Friday, July 3, 2020

ఘోర ప్ర‌మాదం...బ‌స్సును ఢీకొట్టిన రైలు..19 మంది మృతి

పంజాబ్(Panjab)‌:
పాకిస్తాన్‌లో ఘోర్ శుక్ర‌వారం ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ రైల్వే క్రాసింగ్ వ‌ద్ద బ‌స్సును అతివేగంతో వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 19 మంది సిక్కు యాత్రికులు మృతిచెందారు.  మ‌రికొంద‌రికి గాయాలు కావ‌డంతో వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్ లోని షీకుపురా జిల్లా ఫ‌రీదాబాద్ ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 
స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఒకే కుటుంబానికి చెందిన 25 మంది యాత్రికులు మినీ బ‌స్సులో నంకానా సాహెబ్ కు వెళ్లారు. అక్క‌డ ప్రార్థ‌న‌ల అనంత‌రం గురుద్వారా స‌చ్ఛ‌సౌధాకు వెళ్లారు. ఈ క్ర‌మంలో ఫ‌రీదాబాద్ వ‌ద్ద రైల్వే క్రాసింగ్ దాటుతున్న స‌మ‌యంలో  క‌రాలీ - లాహెర్ షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్  రైలు బ‌లంగా ఢీకొట్టింది.  ఎక్స్ ప్రెస్ రైలు బలంగా ఢీకొట్ట‌డంతో బ‌స్సు తుక్కుతుక్కు అయ్యింది. రైలు ప‌ట్టాల‌కు ఇరువైపులా మృత‌దేహాలు చెల్లా చెదురుగా ప‌డిఉన్నాయి. 19 మంది ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతిచెందారు. స‌మాచారం అందిన వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇవి చ‌ద‌వండి: భార‌త్ -చైనా స‌రిహ‌ద్దు : సైనికుల్లో ఉత్తేజం నింపిన మోడీ ప్ర‌సంగం

No comments:

Post a Comment