ఇప్ప‌టికైనా జాగ్ర‌త్త‌..! 67వేల మందిపై కేసులంట..!

 
క‌రోనా చైనాలో పుట్టిన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌తిఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని,మాస్కు‌లు ధ‌రించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని, శానిటైజ‌ర్ ధ‌రించాల‌ని నిత్యం ప్ర‌భుత్వం, అధికార యంత్రాంగం ప్ర‌చారం చేస్తున్నా..ప‌లువురు నిర్ల‌క్ష్యం వ‌హిస్తుండ‌టంతో క‌రోనా వైర‌స్  కేసులు పెరుగుతు న్నాయ ‌నేది నిజ‌మెరిగిన స‌త్యం. ప్ర‌స్తుతం ఉన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో  క‌రోనా మ‌ర‌ణాలు సంఖ్య పెర‌గ‌డం ఆందోళ‌న క‌రంగామారింది. 

హైద‌రాబాద్(Hyderabad) : ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌ ప్ర‌భుత్వం కాస్త వైర‌స్‌ను నియంత్రిం చేందుకు క‌ఠిన నిబంధ‌నల్లో భాగంగా మాస్క్ ధ‌రించ‌కుండా బ‌హిరంగంగా సంచ‌రించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా 67,557 మందిపై పోలీసులు ఈ - కేసులు పెట్టి కేసులు న‌మోదు చేశారు. మ‌రో 3,288 మందికి ఈ -చ‌లానాలు జారీ చేశారు. లాక్‌డౌన్ అమ‌లైన మార్చి 22 నుంచి జూన్ 30 వ‌ర‌కు 29 పోలీస్ యూనిట్ల ప‌రిధిలో ఈ కేసులు న‌మోద‌య్యాయి. హైద‌రాబాద్‌లో అత్య‌ధికంగా 14,931 మందిపై కేసులు న‌మోద‌య్యాయి. త‌ర్వాతి స్థానంలో రామ‌గుండం క‌మిష‌న‌రేట్‌(8,290), ఖ‌మ్మం(6,372), సూర్యాపేట‌(4,213), వ‌రంగ‌ల్‌(3,907) ఉన్నాయి. అత్య‌ల్పంగా జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో 173 కేసులు న‌మోద‌య్యాయి. 

లాక్‌డౌన్ అనుకూలంగా కొంద‌రు...

వ‌ద్ద‌ని మ‌రికొంద‌రు విన‌తులు..!

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర్ ప‌రిధిలో క‌రోనా కేసుల‌ను నియంత్రించేందుక రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టునున్న కార్యాచ‌ర‌ణ‌పై ఉత్కంఠ కొన‌సాగుతోంది. లాక్‌డౌన్ అమ‌లుపై సీఎం కేసీఆర్ నిర్ణ‌యం ఎలా ఉంటుందోన‌ని ర‌క‌ర‌కాల అంచ‌నాలున్నాయి. బుధ‌వారం మంత్రులు, నేత‌లు, ఉన్న‌తాధికారుల‌తో ఈ అంశంపై సీఎం విస్తృతంగా చ‌ర్చించారు. కొవిడ్‌ను అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన సూచ‌న‌ల‌లో భాగంగా లాక్‌డౌన్  విధింపున‌కు కొంత మంది అనుకూలంగా మాట్లాడారు. ప్ర‌తి రోజూ వెయ్యి చొప్పున కేసులు న‌మోద‌వుతున్నందున మ‌ళ్లీ అసాధ‌ర‌ణ చ‌ర్య‌ల అవ‌స‌రం ఉంద‌ని వారు పేర్కొన్నారు. 
రాష్ట్రానికి గుండెకాయ లాంటి  హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తే వ్య‌క్తిగ‌త ఆదాయాల‌తో పాటు రాష్ట్ర ఆదాయం దెబ్బ‌తింటుంద‌ని, ర‌వాణా,  నిత్యావ‌స‌రాల ల‌భ్య‌త‌, ధ‌ర‌ల పెరుగుద‌ల వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని మ‌రికొంద‌రు పేర్కొన్నారు. లాక్‌డౌన్ కు బ‌దులు నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌ర‌చ‌డం, ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌ను త‌గ్గించ‌డానికి  అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వారు సూచించారు. మ‌రో వైపు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్‌కుమార్ అధికారుల‌తో దీనిపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. క‌రోనా వ్యాప్తి విశ్లేష‌ణ‌, నివార‌ణ మార్గాలు, వైర‌స్ తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు, వైద్య‌ప‌ర‌మైన స‌న్న‌ద్ధ‌త‌, వివిధ శాఖ‌ల వారీగా ఆదాయాలు, రాష్ట్ర ప్ర‌భుత్వ అవ‌స‌రాలు, వాటికి అనుగుణంగా వ‌న‌రులు స‌మీక‌ర‌ణ మార్గాల గురించి నివేదిక రూపొందించారు. దీనిని గురువారం ఆయ‌న ముఖ్య‌మంత్రికి అంద‌జేయ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో సీఎం వివిధ అంశాల‌ను బేరీజు వేసి కార్యాచ‌ర‌ణ‌పై దృష్టి సారిస్తున్న‌ట్టు  తెలిసింది. ప్ర‌ధానంగా మంత్రిమండ‌లి స‌మావేశం నిర్వ‌హ‌ణ‌, లాక్‌డౌన్ విధించాలా ? వ‌ద్దా ? అనే దానిపై గురువారం నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే వీలుంది. 

తెలంగాణ‌లో 1,018 పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 4,234 టెస్టులు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 1,018 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,357 కి చేరింది. ఈమేర‌కు తెలంగాణ వైద్య‌, ఆరోగ్య శాఖ క‌రోనాపై హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. తాజాగా క‌రోనా నుంచి కోలుకున్న 788 మంది డిశ్చార్జ్ కావ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 8,082 గా న‌మోదైంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 9,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా నేడు క‌రోనాతో మ‌రో ఏడుగురు మృతి చెంద‌డంతో మొత్తం మృతుల సంఖ్య 267కి చేరింది. తాజాగా న‌మోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 881 ఉండ‌టం ఆందోళ‌న రేకిత్తిస్తోంది. 

Post a Comment

0 Comments