Monday, June 22, 2020

వ‌ర్మ‌..ఏడుద్ధామ‌న్నా క‌న్నీళ్లు ఇంకిపోయాయి:అమృత‌

హైద‌రాబాద్(Hyderabad):
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ మిర్యాల‌గూడ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ప‌రువు హ‌త్య‌కు సంబంధించిన నేప‌థ్యంలో మ‌ర్డ‌ర్ పేరుతో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 21 ఫాద‌ర్స్‌డే సంద‌ర్భంగా చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు రాంగోపాల్ వ‌ర్మ‌. ఓ తండ్రి త‌న కూతురిని అమితంగా ప్రేమిస్తే ఎలాంటి ప్ర‌మాదాలు ఎదుర‌వుతాయో ఈ సినిమాలో చూపించ‌బోతున్నాం. ఫాద‌ర్స్ డే రోజున‌..ఒక విషాధ‌బ‌రిత‌మైన నాన్న సినిమా పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రిస్తున్నా అని వ‌ర్మ ట్విట‌ర్ట లో పేర్కొన్నారు. 

స్పందించిన అమృత‌..!

తాజాగా ఈ పోస్టుపై మారుతీరావు కూతురు అమృత స్పందించారు. నా జీవితం ఇప్ప‌టికే చిన్నాభిన్నం అయ్యింది. ప్రేమించిన ప్ర‌ణ‌య్‌ని పోగొట్టుకున్నాను. తండ్రి ప్రేమ‌కి దూర‌మ‌య్యాను. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అంద‌రి ముందు దోషిగా నిల‌బ‌డాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో నా గురించి నా క్యారెక్ట‌ర్ గురించి ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు మాట్లాడుతున్నారు. నా చుట్టుప‌క్క‌ల వారికి త‌ప్ప నా గురించి ఎవ‌రికి తెలియ‌దు. భ‌ర్త‌ని, తండ్రిని కోల్పోయాను. నేను ఆత్మ‌గౌర‌వంతో బ‌తుకుతున్నాను. ఇప్పుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రూపంలో నాకు మ‌రో కొత్త స‌మస్య వ‌చ్చింది.ఇవి చ‌ద‌వండి: చిచ్చ‌ర‌పిడుగులు:స‌రిహ‌ద్దులో యుద్ధానికి సార్‌..!
ఏడుద్దామ‌న్నా క‌న్నీళ్లు ఇంకిపోయాయి. హృద‌యం బండ‌రాయిగా మారింది. నా జీవితాన్ని బ‌జారులో పెట్టొద్దు. రామ్ గోపాల్ వ‌ర్మ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తున్నాడ‌ని తెలిసిన‌ప్ప‌టి నుండి వ‌ణికిపోయాను. కొడుకుని చూసుకుంటూ, ప్ర‌శాంతంగా బతుకుతున్న స‌మ‌యంలో వ‌ర్మ అంద‌రి దృష్టి నాపై ప‌డేలా సినిమా చేస్తున్నాడు. వ‌ర్మ రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌కి, నాకు పోలిక లేదు. మా పేర్లు ఉప‌యోగించి డ‌బ్బులు దండుకోవాల‌ని చూస్తున్నాడు వ‌ర్మ‌. పేరు కోసం నీలాంటి ద‌ర్శ‌కుడు ఇంత నీచ‌స్థితికి దిగ‌జారుతాడ‌ని ఊహించ‌లేదు. మ‌హిళ‌ల‌ని గౌర‌వించ‌డం నీ త‌ల్లి నేర్పిస్తే బాగుండేది. నీపై ఏ కేసు పెట్ట‌ను. నీచ స‌మాజంలో నువ్వు ఒక‌డివే. ఎన్నో బాధ‌ల‌ని అనుభ‌వించిన నాకు ఈ బాధ పెద్ద‌దేం కాదు. రెస్ట్ ఇన్ పీస్ అని పేర్కొంది అమృత‌. 

స్పందించిన రాంగోపాల్ వ‌ర్మ‌..!

అమృత వ్యాఖ్య‌ల‌పై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన ఆర్జీవి.. మ‌ర్డ‌ర్ చిత్రం మూడు నైతిక సందిగ్ధ‌త‌ల నేప‌థ్యంలో రూపొందింది. మొద‌టిది... తండ్రి త‌న బిడ్డ‌ని నియంత్ర‌ణ‌లో ఉంచ‌డం రెండోది...ఒక కుమార్తె త‌న‌కు ఏది మంచితో తెలియ‌క‌పోయినా అనుకున్న‌ది చేయ‌డం. మూడోది...ఒక‌రి జీవితం కోసం మరొక‌రి జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవ‌డం స‌మ‌ర్థించ‌వ‌చ్చా..అనే అంశాల ఆధారంగా మ‌ర్డ‌ర్ తీస్తున్నామ‌ని వ‌ర్మ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఇవి చ‌ద‌వండి: ముంబైకి మ‌రో ముప్పు ఉందంట‌..!
మ‌ర్డ‌ర్ సినిమా విష‌యం అమృత దృష్టికి రావ‌డంతో ఆమె సూసైడ్ చేసుకోవాల‌ని అనుకున్న‌ట్టు కొన్ని వార్త‌లు చ‌దివాను. ఈ సినిమాని నిజ‌జీవిత క‌థ ఆధారంగా రూపొందిస్తున్నామే తప్ప‌, నిజ‌మైన క‌థ అని ఎక్క‌డ చెప్ప‌లేదు. గ‌తంలో రిల్‌లైఫ్‌..స్టోరీస్ ఆధారంగా నేను తీసిన చాలా సినిమాలు మంచి ఆద‌ర‌ణ పొందాయి. నేను కొంద‌రిని మంచివారిగా..మ‌రికొంద‌రిని చెడువారిగా చూపిస్తున్నానంటూ అనుకోవ‌డం మూర్ఘత్వం అని వ‌ర్మ స్ప‌దించారు.గుడ్‌న్యూస్ :క‌రోనా చికిత్స‌కు ఔష‌ధం విడుద‌ల‌
ప‌రిస్థితుల వ‌ల్లే మ‌నిషి చెడ్డ‌గా ప్ర‌వ‌ర్తిస్తార‌ని నేను న‌మ్ముతాను. అమృత లేదా మ‌రెవ‌రైనా బాధ అనుభ‌వించిన వారిపై చాలా గౌర‌వం ఉంది. వారి బాధ‌ల‌ని గౌర‌విస్తూ ...మ‌ర్డ‌ర్ సినిమాలో వారు ఎదుర్కొన్న ప‌ర్థితుల‌నే చూపించ‌బోతున్నాను...అని వ‌ర్మ త‌న సోష‌ల్‌మీడియా పేజీ ద్వారా తెలిపారు. 

No comments:

Post a Comment