Wednesday, July 15, 2020

క‌రోనా వ‌చ్చింద‌ని బైక్ కాల్చేసిన య‌జ‌మాని

bike fire
అశ్వారావుపేట(AswaraoPeta):
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావు పేట ప‌ట్ట‌ణంలోని డ్రైవ‌ర్ కాల‌నీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తికి క‌రోనా సోకింద‌న్న అనుమానంతో త‌న ఇంటి ముందు నిలిపిన ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని య‌జ‌మాని త‌గుల‌బెట్టాడు. వివరాల్లోకి వెళ్తే..ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జీలుగుమిల్లికి చెందిన ఓ యువ‌కుడు మంగ‌ళ‌వారం అశ్వారావుపేట లోని బంధువుల ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో బంధువుల ఇంటికి స‌మీపంలో ఉన్న మ‌రో ఇంటి ఎదుట త‌న ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని నిలిపాడు. స‌ద‌రు య‌జ‌మాని వ‌చ్చి "నీకు క‌రోనా ఉంది. మీ ప్రాంతంలోనూ క‌రోనా కేసులు ఉన్నాయి. అలాంట‌ప్పుడు ఇక్క‌డికి ఎందుకు వ‌చ్చావు? అని ప్ర‌శ్నించాడు. మా ఇంటి ముందుకు ఎందుకు వాహ‌నం  పెట్టావు. "అంటూ అదే వాహ‌నంలోని పెట్రోల్ తీసి త‌గ‌ల‌బెట్టాడు.ఈ ఘ‌ట‌న‌తో వాహ‌న‌దారుడు ఒక్క‌సారి షాక్‌కు గురైన ప‌రిస్థితి నెలకొంది. 

చ‌రిత్ర‌లో ఈ రోజు జూలై 15

1820 :  బెంగాల్ సాంస్కృతిక పున‌రుజ్జీవ‌న‌మున‌కు ఆద్యుల‌లో ఒక‌డైన అక్ష‌య్ కుమార్ ద‌త్తా                      జ‌న‌నం(మ.1886).
1885 : భార‌త స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు పి.ఏ.దాసు  పిళ్లై జ‌న‌నం(మ‌.1970)
1901:  భార‌త స్వాంతంత్య్ర స‌మ‌ర‌యోధుడు చెలికాని రామారావు జ‌న‌నం (మ‌.1985)
1902 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు మొట్ట‌మొద‌టి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, తొమ్మిద‌వ సుప్రీంకోర్టు ప్ర‌ధాన‌,              న్యాయ‌మూర్తి  కోకా సుబ్బారావు జ‌న‌నం(మ‌.1976)
1903 : భార‌త ర‌త్న పుర‌స్కార గ్ర‌హీత కె.కామ‌రాజ్ జ‌న‌నం (మ‌.1975)

No comments:

Post a Comment