Saturday, June 20, 2020

ఎమ్మెల్యే రాజాసింగ్‌ గ‌న్‌మెన్‌కు క‌రోనా పాజిటివ్‌

RajaSingh
హైద‌రాబాద్(Hyderabad):
గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే బీజేపీ సీనియ‌ర్ నేత రాజాసింగ్ గ‌న్‌మెన్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. గ‌త కొన్ని రోజులుగా క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న అత‌డు..ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. త‌న కుటుంబంతో పాటుగా పార్టీ కార్య‌క‌ర్త‌లంద‌రి శాంపిల్స్‌ను కూడా డాక్ట‌ర్లు సేక‌రించార‌ని, రెండు రోజుల్లో రిపోర్టులు వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు. 

కార్వంటైన్‌లో ఉన్న అమ్మాయిల‌పై 

ఉద్యోగి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌..!

త్రిపుర(Tripura): క‌రోనాతో ఒక ప‌క్క అంద‌రూ భ‌యాందోళ‌న చెందుతుంటే మ‌రో ప్ర‌క్క హోం క్వారంటైన్‌లో ఉన్న ఇద్ద‌రు అమ్మాయిల‌ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు ఓ పంచాయ‌తీ రాజ్ ఉద్యోగి. ఈ సంఘ‌ట‌న నార్త్ త్రిపుర‌లోని ఉనాకోటి స‌మీపంలోని కుమార్ ఘాట్ ప్రాంతంలో వెలుగుచూసింది. క‌రోనా అనుమానంతో ముందు  జాగ్ర‌త్త‌గా ఇద్ద‌రు బాలిక‌ల‌ను అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇదే ప్రాంతానికి చెందిన పంచాయ‌తీ రాజ్ ఉద్యోగి రిజ‌బ్ కాంతిదేబ్‌, త‌న‌ను తాను పారా మెడిక‌ల్ సిబ్బందిగా ప‌రిచ‌యం చేసుకొని వెళ్లి,
వారి ఆరోగ్యాన్ని ప‌రిశీలించాలంటూ చెప్పి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు బాలిక తెలిపింది.వారిద్ద‌రూ ఫోన్ నెంబ‌ర్ల‌నూ తీసుకుని వారికి త‌రుచూ ఫోన్ చేసి వేధింపుల‌కు గురి చేశాడు. దీంతో విసిగిపోయిన బాలిక‌లు, విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, కేసు న‌మోదైంది. ఈ విష‌యం తెలుసుకున్న రిజ‌బ్‌, ప్ర‌స్తుతం ప‌రారీలో ఉండ‌గా పోలీసులు అత‌ని కోసం గాలిస్తున్నారు. 

No comments:

Post a Comment