Monday, June 8, 2020

పదోతరగతి విద్యార్థులకు శుభవార్త

హైదరాబాద్(Hyderabad):
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపద్యంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా 10వ తరగతి విద్యార్థులను పాస్ అయ్యే విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నల్, అసైన్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఇప్పటివరకు విద్యార్థుల్లోనే, వారి తల్లిదండ్రుల్లోనూ నెలకొన్న ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపశమనం లభించినట్లయింది. మొత్తం 5,34,903 మంది విద్యార్థులను ప్రమోద్ చేయనున్నారు. ఇంటర్నెల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు.
ఇక డిగ్రీ ,పీజీ పరీక్షల విషయంలో ను కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ తో రోజురోజుకు కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వవచ్చా..?
దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆ నష్టం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో కేసుల తీవ్రత మరింత పెరుగే అవకాశం ఉండటంతో ఇప్పట్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని బట్టి అర్థం అవుతోంది. ఈ పరిస్థితుల్లో వార్షిక పరీక్ష నిర్వహించకుండానే విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వవచ్చా అనే విషయమై గందరగోళం నెలకొనడంతో, అటు ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు యాజమాన్యాలు ఇంటర్నల్ మార్కుల ద్వారా పాస్ చేయవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం సోమవారం 10వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చేసే ఆలోచన చేశారు.

No comments:

Post a Comment