Monday, July 13, 2020

సంపూర్ణ లాక్‌డౌన్ దిశ‌గా ప్ర‌భుత్వం..!

క‌ర్ణాట‌క :
వేగంగా విజృంభిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు బెంగుళూరు న‌గ‌రంతో  పాటు గ్రామీణ జిల్లాల్లో మంగ‌ళ‌వారం నుంచి వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌నుంది. లాక్‌డౌన్ తీరు తెన్నుల పై  ఆదివారం ఉద‌యం కావేరి అతిథి గృహంలో మంత్రులు, అధికారుల‌తో సీఎం యాడ్యూర‌ప్ప స‌మావేశ‌మై చ‌ర్చించారు. మంత్రి ఆర్‌.అశోక్‌, బీబీఎంపీ క‌మిష‌న‌ర్ అనిల్‌కుమార్‌, ఐఏఏస్ అధికారి రాజేంద్ర‌కుమార్ క‌టారియా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. క‌రోనా నియంత్ర‌ణకు ఏం చేయాల‌నేదానిపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. లాక్‌డౌన్‌ను క‌ట్టుదిట్టంగా అమ‌లు చేయాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. అయితే ఇత‌ర  జిల్లాల్లో కూడా లాక్‌డౌన్ విధిస్తే బాగుంటుంద‌నే అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. దీనిపై సోమ‌వారం క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని సీఎం తెలిపారు. ఇవి చ‌ద‌వండి : సంపూర్ణ లాక్‌డౌన్ దిశ‌గా ప్ర‌భుత్వం..!

యూపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..!

క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. శ‌ని, ఆదివా రాల్లో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు, మార్కెట్ల‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించింది. బ్యాంకులు, ప‌రిశ్ర‌మ‌లు మాత్రం య‌థావిధిగా న‌డుస్తాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు హోంశాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి అవనీష్‌కే అవ‌స్తీ ఆదివారం ప్ర‌క‌టించారు. అత్య‌వ‌స‌ర స‌రుకుల ర‌వాణా, ప‌రిశ్ర‌మ‌ల్లో ఉత్ప‌త్తి వంటి  ఇత‌ర ఆర్థిక కార్యాక‌లాపాల‌కు ఎలాంటి అవాంత‌రాలు ఉండ‌వ‌ని సృష్టం చేశారు. అలాగే వారాంతాల్లో సామాజిక కార్య‌క‌లాపాల‌పై క‌ఠిన  ఆంక్ష‌లు ఉంటాయ‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో శానిటైజేష‌న్ వంటి పారిశుధ్య ప‌నులు జ‌రుగుతాయ‌న్నారు. ఇక ప్ర‌భుత్వ‌,ప్రైవేటు కార్యాల‌యాలు వారానికి  కేవ‌లం ఐదు రోజులు మాత్ర‌మే ప‌నిచేస్తాయ‌న్నారు. ప్ర‌భుత్వ తాజా నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుశాఖ‌కు ఆదేశాలిచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో  55 గంట‌ల మినీ లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని విష‌యం తెలిసిందే. ఇది సోమ‌వారం ఉద‌యం 5 గంట‌ల‌తో ముగియ‌నుంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో శ‌నివారం కొత్త‌గా 1392 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 35,092 కు చేరింది. అలాగే మ‌ర‌ణాల సంఖ్య  913కు ఎగ‌బాకింది. 

No comments:

Post a Comment