Saturday, July 11, 2020

సాక్షి చానెల్లోకి బిత్త‌రిస‌త్తి...!

హైద‌రాబాద్‌(Hyderabad):
టీవీ రంగంలోని  త‌న‌దైన శైలితో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా నవ్వించే క‌మెడియ‌న్ బిత్తిరిస‌త్తి శనివారం సాక్షి టివి ఛానెల్ లో జాయిన్ అయ్యారు. ఇటీవ‌ల ఆయ‌న‌ను టీవీ9 నుంచి తొల‌గిస్తూ యాజ‌మాన్యం  ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.  బిత్తిరి స‌త్తి  అస‌లు పేరు ర‌వికుమార్. త‌నను యావ‌త్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన వి6 ఛానెల్లో తీన్మార్ వార్త‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తూ తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.  ఆ చానెల్లో ప‌నిచేసేట‌ప్పుడు ఆ కార్య‌క్ర‌మం ద్వారా టాప్ రేటింగ్ వ‌చ్చింది. అయితే టీవీ9 నుంచి మంచి ఆఫ‌ర్ రావ‌డంతో త‌న‌కు లైఫ్ ఇచ్చిన వి6ను వ‌దిలేసి టీవి9లోకి వెళ్లారు. అయితే తీన్మార్ వార్త‌లు మాదిరిగానే టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్  ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ షోక్ తొలుత అంత ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో బిగ్‌బాస్ అనంత‌రం యాంక‌ర్ శివ‌జ్యోతి ఇస్మార్ట్ న్యూస్ లో వార్త‌లు చ‌ద‌వ‌డంతో ఈ కార్య‌క్ర‌మం ఊపందుకుంది. ఇటీవ‌ల కాలంలో ఇస్మార్ట్ శంక‌ర్ బాగా పాపుల‌ర్ కావ‌డంతో పాటుగా త‌న రెమ్యూన‌రేష‌న్ కూడా పెద్ద మొత్తంలో పెంచాల‌ని బిత్తిరిస‌త్తి డిమాండ్ చేసిన‌ట్టు వార్త‌లు వచ్చాయి. ఇటీవ‌ల ఓ స్క్రిప్ట్ లో యాజ‌మాన్యంతో విబేధాలు రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని తెలుస్తోంది. ఇవి చ‌ద‌వండి : రైత‌న్న‌ల‌కు సీఎం కేసీఆర్ తీపి క‌బురుI చిట్ట చివ‌రి రైతు వ‌ర‌కూ రైతు బంధు అందేలా సూచ‌న‌
బిత్త‌రి స‌త్తి తెలంగాణ యాస‌లో చెప్పే వార్త‌లు అత‌డిని వెండితెర వ‌ర‌కూ తీసుకెళ్లాయి. హాస్య ప్ర‌ధాన‌మైన పాత్ర‌లే కాకుండా హీరోగానే ఎదిగాడు. అయితే  తుపాకీ రాముడుతో హీరోగా వ‌చ్చినా అంత‌గా క్లిక్ కాలేదు. కానీ బిత్త‌రి స‌త్తి హ‌వా మాత్రం ఎక్కడా త‌గ్గ‌లేదు. బిత్త‌రి స‌త్తి టీవీ9 నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో బిగ్‌బాస్‌షోలో పాల్గొన‌బోతోన్నాడ‌నే రూమ‌ర్స్ ఎక్కువ‌య్యాయి. అయితే తాజాగా ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చాడు. సాక్షి మీడియా సంస్థ‌లో బిత్తిరి స‌త్తి చేరారు. అక్క‌డ త‌న‌దైన శైలిలో ఓ సెటైరిక‌ల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.  

No comments:

Post a Comment