భార‌త్ -చైనా స‌రిహ‌ద్దు : సైనికుల్లో ఉత్తేజం నింపిన మోడీ ప్ర‌సంగం

జూన్ 15న భార‌త్‌-చైనా మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌ల అనంత‌ర ప‌రిస్థితిని ప్ర‌ధాని స‌మీక్షించ‌ నున్న‌ట్టు తెలుస్తోంది.  ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త జ‌వాన్లు మృతి చెందారు. అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ల‌ద్ధాఖ్‌లోని నిమూలో ఒక ఫార్వార్డ్ లొకేష‌న్ ద‌గ్గ‌రికి చేరుకున్నారు.అనంత‌రం సైనికుల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించారు. గ‌ల్వాన్ ఘ‌ట‌న్ లో అమ‌రులైన సైనికుల‌కు మ‌రోసారి నివాళ్ల‌ర్పించారు. ఒక ఆర్మీపోస్టులో జాకెట్ వేసుకొని ఉన్న ప్ర‌ధాని అధికారుల‌తో క‌లిసి కూర్చొని ఉన్నారు. అధికారుల‌కు ప్ర‌ధాని ఉప‌న్యాసం చేశారు. కోవిడ్ వ‌ల్ల‌ అధికారులు సామాజిక దూరం పాటిస్తూ ప్ర‌సంగాన్ని విన్నారు. 

న్యూఢిల్లీ(NewDelhi): దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ జ‌వాన్లుద్ధేశించి మాట్లాడుతూ... "స‌రిహ‌ద్దుల్లో మీరు ఉండ‌బ‌ట్టే దేశం మొత్తం నిశ్చితంగా ఉంది. అమ‌రులైన సైనిక వీరుల‌కు మ‌రోసారి నివాళ్ల‌ర్పిస్తున్నాను. ఇవాళ దేశ ప్ర‌జ‌లంద‌రి ఆశీస్సులు మీతో ఉన్నాయి. మీ శౌర్య ప‌రాక్ర‌మాల గురించి దేశంలో ఇంటింటా మాట్లాడుకుంటున్నారు. ఈ భూమి 130 కోట్ల మంది భార‌తీయుల ప్ర‌తీక‌. విచ్ఛిన్న శ‌క్తుల కుట్ర‌ల‌ను ల‌ద్ధాఖ్ స్థానిక ప్ర‌జ‌లు తిప్పికొట్టారు. 14 కార్ఫ్స్ సైనికుల ప‌రాక్ర‌మం గురించి దేశం న‌లుమూల‌లా మాట్లాడుకుంటున్నారు. మీ సాహ‌స గాథ‌లు దేశంలోని ప్ర‌తి ఇంటిని చేరాయి. శత్ర‌వుల‌కు మీ ప‌రాక్ర‌మ జ్వాల ఏంటో చూపించారు. " అని మోడీ కొనియాడారు. 
ఈ భూమి వీర భూమి. వీరుల‌ను క‌న్న భూమి. మ‌న సంక‌ల్పం హిమాల‌యాల క‌న్నా ఎత్త‌యిన‌ది. వేల సంవ‌త్స‌రాల నుంచి ఎన్నో దాడుల‌ను మ‌నం తిప్పికొట్టాం. ఇవాళ భార‌త్ శ‌క్తి సామ‌ర్థ్యాలు అజేయం. జ‌ల‌, వాయు, ప‌దాతి, అంత‌రిక‌క్షం విభాగాల్లో మ‌న శ‌క్తి స‌మున్న‌తం. వీర‌త్వం ద్వారానే శాంతి ల‌భిస్తుంది. బ‌ల‌హీనులు ఎప్ప‌టికీ శాంతిని సాధించ‌లేరు. అనేక సంక్లిష్ట‌, సంక్షోభ స‌మ‌యాల్లో ప్ర‌పంచం వెంట భార‌త్ న‌డిచింది. ప్ర‌పంచ యుద్ధాల్లోనైనా, ప్ర‌పంచంలో శాంతి నెల‌కొల్ప‌డంలోనైనా అంత‌ర్జాతీయ స‌మాజం భార‌తీయుల ధైర్య‌సాహ‌సాల్ని చూసింది. మ‌నం వేణువు  ఊదే కృష్ణుడిని పూజిస్తాం. అలాగే సుద‌ర్శ‌న చక్రంతో పోరాడే కృష్ణుడిని ఆరాధిస్తాం. సామ్రాజ్య‌వాద శ‌కం ముగిసింది.  ఇది అభివృద్ధి ప‌థాన సాగాల్సిన స‌మ‌యం. ఇంత‌కాల విస్త‌ర్ణ‌కాంక్ష‌తో సాగిన శ‌క్తులు తోక‌ముడ‌వ‌డ‌మో లేక ఓట‌మో చ‌విచూశాయి. దీనికి చ‌రిత్రే  సాక్ష్యం అని మోదీ తెలిపారు. 

Post a Comment

0 Comments