Tuesday, June 30, 2020

గౌర‌వ‌నీయులైన భార‌త్ ప్ర‌భుత్వానికి....స్పందించిన టిక్‌టాక్‌..I"చింగారి"కి పెరిగిన డిమాండ్‌..!

ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

న్యూఢిల్లీ(NewDelhi): టిక్‌టాక్ తో స‌హా 59 చైనా యాప్స్ పై భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన నేప‌థ్యంలో టిక్‌టాక్ ఇండియా మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వినియోగ‌దారుల స‌మాచార భ‌ద్ర‌త‌, గోప్య‌త విష‌యంలో భార‌తీయ చ‌ట్టాల‌కు లోబ‌డి ఉన్న‌ట్టు పేర్కొంది. భార‌తీయ వినియోగ‌దారుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని విదేశీ ప్ర‌భుత్వాల‌తో చెప్పుకొచ్చింది. చైనాకు కూడా తాము ఎలాంటి స‌మాచారాన్ని అంద‌జేయ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. ఒక వేళ ఎవ‌రైనా భ‌విష్య‌త్తులో స‌మాచారం కోరినా..అంద‌జేసే ప్ర‌స‌క్తే లేద‌ని తెలిపింది. వినియోగ‌దారుల స‌మాచార భ‌ద్ర‌త‌, గోప్య‌త‌కే తాము అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పుకొచ్చింది. యాప్‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం అందింద‌ని టిక్‌టాక్ ఇండియా చీఫ్ నిఖిల్ గాంధీ తెలిపారు. దీనిపై కేంద్ర‌ప్ర‌భుత్వానికి వివ‌ర‌ణ ఇస్తామ‌ని చెప్పారు. టిక్‌టాక్‌ని భార‌తీయుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసేందుకు 14 భాష‌ల్లోకి మార్చామ‌న్నారు. చాలా మంది టిక్‌టాక్ పై ఆధార‌ప‌డి ఉపాధి పొందుతున్నార‌ని..టిక్‌టాక్‌ని నిషేధిస్తే వారంతా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటార‌ని చెప్పుకొచ్చారు. 

చింగారికి పెరిగిన డిమాండ్‌..!

తిండితిన‌కుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండ‌లేం అంటున్నారు కొంద‌రు టిక్‌టాక్ యూజ‌ర్లు. అందుకే టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్స్‌ల‌ను ప్ర‌భుత్వం నిషేధించ‌డంతో ముఖ్యంగా ప‌లువురు సెల‌బ్రిటీలు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్న‌ప‌లంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్ చేయాల్సిందే అనుకున్నారేమో వెంట‌నే టిక్‌టాక్ ప్ర‌త్యామ్నాయం ఏంటా అని శోధించారు.
అదృష్ట‌వ‌శాత్తూ మ‌న భార‌తీయులు త‌యారు చేసిన "చింగారి" యాప్ క‌ళ్లెదుట ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇంకే ముంది గంట‌లోనే ఈ యాప్ ల‌క్ష‌మంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్రస్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, బెంగాలీ, గుజ‌రాతీ, మ‌రాఠీ, క‌న్న‌డ‌, పంజాబీ, మ‌ల‌యాళం, త‌మిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపొందించిన చింగారి యాప్‌ను ప్రోత్స‌హించాలంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పారిశ్రామిక‌వేత్త ఆనంద‌మ‌హింద్రా సైతం "చింగారి" యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాని ప్ర‌త్యేక పీచ‌ర్స్‌ను వివ‌రించారు. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపుదిద్ద‌కున్న చింగారి యాప్ రూప‌క‌ర్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. మ‌రో విశేషం ఏంటంటే ఆనంద్ మ‌హింద్రా ఇప్ప‌టి వ‌ర‌కూ టిక్‌టాక్ యాప్‌ను మునుపెన్న‌డూ డౌన్‌లోడ్ చేసుకోలేదు. ఇవి చ‌ద‌వండి: ఆదేశాలు షురూ...ప్లేస్టోర్‌లో మాయ‌మైన యాప్‌లు..!

రూప‌క‌ర్త‌లు వీరే...

బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయ‌క్‌, సిద్ధార్థ గౌత‌మ్ గ‌తేడాది చింగారి యాప్‌ను రూపొందించారు. అయితే మ‌నోళ్ల‌కు విదేశీ వ‌స్తువులు, యాప్‌ల‌పై మోజెక్కువ కాబట్టి చింగారి యాప్ ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. కానీ తాజాగా 59 చైనా యాప్‌ల‌పై ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డంతో చింగారి యాప్ డౌన్‌లోడ్స్ పెరిగాయి. ఇప్ప‌టికే 1 మిలియ‌న్  మార్కును దాటేసి గూగుల్ ప్లే స్టోర్‌తో అగ్ర‌స్థానానికి చేరుకుంది. అంతేకాకుండా ప‌లు సామాజిక ప్లాట్‌ఫాంలు సైతం చింగారిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నార‌ని ప్రోగ్రామ‌ర్ నాయ‌క్ తెలిపారు. 59 చైనీస్ యాప్‌ల‌పై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని చింగారి యాప్ స‌హా వ్య‌వ‌స్థాప‌కుడు సుమిత్ ఘోష్ స్వాగ‌తించారు.డేటా త‌స్క‌రించి గూఢ‌చార్యానికి పాల్ప‌డ్డ యాప్‌ను భార‌త్ తిరిగి త‌న గూటికి చేర్చింద‌ని ప‌లువురు కేంద్రానికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.  

No comments:

Post a Comment