Saturday, July 11, 2020

స‌చివాల‌యం కూల్చివేత:100 కోట్లు వృథా చేస్తున్నారు: ఎంపీ రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్(Hyderabad):
వాస్తు పేరుతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌చివాల‌యాన్ని కూల్చివేయ‌డం మంచిది కాద‌ని, తన కొడుకును సీఎం చేయ‌డం కోస‌మే స‌చివాల‌యం కూల్చివేస్తున్నార‌ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్ర‌హించారు." సెంటిమెంట్  త‌ప్పు కాదు, కానీ మూఢ‌న‌మ్మ‌కాలు మంచివికావు." రూ.100 కోట్లు వృథా చేస్తున్నార‌ని పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ  తెలంగాణ‌లో బ్లాక్‌డే అని కేసీఆర్ ఇత‌ర మ‌తాల విశ్వాసాలు, ఆచారాల‌ను దెబ్బ‌తీస్తున్నార‌ని మండిప‌డ్డారు. కోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని, మంత్రివ‌ర్గంలో తుదినిర్ణ‌యం తీసుకోలేద‌ని , తాము వేసిన పిటిష‌న్ను న్యాయ‌స్థానం తిర‌స్క‌రిం చిన‌ట్టు పేర్కొన్నారు. అన్ని ర‌కాల ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేకుండా ఎలా కూల్చుతారు?  కూల్చివేసిన గార్బెజ్‌ను ఎక్క‌డ వేస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. స‌చివాల‌యంలో మ‌సీదు, న‌ల్ల‌పోచ‌మ్మ గుడి, చ‌ర్చిని కూల్చార‌ని, తెలంగాణ ఉద్య‌మానికి న‌ల్ల‌పోచ‌మ్మ గుడి వేదికైంద‌ని గుర్తుచేశారు. ఇప్పుడు వాటిని కూల్చి ఆయా వ‌ర్గాల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రించాని ఆరోపించారు. స‌చివాల‌యాన్ని కూల్చేయాల‌ని సీఎస్ సోమేష్‌కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని కేసీఆర్ రాత్రికి రాత్రే ఆదేశించార‌ని, కాంగ్రెస్ నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేసి, ఎవ‌రిన్నీ శాశ్వ‌త నిర్మాణాలు చేయ‌వ‌ద్ద‌ని సుప్రీం కోర్టు తీర్పు ఉంద‌ని తెలిపారు. ఒక‌రిద్ద‌రు ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని, వారు స్వాగ‌తించ‌డం స‌రైంద‌ని కాద‌ని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ న‌ల్ల‌పోచ‌మ్మ గుడి, మ‌సీదు కూల్చితే బీజేపీ, మ‌జ్లిస్ పార్టీల నేత‌లు ఎందుకు స్పందించ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఇవి చ‌ద‌వండి:  తెలంగాణ‌లో మ‌హమ్మారి ప్ర‌భావం I పాజిటివ్ కేసులు ఎన్నంటే?Iక‌రోనా సోకింద‌ని భ‌ర్త‌ను వ‌దిలి వెళ్లిన భార్య‌..!

ఆల‌యం, మ‌సీదు నిర్మిస్తాం: సీఎం కేసీఆర్‌

స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌తో ఆల‌యం, మ‌సీదుకు ఇబ్బంది క‌ల‌గ‌డంపై సీఎం కేసీఆర్ విచారం వ్య‌క్తం చేశారు. స‌చివాల‌య స్థ‌లంలో ప్ర‌భుత్వ  ఖ‌ర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో ఆల‌యం, మ‌సీదు నిర్మిస్తామ‌న్నారు. భ‌వ‌నాలు కూల్చే క్రమంలో ప్రార్థ‌నామందిరాల‌పై శిథిలాలు ప‌డి కొంత న‌ష్టం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ఇలా జ‌ర‌గ‌డం ప‌ట్ల ఎంతో చింతిస్తున్నాన‌ని, ఇది కాక‌తాళీయంగా జ‌రిగింద‌ని, అంద‌రూ స‌హృద‌యంతో అర్థం చేసుకోవాల‌ని కోరారు. ప్రార్థ‌నామందిరాల‌కు ఇబ్బంది క‌లిగించ‌డం ప్ర‌భుత్వ ఉద్ధేశ్యం కాద‌ని, ఎన్ని కోట్ల‌యినా వెనుకాడ‌కుండా ఆల‌యం, మ‌సీదు నిర్మిస్తామ‌ని పేర్కొన్నారు. పూర్తి ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో నిర్మించి వాటిని సంబంధిత వ్య‌క్తుల‌కు అప్ప‌గిస్తామ‌ని తెలిపారు. దేవాల‌యం, మ‌సీదు నిర్వాహ‌కుల‌తో నేనే త్వ‌ర‌లోనే స‌మావేశ‌మ‌వుతాన‌ని అన్నారు. వారి అభిప్రాయాలు తీసుకొని, కొత్త సెక్ర‌టేరియ‌ట్ భ‌వ‌న స‌ముదాయంతో పాటుగా ప్రార్థ‌నా మందిరాల‌ను నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇస్తున్నాన‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. తెలంగాణ సెక్యుల‌ర్ రాష్ట్ర‌మ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొన‌సాగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 

No comments:

Post a Comment