Saturday, July 11, 2020

"టకాట‌క్" యాప్ వ‌చ్చింది..!చూశారా..!

న్యూఢిల్లీ(NewDelhi):
భార‌త్ ప్ర‌భుత్వం టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసిన అనంత‌రం ఈ యాప్‌కు ప్ర‌త్య‌మ్నాయంగా ప‌లు యాప్‌లు రోజురోజుకూ పుట్ట‌కొస్తున్నాయి. తాజాగా టిక్‌టాక్ మాదిరి ఎంఎక్స్ ప్లేయ‌ర్ "ట‌కాట‌క్" యాప్‌ను లాంచ్ చేసింది. ఇండియాలో టిక్‌టాక్ యాప్ ప్ర‌త్యామ్నాయంగా దీన్ని తీసుకొచ్చింది. ఎంఎక్స్ టకాట‌క్ రియ‌ల్‌, ఫ‌న్ వీడియోలను ఆఫ‌ర్ చేస్తుంది. వాటిని సోష‌ల్  మీడియా ప్లాట్ ఫామ్‌పై కూడా షేర్ చేసుకోవ‌చ్చు. డైలాగ్ డబ్బింగ్, కామెడీ, గేమింగ్‌, డీఐవై, ఫుడ్‌, స్పోర్ట్స్ , మెమీస్ లాంటి ప‌లు ర‌కాల వీడియోల‌ను ఈ యాప్‌లో బ్రౌజ్ చేయ‌వ‌చ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈయాప్ డిస్క్రిప్ష‌న్ ఉన్న‌ట్టు కంపెనీ చెప్పింది. ఈ యాప్‌లో షార్ట్ వీడియోల‌ను క్రియేట్ చేసుకోవ‌డంతో పాటు వీడియోల‌కు డ్యాన్స్‌లు చేయ‌డం, మూవీ డైలాగ్స్‌ను డ‌బ్ చేయ‌డం, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇత‌ర సోష‌ల్‌మీడియా ప్లాట్ ఫామ్స్‌లో వాటిని షేర్ చేయ‌డం వంటివి చేసు కోవ‌చ్చు. వీడియోల ఎడిటింగ్‌ను యాప్‌లో ఉన్న ఎడిటింగ్ ఫీచ‌ర్స్ ద్వారా ఎఫెక్ట్ ల‌ను యాడ్ చేసుకోవ‌చ్చు. ఇవి చ‌ద‌వండి: స‌చివాల‌యం కూల్చివేత:100 కోట్లు వృథా చేస్తున్నారు: ఎంపీ రేవంత్‌రెడ్డి
ఈ యాప్‌లో ట్రెండింగ్ అమేజింగ్‌, ఫ‌న్ వీడియోల‌ను బ్రౌజ్ చేసుకోవ‌చ్చు. సేవ్ అండ్ స్టేట‌స్‌..10 వేల వ‌ర‌కు స్టేట‌స్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. షూట్ అండ్ ఎడిట్‌..యూజ‌ర్లు ఎడిటింగ్ ఫీచ‌ర్లు ద్వారా వీడియోల‌ను క్రియేట్ చేసుకొని, ఆన్‌లైన్లో షేర్ చేసుకోవ‌చ్చు. బ్యూటీ క్యామ్‌...యూజ‌ర్లు బ్యూటీ ఎఫెక్ట్ల‌ను , ఫిల్ట‌ర్ను ఎంపిక చేసుకొని ఎడిటింగ్ చేసుకోవ‌చ్చు. వీడియో ఎడిట‌ర్‌..వీడియోల‌ను కంబైన్ చేయ‌వ‌చ్చు. వీడియో టైమింగ్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. ఫొటో ఎడిట‌ర్‌..మంచి మంచి ఫోటోను పిక్ చేసుకొని, మీ స్టోరీనీ క్రియేట్ చేసుకోవ‌చ్చు.  లాంగ్వేజ‌స్ స‌పోర్ట్‌..హిందీ, తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, బెంగాలి, గుజ‌రాతీ, మ‌రాఠీ, పంజాబీ, ఇంగ్లీష్ లాంగ్వేజీల‌లో ఇది స‌పోర్ట్ చేస్తుంది. ఈయాప్‌లో మ్యూజిక్ లైబ్ర‌రీ కూడా ఉంది. ఇది ఫ్రెష్ ఎడిట‌ర్ ఫిక్‌తో ఒక మ్యూజిక్ లైబ్ర‌రీని అందిస్తోంది. 

No comments:

Post a Comment