మైన చైనా బాగోతం..అమ్మాయిల‌ను ఎర‌వేసి బ్లాక్‌మెయిల్‌..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చైనా చేస్తున్న దురాగాతాల‌ను రోజురోజుకూ ఛీద‌రిం చుకునే ప‌రిస్థితి దాపురించింది. ఇటీవ‌ల భార‌త్‌తో క‌య్యానికి కాలుదువ్వి విమ‌ర్శ‌ల‌పాలైంది చైనా. తాజాగా టెలికాం దిగ్గ‌జం హువావే చుట్టూ అల్లుకున్న వివాదం, చైనా గూఢ‌చార్యం విధానాల‌ను మ‌రోసారి బ‌య‌ట‌కు పొక్కింది. చైనా త‌న ప‌నులు నెర‌వేర్చుకునేందుకు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా వ్య‌క్తుల‌ను, వ్య‌వ‌స్థ‌ల‌ను ఎలా ప్ర‌భావితం చేస్తుందో  తేట‌తెల్లం చేసింది. 

వెబ్ న్యూస్(WebNews):మాజీ ఎం-16 గూఛ‌చారి స‌హ‌కారంతో ఇటీవ‌ల విడుద‌లైన ఓ రిపోర్టు అనేక అంశాల‌ను బ‌య‌ట‌పెట్టింది. త‌మ టెలికాం కంపెనీ తిరిగి బ్రిట‌న్‌లో కార్య‌క‌లాపాలు కొన‌సాగించ ‌డానికి చైనా ప్ర‌భుత్వం ఆ దేశ రాజ‌కీయ నాయ‌కుల‌తో ఎలా వ్య‌వ‌హారం న‌డిపిందో...ప్ర‌ముఖ వ్య‌క్తుల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి ఎలా ప్ర‌య‌త్నించిందో అందులో వివ‌రించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌తి చైనా కంపెనీలో అంత‌ర్గ‌తంగా ఒక విభాగం ప‌నిచేస్తుంటుంది. ఇది చైనాలో అధికార క‌మ్యూనిస్టు పార్టీకి జ‌వాబుదారీగా ఉంటుంది. ఆయా సంస్థ‌లు త‌మ దేశ రాజ‌కీయ విధానాల‌కు అనుగుణంగా న‌డుస్తున్నాయా?  లేదా? అనేది ఈ విభాగం నిత్యం ప‌ర్య‌వేక్షిస్తుంటుంది. ఈ త‌ర‌హాలో బిజినెస్ ముసుగులో చైనా క‌మ్యూనిస్టు పార్టీ బ్రిట‌న్‌లో త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు. 
చైనాకు సంబంధిచినంత వ‌ర‌కూ వ్యాపారం, రాజ‌కీయాలు వేర్వురు కాదు అనేది ప్ర‌పంచానికి తెలిసింది. చైనా క‌మ్యూనిస్టు పార్టీకి 9 కోట్ల 30 ల‌క్ష‌ల మందికి పైగా స‌భ్యులున్నారు. వారిలో చాలామంది వివిధ దేశాల్లోని సంస్థ‌ల్లో ప‌నిచేస్తుంటారు. ర‌హ‌స్యాలు సేక‌రించ‌డానికి ముఖ్యంగా టెక్నాల‌జీ, టెలికాం రంగాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని సేక‌రించ‌డంలో వీరు క్రియాశీలంగా ఉంటారు. విదేశాల‌లోని కంపెనీల‌లో ప‌నిచేసే వీరంతా ఏజెంట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. వివిద ర‌కాల ప‌ద్ధ‌తుల్లో ఆయా దేశాల్లోని అధికారుల‌ను, రాజ‌కీయ నాయ‌కుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇవి చ‌ద‌వండి : మూగ‌బోయిన గొంతు..క‌రోనాతో సుద్దాల నిస్సార్ మృతి

అమ్మాయిల‌ను ఎర‌గా(హ‌నీట్రాప్‌)...

చైనా త‌న వ్యూహాల అమ‌లులో అనేక ఎత్తుగ‌డ‌లు వేస్తుంది. త‌మ ల‌క్ష్యం చైనాయేత‌రుడైన అధికారి అయితే పెద్ద‌మొత్తంలో బ‌హుమ‌తులు రూపంలో అత‌న్ని ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఇది మొద‌టి ర‌కం విధానం. ఆ త‌ర్వాత అనేక విధాలుగా ప్ర‌లోభ పెట్ట‌డం, బెదిరించ‌డం వంటివి చేస్తుంటారు. పాశ్చాత్య దేశాల వారికి చైనాలో పెద్ద‌పెద్ద బిజినెస్ మీటింగ్‌ల‌కు ఆహ్వానం పంప‌డం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థ‌ల‌కు ధ‌న రూపంలో సాయం చేయ‌డం, లేదంటే ఏ కంపెనీలోనో నాన్ -ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబ‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డం, ఒక్కోసారి వారి జీవిత‌మే మారిపోయేంత డ‌బ్బును ఆఫ‌ర్ చేయ‌డం లాంటి ప‌నులు చేస్తుంటాయి. గ‌త ప‌ది,ప‌దిహేనేళ్లుగా కీల‌క‌మైన విదేశీ వ్య‌క్తుల‌ను భారీ న‌జ‌రానాల‌తో ఆక‌ట్టుకునే ప‌ద్ధ‌తి క్ర‌మంగా పెరుగుతూ వ‌చ్చిన‌ట్టు తేలింది. ఇలాంటి విధానాలు చైనాలో కూడా మ‌రీ దారుణంగా ఉంటాయి. దేశంలో ఉన్న వారి కుటుంబ స‌భ్యుల‌పై ఒత్తిడి తీసుకురావ‌డం, బ్లాక్‌మెయిల్ చేయ‌డం, విదేశీ వ్యాపారులైతే వారికి అమ్మాయిల‌ను ఎర‌వేయ‌డం(హ‌నీట్రాప్‌) స‌ర్వ‌సాధార‌ణం. ఆక‌ర్ష‌ణీమైన మ‌హిళ‌ల‌తో వారి ప‌రిచ‌యం క‌ల‌గ‌చేసి వారితో సంభాష‌ణ‌లు, ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను రికార్డు చేసి, బ్లాక్ మెయిల్ చేస్తారు. 
చైనా ర‌క్ష‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలోనే ఇలాంటివి జ‌రుగుతున్నాయ‌నేది ఓ బ్రిటీష్ అధికారి చెబుతున్న వాద‌న‌. కాక‌పోతే ఇవన్నీ కేంద్రీకృత విధానంలో కాకుండా, వివిధ రాష్ట్రాల ర‌క్ష‌ణ విభాగాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న త‌మ కంపెనీల వ్య‌వ‌హారాల‌ను విడివిడిగా ప‌ర్య‌వేక్షిస్తుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు అమెరికా వ్య‌వ‌హారాల‌ను షాంఘై బ్యూరో చూసుకుంటే, ర‌ష్యా వ్య‌వ‌హారాల‌ను బీజింగ్ బ్యూరో ..జ‌పాన్‌,కొరియా  వ్య‌వ‌హారాల‌ను టియాంజిన్ బ్యూరో చూసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇలా ఒక్కొక్క బ్యూరో ఒక్కో దేశ వ్య‌వ‌హారాలు చూస్తుంది. స‌మాచార సేక‌ర‌ణ కోసం చైనా ప్ర‌భుత్వం త‌న అధికార‌ల‌న్నింటినీ ఉప‌యోగించ‌కుంటుంద‌ని ఈ వ్య‌వ‌హారాల‌లో పాలు పంచుకున్న ఓ వ్య‌క్తి వెల్ల‌డించారు. భారీ సైబ‌ర్ గూఢ‌చ‌ర్యం ద‌గ్గ‌ర్నుంచి, ఇండ‌స్ట్రీ నిపుణుల‌ను లోబ‌రుచుకునే వ‌ర‌కు, వివిధ మార్గాల‌లో ఇది కొన‌సాగుతుంద‌ని ఆ వ్య‌క్తి వెల్ల‌డించారు. 

No comments:

Post a Comment