Sunday, June 7, 2020

క‌రోనాతో TV5 జ‌ర్న‌లిస్ట్ మృతి

హైద‌రాబాద్(Hyderabad)
: క‌రోనాతో  TV5 జ‌ర్న‌లిస్ట్ మృతి చెందిన విషాద సంఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆదివారం చోటుచేసుకుంది. మ‌ద‌న్‌పేట‌కు చెందిన మ‌నోజ్ అనే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ TV5 చాన‌ల్‌లో క్రైమ్ రిపోర్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. గ‌త నాలుగు రోజుల నుంచి క‌రోనా ల‌క్ష‌ణాల‌తో గాంధీ ఆసుప్ర‌తిలో చేర‌గా చికిత్స పొందుతూ మృతి చెందారు.  జ‌ర్న‌లిస్ట్ మృతితో తెలుగు రాష్ట్రాల్లో తోటి జ‌ర్న‌లిస్టులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇవి చ‌ద‌వండి: సీఎం స‌మావేశం త‌ర్వాత‌నే రాయాలా? వ‌ద్దా..?
ప్ర‌స్తుతం తెలంగాణ‌లో శ‌నివారం ఒక్క‌రోజే 206 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా 10 మంది మృత్యువాత ప‌డ్డారు. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చ‌ల్ జిల్లాలో 18, నిర్మ‌ల్‌, యాద్రాద్రి జిల్లాల్లో ఐదు చొప్పున న‌మోద‌య్యాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని 4, జ‌గిత్యాల, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో 2 చొప్పున వికారాబాద్‌, జ‌న‌గామ‌, గ‌ద్వాల‌, న‌ల్గొండ‌, భ‌ద్రాద్రి, క‌రీంన‌గ‌ర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసున‌మో ద‌య్యాయి. శ‌నివారం నాటితో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,496 కు పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 1,710 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా, 1,663 మంది చికిత్స పొందుతున్నారు. 

No comments:

Post a Comment