Tuesday, July 14, 2020

వాట్సాప్ వేదిక‌గా త‌‌న బ‌లాన్ని చూపిన స‌చిన్‌..!నిబ్బ‌రంగా ఉన్న సీఎం..!

న్యూఢిల్లీ(New Delhi):
  రాజ‌స్థాన్‌లో రాజ‌కీయ క్రీడ రోజురోజుకో మ‌లుపు తిరుగుతోంది.  ఢిల్లీ నుండి అధిష్టానం సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ప్ప‌టికీ ఏమాత్ర‌మూ స‌మ‌స్య ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్టు ఏమీ క‌నిపించ‌డం లేదు. మ‌రో ప‌క్క ‌నేత‌ల బుజ్జ‌గింపుల‌తో స‌చిన్ ఫైల‌ట్ మెత్త‌బ‌డ్డార‌నే వార్త‌ల్లో పూర్తి వాస్త‌వం తెలియ‌డం లేదు కానీ అత‌ని వెంట మాత్రం 16 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు స‌చిన్ ఫైల‌ట్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి విడుద‌లైన వీడియో ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. సోమ‌వారం రాత్రి ఉన్న ఫైల‌ట్ వ‌ర్గం గురుగ్రామ్‌లోని మానెస‌ర్ హోట‌ల్‌లో త‌మ క్యాంపు వీడియోను ట్విట‌ర్‌లో పోస్టు చేసింది. 10 సెకండ్ల నిడివి గ‌ల ఈ వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు క‌నిపిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఇంద్రాగుర్జార్‌, ముఖేష్ భాక‌ర్‌, హ‌రీష్ మీనా, పీఆర్ మీనాను గుర్తించొచ్చు. అయితే, స‌చిన్ వీడియోలో క‌నిపించ‌లేదు. టూరిజం మినిస్ట‌ర్ విశ్వేంద్ర సింగ్ ఈవీడియోను ట్వీట్ చేశారు. 
లాదూన్ ఎమ్మెల్యే ముఖేష్ భాక‌ర్ ట్వీట్ చేస్తూ.."కాంగ్రెస్‌లో విధేయ‌త అంటే అశోక్ గ‌హ్లేత్ బానిస‌త్వం అని అన్నారు. "అది మాకు ఆమోద‌యోగ్యం కాదు. అని పేర్కొన్నారు. ఇక సోమ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) భేటీకి స‌చిన్ ఫైల‌ట్ వ‌ర్గం హాజ‌రుకానీ సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు సీఎల్పీ భేటీలో 106 మంది ఎమ్మెల్యేలు హాజ‌రయ్యార‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టించ‌గా, దానిని ఫైల‌ట్ వ‌ర్గం నేత‌లు త‌ప్పుబ‌ట్టారు. మెజారిటీ అసెంబ్లీలో నిరూపించు కోవాల‌ని, ఇంట్లో కాద‌ని వ్యాఖ్యానించారు. అలాగే, ఫైల‌ట్ బీజేపీలో చేర‌బోవ‌డం లేద‌ని వారు స్ప‌ష్టం చేశారు. 106 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంటే.."ఎమ్మెల్యేల‌ను గ‌వ‌ర్న‌ర్ వ‌ద్దుకు తీసుకెళ్లాలి కానీ, రిసార్ట్‌కు  కాద‌ని ఫైల‌ట వ‌ర్గం నేత‌లు ఎద్దేవా చేశారు. 
కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్షం నేడు మ‌రోసారి భేటీ కానుంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న హోట‌ల్‌లోనే ఆ స‌మావేశం జ‌రుగుతుంద‌ని సీనియ‌ర్ నేత సూర్జెవాలా వెల్ల‌డించారు. ఆ భేటీకి రావాల‌ని, అన్ని అంశాల‌పై అక్క‌డ స్వేచ్ఛ‌గా చ‌ర్చించుకోవ‌చ్చ‌ని తిరుగుబాటు నేత స‌చిన్ ఫైల‌ట్ కు సూచించారు. భేటీకి ఆహ్వానిస్తూ పైల‌ట్‌కు, అసంతృప్త ఎమ్మెల్యేల‌కు లేఖ‌లు పంపిచామ‌న్నారు.

ప్ర‌స్తుతానికి రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిదే పైచేయి..!

ర‌స‌వ‌త్త‌రంగా త‌యారైన రాజస్థాన్ రాజ‌కీయాల తొలి అంకంలో సీఎం అశోక్‌గ‌హ్లేత్‌ది పైచేయి అయింది. సోమ‌వారం జైపూర్‌లోని త‌న అధికారిక నివాసంలో అశోక్ గ‌హ్లోత్ పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం నిర్వ‌హించి, త‌న‌కు బ‌లం ఉంద‌ని చాటుకున్నారు. 200 మంది స‌భ్యులున్న అసెంబ్లీలో 109 మంది త‌మ ప‌క్షాన ఉన్న‌ట్టు ఆయ‌న వ‌ర్గం ప్ర‌క‌టించింది. ఈ స‌మావేశానికి 104 మంది హాజరై మ‌ద్దుతు ప‌లుక‌గా, మ‌రో ఐదుగురు లేఖ‌లు పంపిన‌ట్టు వెల్ల‌డించింది. తిరుగుబావుటా ఎగ‌రేసిన ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్‌ఫైల‌ట్ వ‌ర్గం దీనికి గైర్హాజ‌రైంది. అధిష్టానం ముమ్మ‌రంగా సాగించిన చ‌ర్చోప‌చ‌ర్చ‌ల మీద‌ట మంగ‌ళ‌వారం మ‌రోసారి సీఎల్పీని స‌మావేశ ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించారు. దానికి ఫైల‌ట్‌నూ ర‌ప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఫైలెట్ అడుగులేమిట‌న్న‌ది..ఏం చేబుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇవి చ‌ద‌వండి: ప్రియాంక‌గాంధీ రాజీ ఫార్ములాతో ఎంట్రీ..! మెత్త‌బ‌డిన స‌చిన్ ఫైల‌ట్‌..!

నిబ్బ‌రంగా ఉన్న సీఎం..!

గ‌హ్లోత్ శ‌క్తి సామ‌ర్థ్యాలు తెలిసిన వారు ఆయ‌న్ని త‌క్కువుగా అంచ‌నా వేయ‌డం లేద‌నేది తెలుస్తోంది. సీఎల్పీ స‌మావేశానికి ముందు గ‌హ్లోత్ త‌న‌యుడు వైభ‌వ్ గ‌హ్లోత్ వ్యాపార భాగ‌స్వాముల ఇళ్ల‌పై ఐటీ దాడులు చేయ‌డం కొంత కల‌క‌లం రేపిన‌ప్ప‌టికీ సీఎం మాత్రం ఎంతో నిబ్బరంగా తొలి అంకాన్ని పూర్తి చేశారు. సోనియాగాంధీపై, రాహుల్‌గాంధీపై, త‌న నాయ‌క‌త్వంపై సంపూర్ణ  విశ్వాసం ప్ర‌క‌టిస్తూ  శాస‌న‌స‌భాప‌క్షం ద్వారా ఆయ‌న ఏక‌గ్రీవం తీర్మానం చేయించు కున్నారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అందులో చెప్పించారు. ఎక్క‌డా ఫైల‌ట్ పేరు ప్ర‌స్తావించ‌కుండా మాట్లాడారు. 

రంగంలోకి ప్రియాంక‌, రాహుల్ గాంధీ..!

రాజ‌స్థాన్ లో ప‌రిస్థితుల‌ను చక్క‌దిద్ద‌డానికి పార్టీ అగ్ర‌నేత‌లు ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీ రంగంలోకి దిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. గ‌హ్లోత్‌, ఫైల‌ట్‌ల‌తో ఆమె మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తామ‌ని ఫైల‌ట్‌కు వారు భ‌రోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ త‌న స‌న్నిహిత మిత్రుడైన మ‌హారాష్ట్ర యువ  ఎంపీ రాజీవ్ స‌టావ్‌ను ఫైల‌ట్ వ‌ద్ద‌కు దూత‌గా పంపిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం కుమారుడు వైభ‌వ్ గ‌హ్లోత్ వ్యాపార భాగ‌స్వాములైన ధ‌ర్మేంద్ర రాథోడ్‌, రాజీవ్ అరోరాల ఇళ్ల‌పై  ఆదాయ‌పు ప‌న్నుశాఖ అధికారులు ఈ స‌మ‌యంలో దాడులు చేయ‌డాన్ని కాంగ్రెస్ నాయ‌క‌త్వం త‌ప్పుప‌ట్టింది. జైపూర్‌, కోటా, ఢిల్లీ, ముంబాయిల్లో 24 చోట్ల ఏక‌కాలంలో సోదాలు జరిగాయి. బీజేపీ నాయ‌క‌త్వం ఎప్పుడు ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేయాల‌న్నా ఆ పార్టీ "అనుబంధ" విభాగాలైన సీబీఐ, ఐటీ, ఈడీలు ముందు నిల‌బ‌డ‌తాయ‌ని, వీటిని అడ్డుపెట్ట‌కొని ప్ర‌జాస్వామ్యాన్ని దెబ్బ‌తీయాల‌ని ఆ పార్టీ చూస్తోంద‌ని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిది ర‌ణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఆరోపించారు. సీఎల్పీ స‌మావేశానికి ఫైల‌ట్‌తో పాటు, ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ఎమ్మెల్యేలు హాజ‌రుకాలేదు. 13 మంది స్వ‌తంత్రుల్లో 10 మంది గ‌హ్లోత్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు. సీఎల్పీ భేటీ త‌ర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ‌స్సుల్లో జైపూర్ శివార్ల‌లోని రిసార్టుకు వెళ్లి అక్క‌డ బ‌స చేశారు. మంగ‌ళ‌వారం అక్క‌డే మ‌రోసారి సీఎల్పీ స‌మావేశాన్ని నిర్వ‌హిం చ‌నున్నారు. "కుటుంబంలో స‌మ‌స్య‌లుంటే అంతా కూర్చొని వాటిని ప‌రిష్క‌రించు కుంటారు. స‌చిన్ ఫైల‌ట్‌తోపాటు ఎమ్మెల్యేలంగా మా కుటుంబ స‌భ్యులే. వారు సీఎల్పీ స‌మావేశాని హాజ‌రై, స‌మ‌స్య‌లుంటే చెప్పి ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. ఎంత పెద్ద ప‌ద‌వుల్లో ఉన్న వ్య‌క్తులైనా పార్టీ వేదిక ముందుకొచ్చి చ‌ర్చించుకోవాలి."అని సూర్జేవాలా పిలుపునిచ్చారు. 

No comments:

Post a Comment