Tuesday, July 14, 2020

క‌రోనా : మ‌రో కొత్త షాకింగ్ న్యూస్..! లండ‌న్ ప‌రిశోధ‌కులు ఏం చెబుతున్నారంటే?

World_corona
లండ‌న్ (London):
అస‌లే క‌రోనా వైర‌స్ సోకుతుందేమోన‌ని ఒక ప్ర‌క్క భ‌యంతో , ఆందోళ‌న‌తో  ప్ర‌పంచ జ‌నాభా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటే..మ‌రో ప్రక్క ప్ర‌పంచానికి కింగ్స్ కాలేజీ లండ‌న్ ప‌రిశోధ‌కులు మ‌రో షాకింగ్ వార్త  బ‌హిరంగ ప‌రిచారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతున్న వారి విష‌యంలో కొత్త స‌మ‌స్య‌ను క‌నుగొన్నారు.కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు శ‌రీరంలో త‌యారైన రోగ‌నిరోధ‌క శ‌క్తి కొన్ని నెల‌ల్లోనే మాయం అవుతోంద‌ట‌. ప్ర‌భుత్వాలు ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. లండ‌న్ ప‌రిశోధ‌కులు 90 మంది కొవిడ్‌-19 బాధితుల్లో యాంటీబాడీల (వ్యాధినిరోధ‌క శ‌క్తి) స్థాయిల‌ను అధ్య‌య‌నం చేశారు. కాలం గ‌డిచే కొద్దీ అవి ఎలా మార్పు చెందుతున్నాయో ప‌రిశీలించారు. 
స్వ‌ల్ప‌, మోతాదు ల‌క్ష‌ణాలు ఉన్న‌వారి రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ కొంతే స్పందించింద‌ని ర‌క్త ప‌రీక్ష‌ల్లో గ‌మ‌నించారు. వ్యాధి సోకిన కొన్ని వారాల త‌ర్వాత 60 శాతం మందిలో చెప్పుకోద‌గ్గ స్థాయిలో వైర‌స్‌కు స్పంద‌న క‌నిపించింది. మూడు నెల‌ల త‌ర్వాత మాత్రం 16.7 శాతం మందిలోనే అత్య‌ధిక స్థాయిలో కోవిడ్ -19 త‌ట‌స్థీక‌ర‌ణ యాంటీబాడీలు  క‌నిపించాయి. 90 రోజుల త‌ర్వాత చాలా మంది రోగుల ర‌క్త ప్ర‌వాహంలో అస‌లు గుర్తించ‌ద‌గ్గ స్థాయిలో యాంటీబాడీలే క‌నిపించ‌లేద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. సాధార‌ణంగా ఏదైనా ఒక కొత్త వైర‌స్‌గానీ ఇత‌ర మైక్రో బ‌యాల్స్ గానీ ప్ర‌వేశిస్తే మ‌న శ‌రీరం వెంట‌నే ప్ర‌తిస్పందిస్తుంది. దానిని సంహ‌రించేందుకు ప్ర‌తిస్పంద‌న‌గా యాంటీజెన్ రూపంలో ప్రోటీన్లును విడుద‌ల చేస్తుంది. ఈ యాంటీబాడీలు విడుద‌ల అయ్యాయంటే ఎప్ప‌టీకీ అవి శ‌రీరంలోనే ఉండిపోతాయి. కోవిడ్ -19 విష‌యంలో ఇలా జ‌ర‌గం లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. కొన్ని నెల‌ల వ‌ర‌కే యాంటీబాడీలు శ‌రీరంలో క‌నిపిస్తున్నాయ‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.  ఇక‌పై యాంటీబాడీ టెస్టుల్లో పాజిటివ్ వ‌చ్చినంత మాత్రాన తామిక సుర‌క్షిత‌మ‌ని భావించొద్ద‌ని హెచ్చరిస్తున్నారు. ఎప్ప‌టిలాగా భౌతిక‌ దూరం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటిస్తూ మాస్క‌లు ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. 

No comments:

Post a Comment