Thursday, July 16, 2020

ఘోర ప్ర‌మాదం..న‌లుగురు కూలీలు మృతి

మ‌హ‌బూబాబాద్ (Mahabubabad) :
జిల్లాలోని తొర్రూరు మండ‌లం చీక‌టాయ‌పాలెం గ్రామంలోని ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది.  గ్రామంలోని "ఎక్క‌ల‌దాయ‌మ్మ" చెరువు క‌ట్ట‌మీద 11 మంది కూలీల‌తో వెళ్తున్న లారీ అదుపు త‌ప్పి బోల్తాప‌డటంతో న‌లుగురు కూలీలు అక్క‌డికక్క‌డే మృతిచెందారు. అక్ర‌మంగా క‌ర్ర‌ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు త‌ప్ప‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు కూలీలు ప్ర‌మాదం నుండి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. 
కూలీలంద‌రి స్వ‌స్థ‌లం రంగారెడ్డి జిల్లా మంచాల మండ‌లం ఆంబోతులా తండా గ్రామం. మృతి చెందిన ఆంబోతు హ‌ర్యా, ఆంబోతు గోవింద‌ర్‌, ఆంబోతు మ‌ధు, రాట్ల దూర్యాగా గుర్తించారు. తొర్రూరు ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న వేప‌, తుమ్మ క‌ర్ర‌ల‌ను కొనుగోలు చేసిన ఓ వ్యాపారి ఇక్క‌డ నుంచి రాత్రికి రాత్రే క‌ర్ర‌ల‌ను త‌ర‌లించాల‌నుకున్నారు. కొనుగోలు చేసిన క‌ర్ర‌ను లోడ్ చేసి త‌ర‌లిస్తుండ‌గా స్థానికంగా ఉన్న ఎక్క‌ల‌దాయ‌మ్మ చెరువు క‌ట్ట ద‌గ్గ‌ర‌కు రాగానే లారీ అదుపు త‌ప్పి బోల్తా ప‌‌డింది.   క‌ట్టెల లోడుపై కూర్చున్న న‌లుగురు కూలీలు క‌ర్ర‌ల‌న్నీ మీద ‌ప‌డ‌టంతో సంఘ‌ట‌నా స్థ‌లంలోనే చ‌నిపోయారు. లారీ క్యాబిన్‌లో కూర్చున్న మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు కాగా మ‌రో ఐదుగురు కూలీలు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌మాదం గురించి తెలిసిన వెంట‌నే పోలీసులు ఘ‌టనా స్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లారీ క‌ట్టెల కింద ప‌డిన మృత‌దేహాల‌ను వెలికి తీసి మృత‌దేహాల‌ను పోస్టుమార్టంకు కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇవి చ‌ద‌వండి : పొంగుతున్న క‌ట్ట‌లేరు..నందిగామ ప్రాంతంలో అప్ర‌మ‌త్తం..!

No comments:

Post a Comment