కాల్పుల క‌ల‌క‌లం.. ఇన్‌స్పెక్ట‌ర్‌ను కాల్చి చంపి ఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌..!

gunfire 
న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని లోని సీఆర్‌పీఎఫ్ 122వ బెటాలియ‌న్‌లో కాల్పులు క‌ల‌క‌లం చోటుచేసుకున్నాయి. ఇన్‌స్పెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్‌సింగ్‌(56) ను ఎస్ ఐ క‌ర్నేల్ సింగ్ (55) కాల్చి చంపారు. అనంత‌రం ఎస్ఐ క‌ర్నేల్ సింగ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న లోధి ఎస్టేట్‌లోని హోంమంత్రి భ‌వ‌నం వ‌ద్ద శుక్ర‌వారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్ స్పెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ సింగ్‌, ఎస్ఐ క‌ర్నేల్ సింగ్ మ‌ధ్య శుక్ర‌వారం రాత్రి తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఆగ్ర‌హంతో ఎస్ఐ త‌న స‌ర్వీస్ గ‌న్‌తో ఇన్ స్పెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ సింగ్ పై కాల్పులు జ‌రిపారు. దీంతో ద‌శ‌ర‌థ్ సింగ్ అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. అనంత‌రం అదే గ‌న్‌తో ఎస్ఐ క‌ర్నేల్ సింగ్ త‌న‌ను తాను కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ప‌లు కోణాల్లో లోతుగా ద‌ర్య‌ప్తు జ‌రుపుతామ‌ని పోలీసులు తెలిపారు. ఎస్ ఐ క‌ర్నేల్ సింగ్ జ‌మ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌కు చెందిన వారు కాగా, ఇన్ స్పెక్ట‌ర్ ద‌శ‌రథ్ సింగ్ హ‌ర్యానాలోని రోహిత్ క్ కు చెందిన వార‌ని పోలీసులు పేర్కొన్నారు. 

న‌ర‌కం భ‌రించ‌లేక‌ క‌న్న‌కొడుకునే చివ‌రికి ఇలా..!

తెనాలి: మ‌ద్యం తాగేందుకు డ‌బ్బు ఇవ్వ‌మ‌ని ఆ కొడుకు రోజీ పీడిస్తూ..కొడుతుండ‌టంతో ఇక ఆ తండ్రి భ‌రించ‌లేక‌పోయాడు. తీవ్ర ఆవేద‌న‌, కోపంతో క‌న్న కుమారుడ్నే ఇంట్లో ఉన్న క‌త్తి తో పొడిచి హ‌త‌మ‌ర్చాడు. ఈ ఉదంతం గుంటూరు జిల్లా, తెనాలిలో గురువారం అర్థ‌రాత్రి చోటుచేసుకుంది. తెనాలిలో మూడో ప‌ట్ట‌ణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం.. ప‌ట్ట‌ణంలోని పాండురంగపేట‌కు చెందిన దుద్దుకూరు సీతాప‌తి ఒక హోట‌ల్‌లో ప‌నిచేస్తున్నారు. ఈయ‌న భార్య గృహిణి.. ఈ దంప‌తుల ఇద్ద‌రు కుమారులు క్యాట‌రింగ్ ప‌నుల‌కు వెళుతుంటారు. చిన్న కొడుకైన జ‌గ‌దీష్‌(28) మ‌ద్యానికి తీవ్రంగా బానిస‌గా మారాడు. గ‌త 5 ఏళ్లుగా ఇత‌ను రోజూ మ‌ద్యం తాగి ఇంటికి వ‌చ్చి త‌ల్లిదండ్రులు, సోద‌రుడితో గొడ‌వ‌ప‌డేవాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో కొన్ని నెల‌లుగా ప‌నులు లేనందున ఇత‌న మ‌ద్యం తాగేందుకు డ‌బ్బు ఇవ్వ‌మ‌నిరోజూ త‌ల్లిదండ్రుల‌ను వేధిస్తూ, వారిని కొడుతున్నాడు. గురువారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఇంటికొచ్చిన జ‌గ‌దీష్ సోద‌రుడితో గొడ‌వ ప‌డి వెళ్లిపోయాడు. తిరిగి అర్థ‌రాత్రి వ‌చ్చి మ‌రోమారు ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. న‌చ్చ‌చెప్ప‌బోయిన త‌ల్లిని తీవ్రంగా కొట్టాడు. స‌హ‌నం కోల్పోయిన తండ్రి సీతాప‌తి కూర‌గాయ‌లు కోసే క‌త్తితో జ‌గ‌దీష్‌ను పొడిచాడు. తీవ్ర ర‌క్త‌స్రావంతో అత‌ను సంఘ‌ట‌న స్థ‌లిలోనే మృతిచెందాడు. పోలీసులు సీతాప‌తిని  అదుపులోకి తీసుకున్నారు. 
man murdered

Post a Comment

0 Comments